Live Blog: ఈరోజు (మే-25-సోమవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు సోమవారం, 25 మే, 2020 :
ఈరోజు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. బయటకు వెళ్ళినపుడు తగిన జాగ్రతలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 May 2020 6:25 AM GMT
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి పెరిగిన కరోనా కేసులు
-44 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.
-అలాగే 41 మంది కోవిడ్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
-ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2671 పాజిటివ్ కేసులకు గాను 1848 మంది కోలుకున్నారు.
-ఇప్పటి వరకు 56 మంది మరణించారు.
-ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా క్రియాశీల పాజిటివ్ కేసులు 769గా ఉన్నాయి.
- 25 May 2020 6:14 AM GMT
వామ్మో.. ఎంత పెద్ద పామో!
- విశాఖ జిల్లలో 14 అడుగుల గిరినాగు పాము పట్టివేత
- విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడి అటవీ సెక్షన్ పరిధిలో చీడికాడ మండలం తంగుడుబిల్లి పొలాల్లో గిరినాగు
- ఆదివారం గుర్తించిన రైతులు
- అటవీ అధికారి ఎం.రమేష్‌కుమార్‌కి సమాచారం
- రంగంలోకి దిగిన శాఖలోని వన్యప్రాణి సంరక్షణ సమితి అధికారి మూర్తి
- చాకచక్యంగా గిరినాగును బంధించిన మూర్తి
- ఆ పామును వాలాబు సమీపంలోని చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో విదిచిపెట్టినట్టు ప్రకటించిన రమేష్ కుమార్
- 25 May 2020 6:06 AM GMT
- విశాఖజిల్లా పాడేరు లో గిరిజన సంఘం కార్యాలయం వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు 24గంటల నిరాహారదీక్ష,
- జీవో 3 రద్దు పై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి,
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ జారీ చెయ్యాలి, గిరిజన సలహా మండలి ద్వారా చర్చించి 100% ఉద్యోగాల రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలి,
- ఏజెన్సీ లో ఉన్న ప్రతిశాఖ కాంట్రాక్ట్,ఔట్ సోర్స్ంగ్ పోస్ట్లు గిరిజనులతో భర్తీ చెయ్యాలి,
- ప్రవేటు రంగంలో ఆదివాసీలకు రిజర్వేషన్ కల్పించాలి,
- ఐటిడిఎ లో ఉద్యోగాలు స్థానిక గిరిజనులతోనే భర్తీ చెయ్యాలని డిమాండ్.
- 25 May 2020 5:38 AM GMT
- గుంటూరు జిల్లా, బాపట్ల మండలం, మరుప్రోలువారి గ్రామంలో దారుణం
- విష ఆహారం (కొంగల మందు) తిన్న మరుప్రోలు వీరారెడ్డి, భార్య రమణ, కుమార్తె పోలేర.
- వీరారెడ్డి పరిస్థితి విషమం. భార్య రమణ, కుమార్తె పోలేర మృతి.
- ఆత్మహత్యకు కారణాలు తెలుసుకుంటున్న పోలీసులు.
- 25 May 2020 5:34 AM GMT
టీడీపీ నాయకుడు కూన రవికుమార్ అరెస్ట్‌కు రంగం సిద్ధం
- మాజీ ప్రభుత్వ విప్, టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్‌కు రంగం సిద్ధం
- పొందూరు తహసీల్దార్‌ను దుర్భాషలాడారంటూ రవికుమార్‌పై కేసు నమోదు
- కూన రవికుమార్‌పై పోలీసులు 353, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు
- శ్రీకాకుళం శాంతినగర్ కాలనీలో పోలీసులు తనిఖీలు
- అజ్ఞాతంలోకి వెళ్లిన కూన రవికుమార్
- 25 May 2020 5:32 AM GMT
- కడప జిల్లా గోపవరం మండలం రెవెన్యూ సర్వేర్ శివకుమార్ పై కేసు నమోదు...
- నివాస స్థలం పట్టా విషయంలో తనను లైంగికంగా వేధిస్తున్నాడని మామిడి సుబ్బలక్ష్మమ్మ ఫిర్యాదు
- ఈ మేరకు బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.
- 25 May 2020 5:31 AM GMT
అన్నవరం వద్ద రోడ్డు ప్రమాదం
- ఆగి ఉన్న లారీని డి కొన్న కారు.
- కారు లో ముగ్గురు ప్రయాణికులు.ఇద్దరికి గాయాలు.
- ఒక వ్యక్తి కోన ఊపిరి తో ఉన్నట్లు సమాచారం.
- తూర్పుగోదావరి జిల్లా అన్నవరం బైపాస్ వెలమ పేట పుంత రోడ్డు వద్ద ఘటన
- కారులోని వ్యక్తులు వియనగరం వెళుతున్నట్లు సమాచారం
- పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
- 25 May 2020 4:36 AM GMT
విజయవాడలో శ్రీవారి ప్రసాదం
- విజయవాడలో ఈరోజు నుంచి భక్తులకు అందుబాటులోకి శ్రీవారి ప్రసాదం
- భక్తులకు అందుబాటులో తిరుమల శ్రవేంకటేశ్వరస్వామి వారి ప్రసాదం
- నగరం లోని టీటీడీ కళ్యాణ మంటపం లో విక్రయాలు
- శ్రీవారి లడ్డూ ఒక్కటి రూ 25/-
- ఇప్పటికే తిరుమల నుండి విజయవాడ కు చేరుకున్న 20 వేల లడ్డూలు
- 25 May 2020 4:35 AM GMT
ఏపీలో ఈ నెల 29 లేదా 30 నుంచి మరో విడత రేషన్
- ఉచిత సరుకుల పంపిణీకి సమాయత్తం
- రాష్ట్రంలో పేదలకు ఐదో విడత ఉచిత సరుకులు పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
- ఈ నెల 29 లేదా 30 నుంచి సరుకులను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు.
- ఈ దఫా కూడా కార్డులోని ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యంతో పాటు కార్డుకు కిలో కందిపప్పు ఇవ్వనున్నారు.
- 25 May 2020 4:34 AM GMT
- నేడు వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలనపై మేధోమదన సదస్సు
- వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలనపై మన పాలన-మీ సూచన పేరుతో ఈరోజ ఉదయం 11 గంటలకు మేధోమదన సదస్సును నిర్వహించనున్నారు.
- గ్రామ, వార్డు, సచివాలయాలు, సంక్షేమం - పాలన వ్యవస్థలో వికేంద్రీకరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire