Budget 2024 Live Updates: బడ్జెట్‌ 2024 లైవ్‌ అప్‌డేట్స్‌.. ఆదాయ పన్ను స్లాబ్ లో మార్పులు

Budget 2024-25 Live Updates: బడ్జెట్‌ 2024 లైవ్‌ అప్‌డేట్స్‌
x

Budget 2024-25 Live Updates: బడ్జెట్‌ 2024 లైవ్‌ అప్‌డేట్స్‌

Highlights

Union Budget 2024: ఇప్పటికే వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ఆమె రికార్డు సాధించారు.

Union Budget 2024: బడ్జెట్ 2024-25 ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఇప్పటికే వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ఆమె రికార్డు సాధించారు.


Show Full Article

Live Updates

  • 23 July 2024 7:19 AM GMT

    రూ. 48.21 లక్షలతో కేంద్ర బడ్జెట్

    రూ.48.21 లక్షలతో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొత్తం ఆదాయం రూ. 32.07 లక్షల కోట్లుగా అంచనా వేసింది. పన్ను ఆదాయం రూ. 28.83 లక్షలుగా కేంద్రం తెలిపింది. ద్రవ్యలోటు 4.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ. 16 లక్షల కోట్లుగా ఉంటాయని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

  • 23 July 2024 7:15 AM GMT

    కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

    కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యేలోపుగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 1200 పాయింట్లు సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ 360 పాయింట్లు పడిపోయింది. ఇవాళ ఉదయం నుంచి లాభాల్లోనే స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. అయితే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగానికి ముందునుంచే నష్టాల వైపు మళ్లాయి. అయితే నిర్మలా సీతారామన్ ప్రసంగం పూర్తయ్యేసరికి స్టాక్ మార్కెట్లు పడిపోయాయి.

  • 23 July 2024 7:06 AM GMT

    ఆదాయ పన్ను స్లాబ్ లో మార్పులు

    కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో వేతన జీవులకు ఊరట కల్పించింది. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మధ్యతరగతికి మేలు చేసేలా ఐటీ చట్టాన్ని సమీక్షిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆదాయ పన్ను స్లాబ్ ల్లో మార్పులు తెచ్చారు.

    రూ.3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు 5 శాతం పన్ను.రూ. 7 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 10 శాతం, రూ.10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 15 శాతం పన్ను వసూలు చేయనున్నారు. ఈకామర్స్ పై టీడీఎస్ 0.1 శాతానికి తగ్గించారు. ఇన్వెస్టర్లకు యాంజెల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్టుగా కేంద్రం హామీ ఇచ్చింది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 12.5 శాతం పన్ను విధించనున్నట్టుగా నిర్మలా సీతారామన్ చెప్పారు.

  • 23 July 2024 6:55 AM GMT

    తగ్గనున్న బంగారం, వెండి ధరలు

    బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. దీంతో బంగారం, వెండి, ప్లాటినం ధరలు దిగిరానున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలతో సామాన్యులు ఇబ్బందిపడుతున్నారు. ఈ పన్ను తగ్గింపుతో బంగారం, వెండి ధరలు కొంత తగ్గనున్నాయి. ఇది సామాన్యులకు ఉపశమనం కల్గిస్తాయి.

  • 23 July 2024 6:49 AM GMT

    క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ తొలగింపు

    మూడు రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ తొలగిస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ మందుల ధరలు తగ్గనున్నాయి. 25 రకాల ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించనున్నట్టుగా కేంద్రం హామీ ఇచ్చింది. మొబైల్ , మొబైల్ పరికరాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గించినట్టుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సోలార్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. లెదర్ ఉత్పత్తులపై కూడా పన్ను తగ్గించారు. రొయ్యలు, చేపల ఫీడ్ పై బీసీడీ ఐదు శాతానికి తగ్గించారు.

  • 23 July 2024 6:47 AM GMT

    మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు

    మహిళల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ. 3 లక్షల కోట్లను కేటాయించింది. మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీని తగ్గించింది. మరోవైపు స్టాంప్ డ్యూటీని పెంచుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతిని ఇచ్చింది. ఎన్ పీ ఎస్ పథకంలో మార్పులను చేసింది. మైనర్లు కూడా ఈ పథకంలో చేరేందుకు అవకాశం కల్పించింది. జీఎస్టీ కారణంగా సామాన్యులపై పన్నుల భారంగా తగ్గిందని కేంద్రం అభిప్రాయపడింది.

  • 23 July 2024 6:24 AM GMT

    కార్మికులకు డార్మిటరీ తరహా అద్దె ఇళ్ల నిర్మాణం

    దేశంలో కొత్తగా 12 పారిశ్రామిక కారిడార్లను కేంద్రం మంజూరు చేసింది. మహిళాభివృద్ది కోసం రూ. 3 లక్షల కోట్లను కేటాయించింది. కొత్తగా ఎన్సీఎల్ టీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. పట్టణాభివృద్దిపై ప్రత్యేక ఫోకస్ పెడతామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. సృజనాత్మక రీతిలో నగరాల అభివృద్ది చేస్తామని ప్రకటించారు. 30 లక్షలకు పైబడిన 14 నగరాల్లో రవాణా సౌకర్యాలపై ప్రత్యేక కార్యక్రమాలను తీసుకుంటామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రకటించారు.

    ఈశాన్య ప్రాంతాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు విస్తరిస్తామన్నారు. ఎంఎస్ఎంఈల అభివృద్దికి చట్టంలో మార్పులు తెస్తామని చెప్పారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో కొత్తగా 24 సిడ్జీ శాఖలు ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. కార్మికులకు డార్మిటరీ తరహా అద్దె ఇళ్ల నిర్మాణం చేపడుతామన్నారు.

  • 23 July 2024 6:18 AM GMT

    ఉన్నత విద్య చదివే విద్యార్థులకు రూ. 10 లక్షల రుణం

    దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు రుణాలు అందిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గ్రామీణ అభివృద్దికి రూ. 2.66 లక్షల కోట్లు కేటాయించారు. ముద్ర రుణాలను రూ. 10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది.

  • 23 July 2024 6:01 AM GMT

    అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో రూ. 15 వేల కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం కోసం బహుళ సంస్థల ద్వారా నిధులు అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

    విశాఖపట్టణం- చెన్నై, ఓర్వకల్లు-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ కు నిధులు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఏపీ పునర్విభజన చట్టం -2024 కట్టుబడి ఉన్నామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం అభివృద్దికి నిధులు ఇస్తామని కేంద్రం ప్రకటించింది.

  • 23 July 2024 5:52 AM GMT

    బడ్జెట్ లో వ్యవసాయానికి రూ. 1.52 లక్షల కోట్లు

    కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయరంగంలో స్టార్టప్ లకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్టుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యవసాయ పరిశోధానా రంగానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా తెలిపారు. కొత్తగా 109 వంగడాలను ప్రవేశపెట్టినట్టుగా కేంద్ర మంత్రి గుర్తు చేశారు. వచ్చే ఏడాదిలోపుగా ప్రకృతి వ్యవసాయంలోకి కోటి మంది రైతులను తీసుకువచ్చేలా లక్ష్యంగా చేసుకున్నామని కేంద్రమంత్రి చెప్పారు. నూనెగింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపునకు కార్యాచరణను అమలు చేస్తామన్నారు. కూరగాయల ఉత్పత్తి భారీ స్థాయి క్లస్టర్ల అభివృద్ది చేయనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.

Print Article
Next Story
More Stories