పెద్దరికం సినిమా!

పెద్దరికం సినిమా!
x
Highlights

కొన్ని సినిమాలు ఒక ట్రెండ్ ని సృస్టిస్తాయి, అలాంటి సినిమానే పెద్దరికం సినిమా. ఇది 1992లో ఎ. ఎం. రత్నం దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు...

కొన్ని సినిమాలు ఒక ట్రెండ్ ని సృస్టిస్తాయి, అలాంటి సినిమానే పెద్దరికం సినిమా. ఇది 1992లో ఎ. ఎం. రత్నం దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రము. ఇందులో జగపతి బాబు, సుకన్య నాయకా నాయికలుగా నటించారు. రాజ్ కోటి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అడుసుమిల్లి బసవపున్నమ్మ గా భానుమతి నటన, పర్వతనేని పరశురామయ్య గా మలయాళ నటుడు అయిన ఎన్. ఎన్. పిళ్ళై గురించి. ఈ సినిమాలో తను జగపతిబాబు తండ్రి పాత్రలో నటించి మెప్పించాడు. పగలకు ప్రతీకరాలకు నడుమ నలిగే ప్రేమ జంట కథ అయిన చాల విభిన్నంగా తెరకెక్కించారు. మీరు ఇప్పటివరకు ఈ సినిమా చూడకుంటే ఒక సారి చూడవచ్చు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories