పాట అని తలుచుకోగానే మొదట మెదిలే పేరు ఆయనదే.. ముత్యాలు వస్తావా అని పాడి నవ్వించినా.. శంకరా నాదశరీరాపరా అని సంగీత సుస్వారలతో మైమరిపించినా.. నవ్వింది మల్లె చెండు అంటూ కుర్రకారును గిలిగింతలు పెట్టినా.. ఆ గాన గాంధర్వానికి మురిసిపోని హృదయం లేదు.
పాట అని తలుచుకోగానే మొదట మెదిలే పేరు ఆయనదే.. ముత్యాలు వస్తావా అని పాడి నవ్వించినా.. శంకరా నాదశరీరాపరా అని సంగీత సుస్వారలతో మైమరిపించినా.. నవ్వింది మల్లె చెండు అంటూ కుర్రకారును గిలిగింతలు పెట్టినా.. ఆ గాన గాంధర్వానికి మురిసిపోని హృదయం లేదు. ఒకటా రెండా 40 వేలకు పైగా పాటలు.. అదీ ఇదీ అని లేకుండా 11 భాషలు..అలుపనేది లేకుండా నాలుగు దశాబ్దాల సినీ గాత్ర ప్రస్థానం.. ప్రజల ఆరాధ్య గాయకుడిగా నిలిచిన తెలుగు తేజం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం! కొన్ని పాటలు ఆయన పాడితే బావుండును అనిపిస్తుంది.. మరికొన్ని అబ్బా ఈయన పాడాడేమిటి అనిపిస్తుంది..కానీ, బాలు పాడితే ఏ పాటైనా అయన కోసమే పుట్టిందా అనిపిస్తుంది. ఆయన గొంతు జాతీయస్థాయి సినీ నటులకు ఆలంబనగా నిలిచింది. ఆయన స్వరం ఎందరో ప్రసిద్ధ నటులకు గాత్రభిక్ష అందించింది. అంతెందుకు బాలూ పాడితే ఆయన గొంతులో నటుల గాత్రం ఒదిగిపోతుంది. తెలుగు సినిమా.. కాదు భారతీయ సినిమా ఉన్నంత వరకూ బాలసుబ్రహ్మణ్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. భారత సినీమా తల్లికి స్వరాభిషేకం చేసి.. పాడుతా తీయగా అంటూ మన మధ్యలోనే ఎప్పటికీ.. మన గుండెల్లోనే ఎన్నటికీ.. అయన స్థానం చెదరదు. ఎందుకంటే నభూతో.. నభవిష్యతి.. అనే మాటకి సరిగ్గా సరిపోయే పాటసారి మన బాలూ!
దివికేగిన బాల సుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ..
Live Updates
- 25 Sep 2020 10:34 AM GMT
SP Balasubrahmanyam live updates: మిస్ యూ బాలు: రజినీ
‘చాలా సంవత్సరాలు నా పాటలకు గొంతును అందించారు. మీ స్వరం, పాటలు, జ్ఞాపకాలు నాతో ఎల్లప్పుడూ ఉంటాయి. మిస్ యూ బాలు సర్'
#RIP Balu sir ... you have been my voice for many years ... your voice and your memories will live with me forever ... I will truly miss you ... pic.twitter.com/oeHgH6F6i4
— Rajinikanth (@rajinikanth) September 25, 2020 - 25 Sep 2020 9:07 AM GMT
SP Balasubrahmanyam live updates : ఆయన లేకపోవడం భారతీయ సినిమాకు చాలా నష్టం: మంచు మనోజ్
SP Balasubrahmanyam live updates : బాలసుబ్రహ్మణ్యం గారు లేరని విన్నందుకు తీవ్ర మనోవేదనతో నా గుండె విరిగింది. అయన లేకపోవడం భారతీయ సినిమాకు చాలా నష్టం. ఆయన కుటుంబానికి నా ప్రగాడ సంతాపం! సర్ మీరు ఎల్లప్పుడూ మా హృదయాలలోనే ఉంటారు.
Deeply saddened & heart broken to hear that the legendary singer #SPBalasubrahmanyam garu is no more. Great loss to Indian cinema. May his soul rest in peace 🙏
— MM*🙏🏻❤️ (@HeroManoj1) September 25, 2020
My deepest condolences to his family! Sir you will always be in our hearts and souls 🙏#ripspb pic.twitter.com/EbpL0yjvki - 25 Sep 2020 9:01 AM GMT
SP Balasubrahmanyam live updates : ఓ దేవుడా.. నా గుండె ముక్కలైంది : హ్యారిస్ జైరాజ్
SP Balasubrahmanyam live updates : ఓ దేవుడా! బాలసుబ్రహ్మణ్యం గారి మరణ వార్త విన్న కోట్లాది మంది సంగీత ప్రియులతో పాటుగా నా గుండె ముక్కలైంది. కానీ, అతను మన కోసం వదిలిపెట్టిన పాటల ద్వారా మాత్రమే నేను తిరిగి రావచ్చు. కుటుంబాలకు నా సంతాపం : హ్యారిస్ జైరాజ్
Oh, God! My heart is broken to pieces along with crores of music lovers hearing his demise. But, I may get back only by the songs he left for us. My condolences to families, Friends of #SPBalasubrahmanyam Garu. @KTVTAMIL @SunTV @sunnewstamil @Tv_thanthi @news18dotcom pic.twitter.com/KQQiSr1HJN
— Harris Jayaraj (@Jharrisjayaraj) September 25, 2020 - 25 Sep 2020 8:48 AM GMT
SP Balasubrahmanyam live updates : మీరు పాడిన అద్భుతమైన పాటలన్నిటికీ ధన్యవాదాలు : బండ్ల గణేష్
SP Balasubrahmanyam live updates : మీరు పాడిన అద్భుతమైన పాటలన్నిటికీ ధన్యవాదాలు బాలసుబ్రహ్మణ్యం సార్ .. ఆ పాటలు మమ్మల్ని మరింత ప్రేమించేలా చేశాయి.. మా హృదయాల్లో మీరు ఎప్పటికీ నివసిస్తారు ; బండ్ల గణేష్
Heartbroken💔💔💔 #SPBalasubrahmanyam sir...thank you for all the wonderful songs you sang and made us love you even more💔 you will forever live on💔😭 #RIP 🙏🙏🙏🙏 pic.twitter.com/nBNkRK49aa
— BANDLA GANESH. (@ganeshbandla) September 25, 2020 - 25 Sep 2020 8:39 AM GMT
SP Balasubrahmanyam live updates : భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది : ఎన్టీఆర్
SP Balasubrahmanyam live updates : తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే : ఎన్టీఆర్
తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే pic.twitter.com/HGbIfa0yyH
— Jr NTR (@tarak9999) September 25, 2020 - 25 Sep 2020 8:33 AM GMT
SP Balasubrahmanyam live updates : నవ్వుతూ కనిపించే బాలు గారు లేకపోవడం షాక్ అయ్యా : రామ్ చరణ్
SP Balasubrahmanyam live updates : మాకు ఎప్పుడు నవ్వుతున్న కనిపించే బాలు గారు ఇక లేరని తెలుసుకుని నేను షాక్ అయ్యాను. ఆయన కుటుంబం మొత్తానికి నా ప్రగాడ సంతాపం : రామ్ చరణ్
I am shocked to learn that our ever smiling SPB garu is no more. This loss to our fraternity is unimaginable. My deepest condolences to his entire family. pic.twitter.com/PJ4Wxk8uiA
— Ram Charan (@AlwaysRamCharan) September 25, 2020 - 25 Sep 2020 8:27 AM GMT
SP Balasubrahmanyam live updates : ఎస్పీ బాలు ఇక లేరు అంటే నమ్మలేకపోతున్నాను : మహేష్ బాబు
SP Balasubrahmanyam live updates : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వాస్తవాన్ని నమ్మలేకపోతున్నాను.. అయన మనోహరమైన స్వరానికి ఏదీ దగ్గరగా రాదు. శాంతితో విశ్రాంతి సార్. మీ వారసత్వం కొనసాగుతుంది. మీ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను : మహేష్ బాబు
Unable to process the fact that #SPBalasubramaniam garu is no more. Nothing will ever come close to that soulful voice of his. Rest in peace sir. Your legacy will live on. Heartfelt condolences and strength to the family 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2020 - 25 Sep 2020 8:22 AM GMT
SP Balasubrahmanyam live updates :
SP Balasubrahmanyam live updates :ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇకలేరు. కరోనాతో ఆగస్టు 4 న చెన్నైలోని MGM ఆసుపత్రిలో చేరిన బాలు కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు.. అయన కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ అయన ఆరోగ్య స్థితిలో మార్పు రాలేదు.. ఈ క్రమంలో అయన శుక్రవారం కన్నుమూశారు. దీంతో యావత్ సినీలోకం విషాదంలో మునిగిపోయింది. ఆయన అభిమానులు, సంగీత ప్రేమికులు తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయారు. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
- 25 Sep 2020 8:21 AM GMT
sp balasubrahmanyam live updates: ఎస్పీబీ మృతి పట్ల కేసీఆర్ సంతాపం
ఎస్పీ బాలు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. ఎన్నో సుమధుర గేయాలు పాడి ప్రజల అభిమానం సంపాదించారని కొనియాడారు. బాలు కుటుంబసభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire