Telangana Budget 2024 Live Updates: తెలంగాణ బడ్జెట్ లైవ్‌ అప్‌డేట్స్‌.. రైతు భరోసా కింద రైతులకు ఏటా రూ. 15 వేలు

Telangana Budget Live Updates: మల్లు భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఆయన బడ్జెట్ పద్దును సమర్పించారు.

శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రూ.2,20,945 కోట్లు రెవిన్యూ వ్యయం,మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా బడ్జెట్ ప్రతిపాదించింది రేవంత్ రెడ్డి సర్కార్.


Show Full Article

Live Updates

  • 25 July 2024 7:10 AM GMT

    మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ. 1500 కోట్లు

    మూసీ నది నీటిని శుద్ది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత యూకే ప్రభుత్వంతో ఈ విషయమై చర్చలు జరిపారు. హైద్రాబాద్ నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులను యూకేకు తీసుకెళ్లి ప్రభుత్వం ఈ విషయమై చర్చించింది. ఈ క్రమంలోనే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ. 1500 కోట్లు కేటాయించింది.

    హైద్రాబాద్ రింగ్ రోడ్డుతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,525 కోట్లు కేటాయిస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. పాతబస్తీలో మెట్రో విస్తరణకు రూ. 500 కోట్లు కేటాయించారు. మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు రూ. 50 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు.

  • 25 July 2024 7:02 AM GMT

    జీహెచ్ఎంసీలో మౌలిక వసతులకు రూ. 3,065 కోట్లు

    జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ.3,065 కోట్లు కేటాయించింది. హెచ్ఎండీఏలో కూడా మౌలిక వసతుల కోసం రూ.500 కోట్లను కేటాయించినట్టుగా ప్రభుత్వం తెలిపింది. మెట్రో వాటర్ వర్క్స్ కు రూ.3,385 కోట్లు, హైడ్రా సంస్థకు రూ. 200 కోట్లను కేటాయించినట్టుగా భట్టి విక్రమార్క వివరించారు. హైద్రాబాద్ నగర అభివృద్దికి రూ. 10 వేల కోట్లు కేటాయించారు. విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రూ. 100 కోట్లు కేటాయించినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది.

  • 25 July 2024 6:57 AM GMT

    రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకానికి రూ. 723 కోట్లు

    రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.723 కోట్లను కేటాయించింది. 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్ ను అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకానికి ప్రభుత్వం రూ. 2,418 కోట్లను కేటాయించింది.

  • 25 July 2024 6:52 AM GMT

    రూ.2.91 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

    రూ. 2లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను రేవంత్ సర్కార్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. మూలధన వ్యయం రూ.33 వేల 487 కోట్లుగా ఉందని ప్రభుత్వం తెలిపింది. రెవిన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లుగా ఉందని భట్టి తెలిపారు.రాష్ట్ర అప్పులు రూ.6.70 లక్షల కోట్లకు పెరిగాయని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అప్పులు రూ.35,118 కోట్లని ఆయన వివరించారు. బీఆర్ఎస్ సర్కా్ర్ చేసిన అప్పులకు వడ్డీలతో కలిపి రూ. 42,892 కోట్లను చెల్లించామన్నారు.

  • 25 July 2024 6:45 AM GMT

    అప్పుల కుప్పలా మార్చారు: కేసీఆర్ సర్కార్ పై భట్టి విమర్శలు

    బీఆర్ఎస్ అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో దశాబ్దకాలంలో తెలంగాణ పురోగతి సాధించలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. అన్ని రంగాల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. పదేళ్లలో అప్పు పదిరెట్లు పెరిగిందని ఆయన చెప్పారు. ఒంటెత్తు పోకడలతో సొంత జాగీరులా గత పాలన సాగిందన్నారు. దీంతో రాష్ట్ర పరిస్థితి అప్పుల కుప్పలా మారిందన్నారు. నాణ్యత లేని పనులతో సాగునీటి ప్రాజెక్టులు ఫలితాలు ఇవ్వలేదని పరోక్షంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని భట్టి ప్రస్తావించారు. రైతుల సాగునీటి సమస్యలు పరిష్కరించలేదన్నారు.

  • 25 July 2024 6:35 AM GMT

    అసెంబ్లీకి హాజరైన కేసీఆర్

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారాన్ని కోల్పోయిన తర్వాత బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేసీఆర్ పాల్గొనలేదు. అయితే ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు రావాలని సీఎం సహా పలువురు మంత్రులు పలుమార్లు కోరారు.

  • 25 July 2024 5:56 AM GMT

    అసెంబ్లీకి బయల్దేరిన కేసీఆర్

    ప్రతిపక్షనేతగా మొదటిసారి సభలో అడుగుపెట్టనున్న కేసీఆర్

  • 25 July 2024 5:56 AM GMT

    బడ్జెట్‌ ప్రతిని స్పీకర్ కు అందించిన భట్టి

    బడ్జెట్ ప్రతిని స్పీకర్ కు అందించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఈ ఏడాది ఫిబ్రవరిలో రేవంత్ సర్కార్ రూ. 2.75 లక్షలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇవాళ ప్రవేశ పెట్టే బడ్జెట్ రూ. 2.85 నుంచి రూ.2.90 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్దికి భారీగా నిధులను కేటాయించే అవకాశం ఉంది.

  • 25 July 2024 5:34 AM GMT

    బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్

    బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీకి కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకానున్నారు.

    తెలంగాణ బడ్జెట్‌పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 2 లక్షల, 75వేల, 891 కోట్లు ఓటాన్ అకౌంట్ ‌ను ప్రవేశపెట్టింది. ఈసారి 2.97లక్షల కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. అభివృద్ధి- సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ను తయారు చేసిన సర్కార్..ఆరు గ్యారెంటీలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.

Print Article
Next Story
More Stories