Live Updates: ఈరోజు (14 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 14 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ద్వాదశి ఉ.08-20 వరకు తదుపరి త్రయోదశి | పుబ్బ నక్షత్రం రా.06-56 వరకు తదుపరి ఉత్తర | వర్జ్యం: రా.01-43 నుంచి 03-13 వరకు | అమృత ఘడియలు మ.12-49 నుంచి 01-18 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-17 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.12-30 నుంచి 01-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 14 Oct 2020 9:25 AM GMT
Vizianagaram updates: నాటుసారా తయారీ కేంద్రాలపై స్పేషల్ ఎన్ఫోర్స్మెంటు బ్యాచ్ పోలీసులు దాడులు..
విజయనగరం జిల్లా...
-వేపాడ మండలం కొంపల్లి వద్ద నాటుసారా తయారీకి సిద్దంగా ఉంచిన 200 లీటర్ల బెల్లం ఊటను
-నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి ఎస్ ఈ బి పోలీసులు.
- 14 Oct 2020 9:22 AM GMT
Amaravati updates: వైఎస్సార్ ఉచిత వ్య వసాయ విద్యుత్ పధకం అమలుకు నిధులు విడుదల చేసిన సర్కార్..
అమరావతి..
-ఇప్పటికే శ్రీకాకుళం లో పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న ప్రభుత్వం
-సెప్టెంబర్ నెల వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ అమలు కోసం 6.05 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు జారీ చేసిన సర్కార్
-వ్యవసాయ మీటర్ల ఏర్పాటుకు నిధులు వినియోగించనున్న ఏపిఈపిడిసిఎల్
- 14 Oct 2020 9:18 AM GMT
Goutam Sawang: సాంకేతికంగా పోలీస్ శాఖ ముందడుగు వేస్తుంది...
ప్రకాశం జిల్లా..
-ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కామెంట్స్...
-ఏపీలో దేశంలోనే తొలిసారిగా పోలీస్ యాప్ ద్వారా పోలీస్ స్టేషన్కు రాకుండానే ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించాం...
-ఈ యాప్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునే అవకాశం సామాన్యులు కూడా కలిగింది...
-ఈ రోజుల్లో మరింత టెక్నాలజీని ఉపయోగించుకుని పోలీస్ సేవలను సామాన్యులకు చేరువ చేస్తాం...
-దేశంలోనే తొలిసారిగా హోంగార్డులకు 30 లక్షల హెల్త్ స్కీమ్ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు...
-హోంగార్డులకు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలు అందిస్తున్నాం...
-గతంలో పిఎస్ కు రావాలంటే మహిళలు భయపడే వాళ్ళు....
-స్పందన లాంటి కార్యక్రమాల ద్వారా మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి వస్తున్నారు...
-పోలీసు వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత భద్రత , భరోసాకల్పిస్తాం...
- 14 Oct 2020 9:14 AM GMT
East Godavari updates: వరద ముంపులో కాకినాడ ప్రతాప్ నగర్ విద్యుత్ సబ్ స్టేషన్..
తూర్పుగోదావరి :
-గత 36 గంటలుగా జలదిగ్భంధంలో డి - 6 సబ్ స్టేషన్..
-ప్రత్యామ్నయంగా కరప విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేపట్టిన అధికారులు..
-రోడ్డు పైనే విధులు నిర్వహిస్తోన్న సబ్ స్టేషన్ సిబ్బంది..
- 14 Oct 2020 9:12 AM GMT
Dharmana Krishna Das: భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 10 మంది చనిపోయారు..
శ్రీకాకుళం జిల్లా..
-ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..
-జిల్లాలోని మెళియాపుట్టిలో ఒకరు చనిపోయినట్లు నివేదిక అందింది..
-ప్రస్తుతం జిల్లాలోని నదులలో నీటి ప్రవాహం సాధారణ స్థాయిలోనే ఉంది..
-జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగినది..
-రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి ముంపు ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు..
-ప్రమాదంలో చనిపోయిన వారికి నష్ట పరిహారం త్వరగా అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు..
-రైతులకు ఎటువంటి నష్టం జరిగినా ఆడుకునే దిశగా చర్యలు తీసుకుంటాం..
-వరద ఉదృతి తగ్గాక జరిగిన నష్టం పై నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించాం..
- 14 Oct 2020 9:10 AM GMT
East Godavari Weather updates: భారీ వర్షాలకు పూర్తిగా నీట మునిగిన ప్రతాప్ నగర్ లో ని టీచర్స్ కాలనీ..
తూర్పుగోదావరి :
-గత రెండు రోజులుగా జలదిగ్భంధంలో టీచర్స్ కాలనీ, వరద నీరు క్రమంగా పెరుగుతుండటంతో భయాందోళనలో స్థానికులు..
-పూర్తిగా వరద నీరు చేరిన పలు కుటుంబాలను ఖాళీ చేయించి సహాయ పునారావ కేంద్రాలకు తరలించిన అధికారులు..
- 14 Oct 2020 6:24 AM GMT
East Godavari updates: గొల్లప్రోలు శివారు ఏలేరు కాలువకు పడిన భారీ గండి..
తూర్పుగోదావరి జిల్లా...
-వందలాది ఎకరాల్లో పంట మునక
-ఏలేరు ప్రాజెక్ట్ నుంచి భారీగా విడుదల చేసిన అదనపు జలాలు
- 14 Oct 2020 6:21 AM GMT
West Godavari Weather Updates: వరద వుదృతి కి వంతెన కు ఆనుకొని రోడ్డు కి భారి సొరంగం..
పశ్చిమ గోదావరి జిల్లా...
-చింతలపూడి మండలం తమ్మిలేరు జలాశయం వద్ద ప్రమాదకర స్థితిలో క్రిష్ణా, పశ్చిమ జిల్లా ల సరిహద్దు వంతెన..
-ముందుజాగ్రత్తగా రెండు జిల్లా లకు రాకపోకలను నిలిపి వేసిన పోలీసులు.
- 14 Oct 2020 6:17 AM GMT
Guntur District updates: బాధితురాలు ని పరామర్శించిన తెలుగు మహిళలు,మాహిళా సంఘాలు..
గుంటూరు ః
-జిజిహెచ్ లో అత్యాచార బాధితురాలు ని పరామర్శించిన తెలుగు మహిళలు,మాహిళా సంఘాలు
-పెదకూరపాడు మండలం పొడపాడు లో ఓ వివాహిత పై అత్యచారం.
-కిరాణా షాపు కు వచ్చిన మహిళా ను నిర్బందించి అత్యాచారం చేసిన శాంతిరాజు.
-రాత్రంతా కనిపించకపోవడంతో గాలించిన బందువులు.
-శాంతి రాజు ఇంట్లో నిర్బంధంలో ఉన్న మహిళా ను గుర్తించిన బందువులు.
-ప్రస్తుతం జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న మహిళా
-జగన్ పాలన లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.
-సీఎం, హోం మంత్రి నివాసం ఉండే జిల్లాలోను అత్యచారాలు ఆగడం లేదు.
-మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మా నోరు మెదపడం లేదు.
-బాధిత మహిళా కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.
- 14 Oct 2020 6:12 AM GMT
West Godavari Weather updates: భారీగా కురుస్తున్న వర్షాలు...
ప.గో.జిల్లా...
-మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు
-ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు, ఎర్రకాలవ జలాశయంలోకి చేరుకుంటున్న వరద నీరు
-తమ్మిలేరు నుండి 18వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో ముంపులో ఏలూరు నగరంలోని అశోక్ నగర్ ఏటుగట్టు,YSR కాలనీ, మాదేపల్లి, శ్రీపర్రు
-ఏలూరు, భీమవరం మధ్య నిలిచిపోయిన రాకపోకలు
-ఎర్రకాలవ పొంగటంతో దిగువకు విడుదల చేసిన 22వేల క్యూసెక్కుల వరద నీరు
-లోతట్టు ప్రాంతాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు ఇచ్చిన డిప్యూటీ సిఎం ఆళ్ల నాని.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire