ఈరోజు (మే-22-శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

నిన్నటి ముఖ్యాంశాలు కొన్ని..

- రంగనాయకమ్మ సరైన కారణాలు చెప్పలేకపోయారు : సీఐడీ - మరిన్ని వివరాలు

- తెలంగాణలో మరో 38 మందికి కరోన పాజిటివ్ - మరిన్ని వివరాలు

- ఏపీలో షాపులు ఓపెన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్... కండిషన్లు ఇవే! - మరిన్ని వివరాలు

ఈరోజు తాజా సమాచారం



Show Full Article

Live Updates

  • 22 May 2020 6:29 AM GMT

    విశాఖ : నర్సీపట్నం మండలం సుబ్బారాయుడు పాలెం వద్ద మోటార్ సైకిలుపై తరలిస్తున్న 11 కిలోల గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ మొబైల్ టీం.

    ఇద్దరు వ్యక్తులు అరెస్టు. మోటారు సైకిలు స్వాధీనం.

  • 22 May 2020 6:03 AM GMT

    ప్రభుత్వ భూముల అమ్మకంపై హైకోర్టులో పిటిషన్.

    భూముల అమ్మకాన్ని నిరసిస్తూ కోర్టును ఆశ్రయించిన సామాజిక వేత్త తోట సురేష్ బాబు.

    పిటిషన్ పై నేడు జరగనున్న విచారణ.

  • 22 May 2020 5:09 AM GMT

    రాజోలు (మం) రాజోలు దొరగారి తోటలో పేకాట స్థావరం పై పోలీసులు దాడి.

    పోలీసులు వచ్చారనే కంగారులో బిల్డింగ్ పై నుండి దూకిన వ్యక్తి 

    ఆ వ్యక్తికి  తీవ్ర గాయాలు.

    అతనిని అమలాపురం కిమ్స్ హాస్పిటల్ కి తరలించిన పోలీసులు.

    నలుగురిని అదుపులోకి తీసుకుని 10,500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

  • 22 May 2020 3:59 AM GMT

    రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడంటే..

    భారత రైల్వే ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది.

    నడుపుతున్న ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్లు కల్పించేందుకు  రెగ్యులర్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

    అందులో భాగంగా దక్షిణమధ్య రైల్వే ప్రయాణికులందరికీ దశల వారీగా అన్ని ప్రధాన స్టేషన్ల లో రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ల ను తెరవనుంది.

    దీంతో నేటి నుంచి, 73 స్టేషన్ల లో కింది రిజర్వేషన్ కౌంటర్లు తెరవనుంది.

    తెలంగాణా లో 19..  ఏపీలో 43.. కౌంటర్లు 

    - పూర్తి వివరాలు 




     


  • 22 May 2020 3:49 AM GMT

    నూజివీడు మండలం మీర్జాపురం వద్ద అక్రమంగా టాటా ఏసీ వాహనంలో 15 క్వింటాళ్లు రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు

    కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రూరల్ యస్ ఐ రంజిత్ కుమార్

  • 22 May 2020 3:16 AM GMT

    కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కువారి పల్లె వద్ద ప్రమాదం.

    గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

    మృతుడు ఓబులవారిపల్లె మండలం వై కోట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.

  • 22 May 2020 3:03 AM GMT

    హైదరాబాద్‌ ఐడీఏ బొల్లారంలో భారీ పేలుడు

    హైదరాబాద్ నగరానికి సమీపంలోని ఐడీఏ బొల్లారంలో భారీ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది.

    ఐడీఏ బొల్లారంలోని ఓ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తాజా సమాచారం.

    సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే జిన్నారం మండలంలోని ఐడిఎ బొల్లారంలోని పీఎన్ఎం లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరగడంతో ఈ పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు.

    రియాక్టర్ పేలి ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

    వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    అగ్నిమాపక దళం వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నాయి.

  • 22 May 2020 1:57 AM GMT

    విద్యుత్ బిల్లులు తగ్గించాలని తెదేపా ఆధ్వర్యంలో నిరసన

    మాడుగుల: కరోనా కష్ట కాలంలో ఇబ్బంది పడుతున్న ప్రజలను మరింత అవస్థలకు గురిచేయడానికి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు రెట్టింపు స్థాయిలో పెంచిందని, తక్షణమే వాటిని రద్దు చేయాలని విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం తెదేపా ఇంఛార్జ్, మాజీఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాడుగుల నియోజకవర్గంలోని కె.కోటపాడు తెదేపా కార్యాలయంలో నిరసన చేపట్టారు. రామానాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.



     


  • 22 May 2020 1:50 AM GMT

    తెలంగాణాలో రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు

    తెలంగాణా సీయం కేసీఆర్ నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేస్తే మంచి ఫలితాలుంటాయని చెప్పారు. కేసీఆర్ రైతులకు ఇచ్చిన ముఖ్య సూచనలు 

    - గత ఏడాది వానాకాలంలో మాదిరిగానే వరిని 40 లక్షల ఎకరాల్లో సాగు చేయాలి.

    - పత్తిని 70 లక్షల ఎకరాలకు పెంచాలి. గతంలో ఇది 53 లక్షల ఎకరాల్లో ఉంది.

    గతంలో 7 లక్షల ఎకరాల్లో కంది వేయగా ఇప్పుడు 15 లక్షల ఎకరాల్లో వేయాలి.

    - పచ్చిరొట్టను విరివిగా సాగు చేయాలి.

    - వానాకాలంలో మక్కల సాగు లాభసాటి కాదు

    - వరి వంగడాల్లో తెలంగాణ సోనాకు డిమాండ్‌ ఉన్నందున దానిని పండించడం మంచిది  



     


     


  • 22 May 2020 1:41 AM GMT

    - నిర్మల్ జిల్లా: నిర్మల్ పట్టణం సోఫీనగర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ దాడులు.

    - ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన లక్ష రూపాయల నిషేధిత గుట్కా పట్టుకున్న టాస్క్ ఫోర్స్  పోలీసులు.

    - వ్యక్తి అరెస్టు. గుట్కా స్వాధీనం.

Print Article
Next Story
More Stories