Most Eligible Bachelor Review: "మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్" మూవీ రివ్యూ

Akkineni Akhil New Movie Most Eligible Bachelor Movie Review
x

 "మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్" మూవీ రివ్యూ

Highlights

Most Eligible Bachelor Review: అక్కినేని అఖిల్, పూజ హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై...

Most Eligible Bachelor Review: అక్కినేని అఖిల్, పూజ హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15న దసరా కానుకగా విడుదలయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రం ఎలా ఉందో చూసేద్దమా..

చిత్రం: మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్

నటీనటులు: అక్కినేని అఖిల్, పూజ హెగ్డే, ఇషా రెబ్బ, ఆమని, మురళి శర్మ తదితరులు

సంగీతం: గోపి సుందర్

సినిమాటోగ్రఫీ: ప్రదీష్ వర్మ

నిర్మాత: బన్నీవాసు

దర్శకత్వం: భాస్కర్

బ్యానర్: గీతా ఆర్ట్స్

విడుదల తేది: 15/10/2021

కథ:

హర్ష (అఖిల్) న్యూయార్క్ నగరానికి చెందిన ధనిక కుటుంబానికి చెంది అక్కడే స్థిరపడిన ఒక బ్యాచిలర్. తన కోసం ఒక వధువు దొరుకుతుందనే ఆశతో అతను కొన్ని పెళ్లి సంబంధాలు హాజరు కావడానికి ఇరవై రోజుల పాటు ఇండియాకి వెళ్తాడు. సాంప్రదాయ మూలాలతో ఉమ్మడి కుటుంబంలో పెరిగిన అతనికి తన భవిష్యత్ జీవిత భాగస్వామి పై కొన్ని అంచనాలతో పెళ్లి సంబంధాలు చూడటానికి వెళ్తుంటాడు. వృత్తిపరంగా స్టాండ్-అప్ కమెడియన్ విభా (పూజ)ను ఒక సందర్భంలో హర్ష కలుస్తాడు. ఆమెతో కలిసినడిచే ప్రయాణంలో విభాని గెలిపించడానికి హర్ష చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది మిగిలిన సినిమా కథ.

నటీనటులు:

అక్కినేని అఖిల్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పూజ హెగ్డే స్టాండ్-అప్ కమెడియన్ పాత్రలో ఒదిగిపోయింది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనుల కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఆమని, మురళి శర్మ చినేమలోని తమ తమ నటనతో పాత్రకి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం:

గోపి సుందర్ సంగీతంతో ఆకట్టుకోగా, దర్శకుడు భాస్కర్ ఫస్ట్ఆఫ్ లో పై చూపిన శ్రద్ధ సెకండాఫ్ పై చూపించలేదని అర్ధమవుతుంది. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు చిత్రాన్ని మంచి నిర్మాణ విలువలతో తెరకెక్కించాడు. ప్రదీష్ వర్మ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

  • అఖిల్, పూజా హెగ్డే నటన
  • ఫస్ట్ ఆఫ్
  • గోపీ సుందర్ సంగీతం
  • స్క్రీన్‌ప్లే
  • కామెడీ ట్రాక్

మైనస్ పాయింట్స్ :

  • సెకండ్ ఆఫ్
  • స్లో నేరేషన్

బాటమ్ లైన్ : ఫస్ట్ ఆఫ్ బొమ్మరిల్లు.., సెకండ్ ఆఫ్ ఆరెంజ్ సినిమాలను గుర్తు చేయనున్నాడు మన బ్యాచిలర్

Show Full Article
Print Article
Next Story
More Stories