Live Updates: ఈరోజు (మే-29-శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (మే-29-శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 29 మే, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు శుక్రవారం, 29 మే, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, సప్తమి (రాత్రి 09:55 వరకు), తదుపరి అష్టమి.సూర్యోదయం 5:45 am, సూర్యాస్తమయం 6:42 pm

ఈరోజు తాజావార్తలు

Show Full Article

Live Updates

  • 29 May 2020 4:49 PM GMT

    తెలంగాణలో కొత్తగా 169 కేసులు..

    -ఈ రోజు అత్యధికంగా 169 కేసులు నమోదయ్యాయి.

    -వీటిలో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 82 కేసులు వెలుగు చూశాయి.

    -రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్‌ 2, సంగారెడ్డి జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.

    -దేశాల నుంచి వచ్చిన వారిలో 64 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

    -ఇప్పటివరకు కరోనాతో పోరాడి 71 మంది మరణించారు.  

  • 29 May 2020 3:34 PM GMT

    ఆంధ్రా లో రోజు రోజుకు ఎరులై పారుతున్న తెలంగాణ మద్యం

    -పోలీస్ వారు ఎన్ని కేసులు పెట్టినా ఎంత మందిని అదుపులోకి తీసుకున్న మారని మద్యం మాఫియా.

    -ఖరీదైన కార్లలో అక్రమంగా మద్యం తరలింపు.

    -ఈ రోజు ఒక్క రోజే పోలీసుల అదుపులోకి తెలంగాణా రాష్ట్రం నుండి ఆంధ్రాలోనికి మద్యం సరఫరా చేస్తున్న 42 మంది వ్యక్తులు.

    -వారి వద్ద నుండి 670 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.

    -నందిగామ మండలం తొర్రగుడిపాడు వద్ద ఒక కారులో సుమారు లక్ష రూపాయల విలువైన మద్యం లభ్యం.

    -ఈ రోజు తనిఖీల్లో అక్రమ మద్యం పై 28 కేసులు నమోదు.

    -మొత్తం 19 ద్వీచక్ర వాహనాలను, నాలుగు కార్లను సీజ్ చేసిన పోలీసులు.

  • 29 May 2020 2:24 PM GMT

    తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం

    -72 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం.

    -జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం.

    -తమిళనాడు, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి.

    -తెలంగాణాలో రేపు, ఎల్లుండి పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం.

    -మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం. 




  • 29 May 2020 10:43 AM GMT

    చోడవరం రైతు బజార్​లో ఉద్రిక్తత

    చోడవరం: మూడు కోట్ల రూపాయలతో ప్రారంభించిన రైతుబజార్ నిర్మాణ పనులు ఆసంపూర్తిగా నిలిచిపోయాయి. తాజాగా... మార్కెటింగ్ శాఖ తమ పరిధిలో ఉన్న మార్కెట్ యార్డుల్లో కూరగాయలు, పండ్లు అమ్మకాలు జరిపేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం రైతుబజార్​ను ఖాళీ చేయిస్తున్న పోలీసులకు వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాము ఎక్కడికీ వెళ్లేది లేదంటూ.. ఈ రైతుబజార్​లోనే విక్రయాలు జరుపుతామని స్పష్టం చేశారు.



     

     

  • 29 May 2020 10:41 AM GMT

    సుధాకర్ కేసులో నేటి నుంచి సీబీఐ దర్యాప్తు

    విశాఖపట్నం: వైద్యుడు సుధాకర్ కేసును విశాఖ సీబీఐ దర్యాప్తు చేయనుంది. దర్యాప్తులో భాగంగా... ఇవాళ్టి నుంచే విచారణ, వాంగ్మూలాల సేకరణ మెుదలుపెట్టనుంది. విశాఖ సిటీ పోలీసులతో పాటు... మానసిక ఆస్పత్రి వైద్యులను సైతం కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విచారించనున్నారు. వైద్యుడు సుధాకర్‌ను కలసి విచారణ చేసి... వాంగ్మూలం సేకరించనున్నారు.



     

     

  • 29 May 2020 10:39 AM GMT

    వైద్య పరీక్షలు నిర్వహించాలని బాధిత గ్రామస్థుల నిరసన

    విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌ బాధిత గ్రామాలు వెంకటాపురం, నందమూరి నగర్ వాసులు నిరసనకు దిగారు. ఇళ్లలోనే ఉండి ప్లకార్డులతో ఆందోళన చేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.



     



  • 29 May 2020 8:54 AM GMT

    విశాఖ : హైదరాబాదు నుంచి విమానంలో విశాఖ చేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

    -గోపాలపట్నం ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రామకృష్ణ.

    -నిలిపివేసిన పోలీసులు.



  • 29 May 2020 8:51 AM GMT

    వీఎం ఆర్డీఏలో మరో 13 మండలాలు విలీనం

    విశాఖ మెట్రో రీజియన్ డవలప్ మెంట్ అధారిటీ (VMRDA)లో విశాఖ జిల్లాలోని మరో 13 మండలాలను కలిపేందుకు మున్సిపల్ అండ్ అర్భన్ డవలప్ మెంట్ కు ప్రతిపాదనలు పంపినట్టు VMRDA చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ చెప్పారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక మండలం, నర్సీపట్నంలో నాలుగు, చోడవరంలో నాలుగు, మాడుగులలో నాలుగు మండలాలకు విస్తరించేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రభుత్వ ఆదేశాను సారం ఇది విలీనమైతే వీఎం ఆర్డీఏ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.



  • 29 May 2020 8:23 AM GMT

    సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం 

    బోయిన్ పల్లి..బాపూజీ నగర్ లో ఘటన

    అగ్నికీలల్లో 100 కు పైగా గుడిసెలుమంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.

  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి బాధ్యతలు చేపడతా
    29 May 2020 7:32 AM GMT

    రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి బాధ్యతలు చేపడతా

    - రమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నానని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అన్నారు.

    - వ్యక్తులు కాదు.. రాజ్యాంగ వ్యవస్థలు, విలువలు శాశ్వతమని ఆయన అన్నారు.

    - గతంలో మాదిరిగానే నిష్పాక్షికంగా బాధ్యతలు నిర్వహిస్తానని అన్నారు.

    - అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుని ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తానని అన్నారు.

    - రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణ స్వీకారం చేసిన వారంతా ఈ సంస్థల సమగ్రతను కాపాడాలని సూచించారు.

     


Print Article
More On
Next Story
More Stories