Live Updates: ఈరోజు (మే-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 మే, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు శనివారం, 30 మే, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, అష్టమి (రాత్రి 07:56 వరకు), తదుపరి నవమి.సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:46 pm
ఈరోజు తాజావార్తలు
Live Updates
- 30 May 2020 10:56 AM GMT
నేడు రానున్న శ్రామిక్ రైలు, ముంబై నుంచి వెయ్యి మంది రాక
జగిత్యాల: ముంబైలో ఉన్న తెలంగాణకు చెందిన వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన శామిక్ రైలు శనివారం ఉమ్మడి జిల్లాకు చేరుకోనుంది. జగిత్యాల లింగంపేట రైల్వే స్టేషన్ లో ఆయా ప్రాంతాలకు చెందిన వారు దిగడం కోసం నిలుపనున్నారు. జగిత్యాలలో వందమంది దిగుతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా గ్రామంలో డప్పు చప్పుళ్ళతో గ్రామస్తులు ఎవరు కూడా రైల్వే స్టేషన్ ప్రాంతపరిధికి రావద్దని, బయట తిరగవద్దని అధికారులు గ్రామస్థులకు అప్రమత్తం చేశారు. కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.
- 30 May 2020 10:38 AM GMT
బీజేపీ ఆధ్వర్యంలో తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో తిరుపతి లడ్డూలు పంపిణీ
తాడిపత్రి: భారతీయ జనతా పార్టీ తాడిపత్రి నియోజక వర్గ ఇంచార్జ్ రంగనాథ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లోని పోలీస్ అధికారులు అందరికీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థాన ప్రసాదం లడ్డులు పంపిణీ చేయడం జరిగినది..ఈ కార్య క్రమంలో రూరల్ అధ్యక్షుడు రాంబాబు ,రూరల్ ప్రధాన కార్య దర్శి శేష నంద రెడ్డి పాల్గొనడం జరిగినది.
- 30 May 2020 10:36 AM GMT
రైతుభరోసా కేంద్రం ప్రారంభం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
తాడిపత్రి: తాడిపత్రి మండలం చుక్కలూరులో "రైతు భరోసా కేంద్ర" ప్రారంభం సందర్భంగా ప్రాంగణంలో మొక్కలను శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి నాటారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ MA రంగారెడ్డి, వైయస్సార్సీపీ నాయకులు, రైతులు, మార్కేట్ యార్డు సిబ్బంది పాల్గొన్నారు. జగన్ అన్న ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయిన సందర్బముగా మొక్కను నాటారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ రైతులు అందరు రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
- 30 May 2020 10:34 AM GMT
ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోంది
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. హమీలు అమలు చెయ్యడంలో విఫలమైందని మండిపడ్డారు. మాస్కులు అడిగినందుకు మత్తు డాక్టర్ సుధాకర్‌ను వెంటాడి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ఎస్ఈసీ రమేశ్ కుమార్‌ను కలిసి.. స్థానిక ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు.
- 30 May 2020 9:36 AM GMT
♦ డాక్టర్ సుధాకర్ కేసులో విచారణ మొదలు పెట్టిన సీబీఐ.
♦ విశాఖ పోలీసులు పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ ఎస్పీ పుట్టా విమలాదిత్య.
♦ సుధాకర్ కి వైద్యం చేసిన డాక్టర్లు తో పాటు పలువురిని విచారించనున్నారు సీబీఐ అధికారులు.
- 30 May 2020 9:35 AM GMT
నిమ్మగడ్డ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్
-నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు
-రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమించాలని నిన్న ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం పై కే వి యెట్
-తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని వైకాపా ఎమ్మెల్యేలు నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా కేవియట్ పిటిషన్
-గుంటూరుకు చెందిన కాంగ్రెస్ నేత మస్తాన్‌వలీ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు
- 30 May 2020 8:45 AM GMT
ఏపి లో కొత్తగా 131 కరోనా కేసులు..
-రాష్ట్రంలో శుక్రవారం మరో 131 కరోనా కేసులు నమోదయ్యాయి.
-పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు 61.
-రాష్ట్రంలో 70 పాజిటివ్ కేసులు నమోదు.
-ఇప్పటివరకు మొత్తం 3461 కేసులు నమోదయ్యాయి.
-కరోనాతో పోరాడి ఇప్పటివరకు 2092 మంది డిశ్చార్జి అయ్యారు.
-ప్రస్తుతం 792 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
- 30 May 2020 7:25 AM GMT
మదనపల్లి రూరల్... చిత్తూరు జిల్లా.
👉మల్లయ్య కొండలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.
👉బార్య భర్తలు ఇరువురు బెంగళూరు ఐటిఐ కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.
👉లాక్ డౌన్ కారణంగా మదనపల్లె బాలాజీ నగర్ లో నున్న అత్త మామల ఇంటికి రాక.
👉మృతురాలు భర్త విశ్వనాధ్,కుటుంబ సభ్యులతో నేడు మల్లయ్య కొండ స్వామి దర్శనం.
👉కుటుంబ సభ్యులు స్వామివారి సన్నిధిలో నుండగా కొండపైనుండి క్రిందకు దూకి ఆత్మహత్య.
👉 సంఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.
- 30 May 2020 5:59 AM GMT
రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం జగన్
-ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు.
-తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ప్రారంభించారు.
-మొట్టమొదటగా కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగపురం కేంద్రం ఆర్‌బీకేలో లభించే సేవలను పరిశీలించారు.
-ప్రతి కేంద్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సహాయకులు ఉంటారు.
-వీరు రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలు అందిస్తారు.
-రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా అవుతాయి. భూసార పరీక్షలు జరుగుతాయి.
- 30 May 2020 5:37 AM GMT
ఇళ్లలో దీక్షలతో ఉపయోగం లేదు.. సొంత పార్టీ వాళ్లపై జేసీ కామెంట్స్..
ఇళ్లలో దీక్షలు, నిరసనలతో ఉపయోగం లేదని, సొంత పార్టీ నేతలపై అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 21న నిరసనలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీ నాయకులు వారి ఇళ్లలోనే ఉండి నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire