పోలీసు స్నేహితుడు

పోలీసు స్నేహితుడు
x
Highlights

ఆడుకోడానికి ఎవరూ లేరు. ఇంట్లో ఏం చేయాలో తెలీటం లేదు. అమ్మను అడిగినా లాభం లేకపోయింది. దాంతో ఫ్లోరిడా లో ఓ ఆరేళ్ళ పిల్లాడు ఏంచేశాడో చూడండి.. నచ్చినట్టు...

ఆడుకోడానికి ఎవరూ లేరు. ఇంట్లో ఏం చేయాలో తెలీటం లేదు. అమ్మను అడిగినా లాభం లేకపోయింది. దాంతో ఫ్లోరిడా లో ఓ ఆరేళ్ళ పిల్లాడు ఏంచేశాడో చూడండి.. నచ్చినట్టు జీవించడం, లోపల ఏం పెట్టుకోకుండా ఏది అనిపిస్తే అది మాట్లాడటం కేవలం పిల్లలకు మాత్రమే దొరికిన వరం. అందుకేనేమో ఫ్లోరిడాలో ఓ ఆరేళ్ల పిల్లోడు తనతో ఎవరూ ఆడుకోవడం లేదని ఏకంగా 911కు ఫోన్ చేసి పోలీసులకు చెప్పాడు. అంతేకాకుండా తనకు ఆడుకోవడానికి ఓ స్నేహితుడు కావాలని అడిగాడు. ఇదేదో తలనొప్పి వ్యవహారం అని వదిలేయకుండా వైట్ అనే పోలీస్ అధికారి పిల్లోడి ఇంటికి వచ్చాడు. తాను స్నేహితుడిని అవ్వడానికి సిద్దంగా ఉన్నానని, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా స్నేహితుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో అంటూ పిల్లోడి బాధను అర్థం చేసుకుంటూ మాట్లాడాడు. అనంతరం 911కు ఎలాంటి సమయంలో ఫోన్ చేయాలో పిల్లోడికి అర్థమయ్యేలా వివరించాడు. విశేషమేంటంటే.. పిల్లోడికి సోదరులు కూడా ఉన్నారు. తన తల్లితో గొడవ పెట్టుకుని స్నేహితులు కావాలంటూ తల్లికి కూడా తెలియకుండా పోలీసులకు ఫోన్ చేశాడు. అధికారి వైట్ పిల్లోడిని పోలీస్ కారులో కూడా ఎక్కించుకుని తిప్పాడు. తరువాత ఓ కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని తలహశ్సీ పోలీస్ డిపార్ట్ మెంట్ తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. పోస్ట్ చదివిన వారందరూ పోలీస్ అధికారిని ప్రశంసించడం మొదలుపెట్టారు. పిల్లోడిపై కోపగించుకోకుండా తన బాధను అర్థం చేసుకున్న వైట్‌కు హాట్సాఫ్ అంటూ కొనియాడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories