Live Blog: ఈరోజు (మే-28-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 మే, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు గురువారం, 28 మే, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, షష్టి (రాత్రి 11:27 am వరకు), తదుపరి సప్తమి.సూర్యోదయం 5:44am, సూర్యాస్తమయం 6:22 pm
ఈరోజు తాజావార్తలు
Live Updates
- 28 May 2020 5:07 PM GMT
జీడిమెట్లలోని రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
-జీడిమెట్లలోని రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
-ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
-మరి కొంత మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
-సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
-అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
- 28 May 2020 3:47 PM GMT
తెలంగాణాలో తగ్గని కరోనా ఉధృతి
తెలంగాణాలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది.
ఈరోజు రికార్డు స్థాయిలో 117 కొత్త కేసులు నమోదవడంతో తీవ్ర కలకలం ఏర్పడింది.
దీంతో మొత్తం కరోనా భారిన పడిన వారి సంఖ్య 2256 కి చేరింది.
ఇక వీరిలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1345 కి చేరగా,
ఇంకా 844 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
- 28 May 2020 3:22 PM GMT
మోదీ ప్రభుత్వం వల్ల పేదలు చాలా నష్టపోయారు: శైలజానాథ్
ప్రధాని మోదీ ప్రభుత్వం వల్ల పేదలు చాలా నష్ట పోయారని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ పేర్కొన్నారు.
వచ్చే 6నెలలు రూ.7500 చొప్పున పేద కుటుంబాలకు సాయం చేయాలని కోరారు.
పేదలు, చిన్న పరిశ్రమలకు నగదు బదిలీ చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
- 28 May 2020 2:55 PM GMT
ముగిసిన 'మహానాడు'
2రోజుల 'తెలుగుదేశం మహానాడు' ముగిసింది.
టీడీపీ మహానాడులో 22 తీర్మానాలకు ఆమోదించారు.
2 రోజుల మహానాడులో 52మంది నేతలు ప్రసంగించారు.
దేశ భద్రతకు సంబంధించి కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా టీడీపీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.
- 28 May 2020 2:47 PM GMT
ఏపీ బిజెపి ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి.
హైదరాబాద్ లోని రాయదుర్గం ఓ స్నేహితురాలి ఇంటికి వెళ్లి సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఏ ఐ జి హాస్పిటల్ వైద్యులు మరణాన్ని ధృవీకరించినట్లు సమాచారం
- 28 May 2020 10:38 AM GMT
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు కళాబృందం ప్రదర్శన
కరీంనగర్ టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణ,క్యూ ఆర్ కోడ్ ఉపయోగం, మహిళల భద్రతపై బస్టాండ్ మెయిన్ గేట్ వద్ద పోలీసు కళాబృందం చే ప్రదర్శన నిర్వహించారు. కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రావు, సబ్ ఇన్స్పెక్టర్స్, విజయ్ కుమార్ వెంకటరాజం ,షీటీం ఏఎస్సై విజయమణి, ట్రాఫిక్ సిబ్బంది, షీటీమ్ సభ్యులు పోలీస్ కళాబృందం సభ్యులు పాల్గొన్నారు.
- 28 May 2020 10:36 AM GMT
నా రాజకీయ జీవితం ఎన్టీఆర్ పెట్టిన బిక్ష: అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం: ఇవాళ తాను రాజకీయాల్లో ఎదిగానంటే ఎన్టీఆర్ పెట్టిన భిక్షేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపు జెండా ఎప్పుడూ రెపరెపలాడేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్ పరిపాలన ఇలానే సాగితే రాబోయే తరాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు.
- 28 May 2020 9:38 AM GMT
సుధాకర్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం
విశాఖపట్నం: వైద్యుడు సుధాకర్ రాసిన లేఖలోని విషయాలను తీవ్రంగా పరిగణించాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అభిప్రాపడ్డారు. వైద్యుడు సుధాకర్ లేఖలో పేర్కొన్న అంశాలతో తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబసభ్యులను అనిత కలిశారు. సుధాకర్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఒక వైద్యుడి విషయంలోనే ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే సామాన్యుల పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేశారు.
- 28 May 2020 9:37 AM GMT
భక్తుల చెంతకే శ్రీవారి లడ్డు
విశాఖపట్నం: రెండు నెలల నుంచి శ్రీవారి ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేని కారణంగా... భక్తులంతా తల్లడిల్లిపోయారు. కలియుగ దైవంగా పూజలందుకొనే కోనేటి రాయుడి దర్శనం లేక బాధపడే భక్తులకు తితిదే అపురూపమైన అవకాశం కల్పిస్తోంది. సబ్సిడీ ధరకే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందిస్తోంది.విశాఖ తితిదే కల్యాణ మండపంలో శ్రీ వారి లడ్డు వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీంతో భౌతిక దూరం పాటిస్తూ లడ్డులు అమ్మకం కొనసాగుతోంది. తిరుమల తిరుపతి వెళ్తే గాని దొరకని శ్రీవారి లడ్డును ఉత్తరాంధ్ర జిల్లాలకు అందించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు ధన్యవాదాలు చెప్తున్నారు.లాక్ డౌన్ నియమాలు పాటిస్తూ, లడ్డు అమ్మకాలు చేయడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి లడ్డు అమ్మకాలకు వస్తున్న ఆదరణతో గడువు మరింత పెంచడానికి తితిదే ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు లడ్డు అమ్మకాలు కొనసాగుతాయని అధికారులు చెప్తున్నారు.
- 28 May 2020 9:33 AM GMT
ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురికి కరోనా
విశాఖపట్నం: మధురవాడలోని గాయత్రి నగర్లో ఓ బహుళ అంతస్తుల భవనంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా సోకింది. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మెడికల్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తి.. రంజాన్ సందర్భంగా తన కుటుంబంతో కలిసి బందువుల ఇంటికి వెళ్ళి మంగళవారం తిరిగి వచ్చాడు.మరుసటి రోజు వాలంటీర్లు వీరి నుంచి నమూనాలు సేకరించి ఆస్పత్రికి తరలించగా అయిదుగురికి కొవిడ్ సోకినట్లు తేలింది. ఒక్క సారిగా ఈ కేసులు వెలుగుచూడటంరై అధికారులు... చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతంలో క్రిమి సంహారక ద్రావణాన్ని పిచికారీ చేశారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire