Live Blog: ఈరోజు (మే-27-బుధవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 మే, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు బుధవారం, 27 మే, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పంచమి (రేపు 12:32 am వరకు), తదుపరి షష్టి.సూర్యోదయం 5:45 am, సూర్యాస్తమయం 6:41 pm
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేడిగానే ఉంటుంది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలే ఉన్నాయి. వేడిగాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్న సమయంలో బయట తిరిగే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 27 May 2020 5:21 PM GMT
ఏపీ ఫైబర్ సేవలు ప్రతిఒక్కరికి అందించటమే లక్ష్యం: ఎమ్ డి .మధుసూధరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ సేవలు ప్రతిఒక్కరికి అందించాలనే కృత నిశ్చయమతో ఉన్నామన్నారు నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మ్యానేజింగ్ డైరెక్టర్ మధుసూధరెడ్డి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ ఫైబర్ ను ప్రత్యేకంగా భావిస్తున్నానరని త్వరలోనే మరింతగా డెవెలప్ అవుతుందన్నారు.కార్పొరేషన్ లో అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతున్నాయని అన్నారు.ఫైబర్ నెట్వర్క్ పూర్తి స్థాయిలో విస్తరిస్తోంది అని అన్నారు.
అందరి సహకారంతో ఫైబర్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎండి మధుసూధరెడ్డి తెలిపారు.
- 27 May 2020 4:17 PM GMT
సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా కామెంట్లపై కేసు నమోదు చేసిన సీఐడీ సైబర్ క్రైమ్
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు
ఐటీ చట్టంలోని 67 సెక్షన్, ఐపీసీలోని 153(A), 505(2), 506 సెక్షన్ల కింద కేసు
దరిశ కిషోర్‍రెడ్డిపై కేసు నమోదు చేసిన సీఐడీ సైబర్ క్రైమ్
సోషల్ మీడియాలో పోస్టులపై సాక్ష్యాధారాలతో సహా సీల్డ్ కవర్‍లో సీఐడీకి పంపిన హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్
- 27 May 2020 2:36 PM GMT
బోరుబావిలో మూడున్నరేళ్ళ బాలుడు!
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో దారుణం జరిగింది.
పంట పొలం కోసం తవ్విన బోరుబావిలో.. సాయి వర్థన్ అనే మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవ శాత్తూ పడ్డాడు.
దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కాగా ప్రస్తుతం 120-150 అడుగుల బోరుబావి లోతులో బాలుడు ఉన్నాడు. వెంటనే సహాయక చర్యలు చేపట్టింది రెస్య్యూటీమ్.
అలాగే సంఘటనా స్థలానికి నాలుగు జేసీబీలు చేరుకున్నాయి.
- 27 May 2020 9:49 AM GMT
సినిమాటోగ్రాఫర్ శ్యాం కె నాయుడుపై కేసు నమోదు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పోకిరి, బిజినెస్ మెన్, కెమెరామెన్ గంగతో రాంబాబు తో పాటు అనేక సినిమాలకు ఆయన సినిమాటోగ్రఫీ అందించారు. శ్యామ్ కె నాయుడు ప్కూరఖ్డాయాత సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తమ్ముడు.
కాగా, ఇప్పుడు ఆయనపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని చెప్పి సినీ ఆర్టిస్ట్ సాయి సుధా కేసు ఫైల్ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- 27 May 2020 7:08 AM GMT
'మహానాడు' లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కు నివాళి అర్పించిన టీడీపీ. రెండు నిమిషాల పాటు మానం పాటించి సంతాపం తెలిపిన వేబినార్.
- 27 May 2020 7:05 AM GMT
రోడ్డుపై కాలిపోయిన కారు
- సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామ సమీపంలో అగ్ని ప్రమాదం.
- స్థానిక రిలయన్స్ పెట్రోల్ బాంక్ వద్ద అధిక ఎండల తీవ్రతకు కారు దగ్ధం.
- జహీరాబాద్ నుండి సంగారెడ్డి ప్రయాణిస్తున్న AP09 2376 ఫోర్డ్ ఫిగో కార్ ఎండతీవ్రతకు ఏసీ కంప్రెషన్ అధికం అవ్వడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.
- ప్రమాదం నుంచి తప్పించుకున్న కారులో ఉన్న వ్యక్తులు.
- మంటలను ఆర్పిన సదాశివపేట ఫైర్ సిబ్బంది.
- ఘటనలో పాక్షికంగా దెబ్బతిన్న కారు.
- 27 May 2020 6:57 AM GMT
తెలుగుదేశం మహానాడులో విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించడానికి నిర్ణయించారు.
- 27 May 2020 6:41 AM GMT
సరికొత్త తరహాలో సందడిగా మొదలైన టీడీపీ 'మహానాడు'
మహానాడు సందడిగా మొదలైంది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతో.. ఎన్టీఅర్ విగ్రహానికి మాలలు వేసి నేతలు నివాళులు అర్పించారు. గతం కంటే భిన్నంగా.. దేశంలోనే తొలిసారిగా జూమ్ యాప్ ద్వారా వేబినార్ నిర్వహిస్తూ మహానాడు వేడుక జరుపుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.
కరోనా వైరస్ తో లాక్ డౌన్ కారణంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ నేతలు మహానాడులో పాల్గొంటున్నారు.తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహా వేబినార్ ను దాదాపు 14 వేల మంది చూస్తున్నారు.
మహానాడు గతంలో ఎలా జరిగిందో.. ఇపుడు ఎలా నిర్వహిస్తున్నారో తెలిపే చిత్రం చూడండి.
- 27 May 2020 6:12 AM GMT
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో వెంకటాపురంనకు చెందిన వెంకాయమ్మ (80) అనే వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.
- 27 May 2020 2:29 AM GMT
ఈరోజు మహానాడు ప్రారంభం
- ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రారంభం కానుంది.
- రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
- లాక్ డౌన్ కారణంగా ఈసారి మహానాడు కార్యక్రమాన్ని జూమ్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో నిర్వహించనున్నారు.
- ఈరోజు ఉదయం 10:30 గంటలకు అమరావతి లోని పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు దివంగత నేత ఎన్టీఆర్ కు నివాళులు అర్పించి పార్టీ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగిస్తారు.
- ఈ కార్యక్రమంలో సుమారు 14 వేలమంది ఆన్ లైన్ లో పాల్గొంటారని పార్టీ ప్రతినిద్లులు చెబుతున్నారు. - పూర్తి వివరాలు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire