అక్కడ అల వైకుంఠపురములో వచ్చేసింది..ఎలావుందంటే..

అక్కడ అల వైకుంఠపురములో వచ్చేసింది..ఎలావుందంటే..
x
అల వైకుంఠపురములో
Highlights

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ వెనక్కి తగ్గాడు అనుకున్నారు కానీ తగ్గలేదు. మహేష్ తో సై అంటే సై అన్నాడు. ఎందులో అనుకుంటున్నారా, సరిలేరు నీకెవరు జనవరి...

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ వెనక్కి తగ్గాడు అనుకున్నారు కానీ తగ్గలేదు. మహేష్ తో సై అంటే సై అన్నాడు. ఎందులో అనుకుంటున్నారా, సరిలేరు నీకెవరు జనవరి 11 న రిలీజ్ అయింది, అయితే బన్నీ కూడ తన సినిమా అల వైకుంఠపురములో ని జనవరి 11 నే రిలీజ్ చేసేసాడు. అదేంటి? జనవరి 12 న కదా రిలీజ్ అయ్యేది, కానీ బన్నీ మహేష్ తో జనవరి 11నే వచ్చేసాడు అది USA లో ప్రీమియర్ షోలు ఆల్రెడీ వేసాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, మరి ఎలా ఉంది అసలు కథేంటి అనేది చూద్దాం.

కథ

బన్నీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి నిరుద్యోగి జాబ్ కోసం ట్రై చేసి ఓ పెద్ద కంపెనీలో జాయిన్ అవుతాడు. ఓనర్ అయిన పూజ హెగ్డే కి అసిస్టెంట్ ఆత్మాభిమానంకు. మంచి కి చాలా విలువ ఇస్తుంటాడు. ఆస్తులు కంటే విలువైనంది బంధాలు అని భావిస్తుంటాడు. తను ఆచరిస్తు అందరు ఆచరించేలా చేస్తుంటాడు. ఇది నచ్చిన పూజ హెగ్డే బన్నీతో లవ్ లో పడుతుంది. సినిమా మొత్తం కూడ చాలా కామెడీ ఎంటర్ టైనర్ గా వుంటుంది. బన్నీ, మురళి శర్మ మధ్య వచ్చే కామెడీ సినిమాకు చాలా హైలైట్. ఇక సెకండాప్ లో అసలు బన్నీ ఎవరు అనేది ట్విస్ట్. ఎంతో ఉత్కంటకు గురి చేస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన ల్ సీన్ చాలా హైలైట్ అని చెప్పాలి. మొత్తానికి బన్నీకి గ్యాప్ వచ్చింది ఈ సినిమా తర్వాత ఇక గ్యాప్ మాత్రం రాదు మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులను బాగా ఎంటర్ టైనర్ చేస్తుంది.

ఇక సినిమాకు ప్లస్ పాయింట్స్.

సినిమా మొత్తం కామెడీ ఎంటర్ టైనర్ సెకండాప్ లో ఫ్యామిలీ ఎమోషన్స్.

తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సీన్స్ కన్నీళ్లు తెప్పిస్తాయి.

పూజా హెగ్డే నటన సూపర్, ఇక తమన్ మ్యూజిక్ చాలా హైలైట్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సామజ వరగమన...' పాటతో పాటు అన్ని సాంగ్స్ బాగున్నాయి.

ఫైనల్ గా అలా వైకుంఠపురం మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనమెంట్ సినిమా అని చెప్పోచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories