Pushpaka Vimanam Review: పుష్పక విమానం రివ్యూ

Anand Deverakonda Pushpaka Vimanam Movie Review in Telugu |  Pushpaka Vimanam Review
x

Pushpaka Vimanam Review: పుష్పక విమానం రివ్యూ

Highlights

Pushpaka Vimanam Review: "దొరసాని" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆనంద్ దేవరకొండ "మిడిల్ క్లాస్ మెలోడీస్" అనే సినిమాతో ప్రేక్షకులని బాగానే...

Pushpaka Vimanam Review: "దొరసాని" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆనంద్ దేవరకొండ "మిడిల్ క్లాస్ మెలోడీస్" అనే సినిమాతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు. తాజాగా ఇప్పుడు "పుష్పక విమానం" అనే సినిమాతో మళ్లీ మన ముందుకు వచ్చాడు. దామోదర్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆనంద్ దేవరకొండ అన్నయ్య విజయ్ దేవరకొండ ఈ సినిమాని స్వయంగా కింగ్ అఫ్ ది హిల్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించారు. ట్రైలర్ తోనే ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ అనగా నవంబర్ 12న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా..

  • చిత్రం: పుష్పక విమానం
  • నటీనటులు: ఆనంద్ దేవరకొండ, గీత సైనీ, శాన్వి మేఘన, హర్ష, అజయ్, నరేష్, సునీల్, తదితరులు
  • సంగీతం: అమిత్ దాసాని, మార్క్ కే రాబిన్
  • సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్
  • నిర్మాత: విజయ్ దేవరకొండ
  • దర్శకత్వం: దామోదర్
  • బ్యానర్: కింగ్ ఆఫ్ ది హిల్స్
  • విడుదల తేది: 12/11/2021

కథ:

సుందర్ (ఆనంద్ దేవరకొండ) ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. గవర్నమెంట్ టీచర్ గా పని చేస్తూ ఉంటాడు. మీనాక్షి (గీత సైనీ) ను పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్లాలని అనుకుంటూ ఉంటాడు. కానీ పెళ్లయిన కొద్ది రోజులకే మీనాక్షి కనిపించకుండా పోతుంది. ఆమె ఎవరితోనో లేచిపోయింది అని అనుకున్న సుందర్ ప్రపంచానికి మాత్రం తాను సంతోషంగా ఉన్నట్టు నిరూపించాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని భార్య మీనాక్షి నిజంగానే లేచిపోయిందా? అసలు నిజం ఏంటి? సుందర్ తన భార్య ఎక్కడుందో కనిపెట్టగలిగాడా? చివరికి ఏమైంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ నటన పరంగా చాలా మెచ్యూరిటీ ని కనబరిచాడు. కొత్తగా పెళ్లయిన ఒక గవర్నమెంట్ టీచర్ పాత్రలో ఆనంద్ దేవరకొండ చాలా బాగా నటించాడు. తనకి ఇచ్చిన పాత్ర అంత స్ట్రాంగ్ గా లేనప్పటికీ ఆనంద్ దేవరకొండ నటన పరంగా తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. గీత సైనీ పాత్ర కి పెద్దగా ప్రాధాన్యత లేదు. కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఆమె తెరపై కనిపించింది తక్కువే కానీ నటన పరంగా మంచి మార్కులే వేయించుకుంది.

శాన్వి మేఘన కూడా సినిమాలో చాలా బాగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. పోలీస్ ఆఫీసర్ గా సునీల్ చాలా బాగా నటించారు. నరేష్ మరియు హర్షవర్ధన్ మంచి నటనను కనబరిచారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతికవర్గం:

కొత్త దర్శకుడు అయినప్పటికీ దామోదర ఈ కథని చాలా బాగా ముందుకు తీసుకువెళ్లారు. దర్శకుడు మొదటి హాఫ్ మొత్తం కొత్తగా పెళ్లయిన అమ్మాయి కి ఏమైంది, ఆమె నిజంగానే ఎవరితో వెళ్లిపోయిందా లేకపోతే ఆమెని ఎవరైనా చంపేశారా అనే విషయం పై సస్పెన్స్ ని చాలా బాగా క్రియేట్ చేశారు.

కథ సింపుల్ గానే ఉన్నప్పటికీ తన నేరేషన్ తో బాగానే ఆసక్తికరంగా మార్చారు దర్శకుడు. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు అని చెప్పుకోవచ్చు. సంగీతం ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా మార్క్ కే రాబిన్ నేపథ్య సంగీతం చాలా సన్నివేశాలని ఎలివేట్ చేసినట్లు అనిపించింది. హెస్టిన్ జోసఫ్ సినిమాకి మంచి విజువల్స్ అందించారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ పర్వాలేదు అనిపించింది.

బలాలు:

  • కామెడీ
  • నటీనటులు
  • నేపథ్య సంగీతం

బలహీనతలు:

  • కథ స్ట్రాంగ్ గా లేకపోవడం
  • రన్ టైం ఎక్కువగా ఉండటం
  • సెకండ్ హాఫ్ లో ని డ్రాగింగ్ సన్నివేశాలు

చివరి మాట:

సినిమాలో కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ బాగానే ఉన్నప్పటికీ రైటింగ్ చాలా వీక్ గా అనిపిస్తుంది. నెరేషన్ మాత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. అక్కడక్కడా కామెడీ సన్నివేశాలు బాగానే ఉన్నప్పటికీ సినిమా ఆద్యంతం ఆకట్టుకోలేకపోయింది. ఫస్టాఫ్ కామెడీ మరియు సస్పెన్స్ తో బాగానే నటించినప్పటికీ సెకండ్ హాఫ్ చాలా బోరింగ్ గా స్లోగా నడుస్తుంది. స్క్రీన్ ప్లే పేపర్ మీద బాగానే అనిపించి ఉండొచ్చు కానీ తెరపై మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.

అసలు ఏం జరిగింది అనేది తెలిసిపోయిన తర్వాత సినిమాపై అంతగా ఆసక్తి ఉండదు. సస్పెన్స్ కామెడీ కాస్త ఎమోషనల్ డ్రామా గా మారిపోయింది. కథ చాలా వరకు ప్రెడిక్టబుల్ గా అయిపోయింది చివరిగా పుష్పక విమానం సినిమా అక్కడక్కడ మాత్రమే ప్రేక్షకులను అలరించింది.

బాటమ్ లైన్:

అనుకున్నంత ఎత్తుకు ఎగిరి లేకపోయినా "పుష్పక విమానం".

Show Full Article
Print Article
Next Story
More Stories