ఈరోజు (మే-21-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు (మే-21-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా...

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

నిన్నటి ముఖ్యాంశాలు కొన్ని..

- ఒడిశా తీరంలో ఉంఫాన్ తుఫాను బీభత్సం.. పసికందు సహా ఇద్దరు మృతి - పూర్తి వివరాలు

- పర్యావరణ రక్షణ కోసం ఏపీలో కొత్త చట్టానికి రూపకల్పన - పూర్తి వివరాలు

- మూటలు మోసింది ఆయనే.. రేవంత్ రెడ్డి విమర్శలు -పూర్తి వివరాలు

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 21 May 2020 3:22 PM GMT

    రాష్ట్రంలో ఇవాళ 38 మందికి కరోన పాజిటివ్

    .

    -1699కి చేరిన కరోన పాజిటివ్ కేసుల సంఖ్య

    -ఒక్కరోజులోనే 5 గురు కరోనతో మృతి. 45 కి చేరిన కారోనా మృతుల సంఖ్య.

    -ఈ రోజు తాజాగా 23 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా... ఇప్పటి వరకు 1036 మంది కోలుకున్నారు.

    - ప్రస్తుతం రాష్ట్రంలో 618 యాక్టీవ్ కరోనా కేసులు.

    - ఈ రోజు నమోదైన కేస్ లలో 26 జిహెచ్ఎంసీ పరిధిలోవి కాగా, 2 రంగా రెడ్డి, 10 మంది మైగ్రాంట్స్ గా సర్కార్ ప్రకటించింది

  • 21 May 2020 2:09 PM GMT

    ఏపీలో షాపులు ఓపెన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్... కండిషన్లు ఇవే!

    లాక్ డౌన్ వలన ప్రజలు మాత్రమే కాదు.. ప్రభుత్వాలు కూడా ఆర్ధికంగా నష్టపోయాయి.. ఇక తిరిగి ఆర్థిక వ్యవస్థలను మళ్లీ పట్టాలు ఎక్కించే క్రమంలో పడ్డాయి. లాక్ డౌన్ ని కొనసాగిస్తూనే కేంద్ర,రాస్తా ప్రభుత్వాలు పలు సడలింపులను ఇస్తున్నాయి. అందులో భాగంగానే షాపుల లావాదేవీలకు ఏపీ ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది.

    -మరిన్ని వివరాలు 

  • 21 May 2020 1:39 PM GMT

    డీఆర్సీ ట్రస్ట్ చైర్మన్ దాడీ రమణచిట్టి ఆధ్వర్యంలో 2000మంది కూలీలకు భోజన వితరణ

    పెందుర్తి: కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆకలి బాధలు గమనించిన డి.ఆర్.సి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ దాడీ రమణచిట్టి ఆర్థిక సహాయంతో లాక్ డౌన్ విధించినప్పటినుండి ప్రతిరోజు నిరుపేదలు, అభాగ్యులు, అనాధలు, పారిశుద్ధ్య కార్మికులు, కూలీలు, వలస కార్మికులు, వృద్ధులు మరియు అన్ని వర్గాల ప్రజలకు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీరికి నిత్యావసర సరుకులు, కూరగాయలు,పాలు, గుడ్లు, మాస్కులు, దుస్తులు, మజ్జిగ ప్యాకెట్లు, అల్పాహారం, భోజనం ప్యాకెట్లు తదితర వాటిని పంపిణీ చేస్తున్నారు.

    లాక్ డౌన్ అమలయినప్పటి నుంచి ప్రతిరోజు ప్రజలకు సేవలు అందించి 50 రోజులు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా గురువారం నిరుపేదలు, పెందుర్తి వైపు నుండి వెళ్లే వలస కూలీలు రెండు వేల మందికి భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రమణచిట్టి మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా 50 రోజుల నుంచి నలభైఒక్క వేల మందికి అల్పాహారం మరియు భోజనం ప్యాకెట్లను అందజేసినట్లు తెలిపారు. ప్రజలెవరూ ఆకలితో అలమటించకూడదని తమ వంతు ఆహార పొట్లాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దాడి ఉమామహేశ్వరరావు, దాడి బుజ్జి, సరగడం గణేష్, రమణాజీ, పెతశెట్టి రాము ఇతరులు పాల్గొని బస్సులో వెళుతున్న వలస కార్మికులకు, లారీ డ్రైవర్లకు, నిరుపేదల అందరికీ మధ్యాహ్న భోజనము, మజ్జిగను అందజేశారు.




     


  • 21 May 2020 9:25 AM GMT

    అమరావతి : అసలే లాక్ డౌన్ వలన పనుల్లేక పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కరెంటు శ్లాబులు పెంచట బాధాకరమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.

    మార్చి, చార్జీలు పెంచి వాళ్ళ మీద బిల్లుల భారం మోపడం అన్యాయమని తెలిపారు.సునీత

    విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చెప్పిన వైస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇలా చేయడం మోసం అని పరిటాల సునీత అన్నారు.



  • 21 May 2020 9:22 AM GMT

    వైయస్సార్ వాహనమిత్ర అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు..

    -వాహనమిత్ర మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం..

    -సొంతంగా ఆటో ,ట్యాక్సీ లున్న డ్రైవర్ల కు ఆర్ధిక సాయం కింద 10 వేలు..

    -గతే ఏడాది 2 లక్షల 36 వేల 344 మందికి లబ్ది..

    -వచ్చే నెల 4న లభ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ..

    #YSRVahanaMitra #YSJaganCares

  • 21 May 2020 9:22 AM GMT

    రెండు, మూడు రోజుల్లో రైల్వే కౌంటర్లలో టికెట్‌ బుకింగ్‌..పీయూష్‌ గోయల్‌..

    రైల్వే రిజర్వేషన్లకు భారీగా స్పందన వస్తోందని. నిమిషాల్లోనే లక్షల టికెట్లు అమ్ముడుపోయయాని. వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానున్న రైల్వే సర్వీసుల కోసం ఈ రోజు ఉదయం 10 నుంచి ఆన్‌లైన్ రిజర్వేషన్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.

    రేపటి నుంచి దేశంలో ఉన్న 1.7 లక్షల కామన్‌ సర్వీస్‌ సెంటర్లలోనూ టికెట్లు బుక్‌ చేసుకునే సౌకర్యం కల్పిస్తామని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

    రెండు మూడు రోజుల్లో ఎంపిక చేసిన రైల్వే కౌంటర్లలో కూడా ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. 

  • 21 May 2020 8:52 AM GMT

    -పెరిగిన విద్యుత్తు చార్జీలు వెంటనే తగ్గించాలి 

    - విలేకరులతో మాజీ మంత్రి అయ్యన్న

    -మంత్రులు పెంచలేదని చెప్పడం దారుణం...

    -వినియోగదారుల దగ్గరకు వెళ్లి అడిగితే చార్జీలు పెరిగాయో, లేదో తెలుస్తుంది..

    -రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బిల్లులపై గగ్గోలు పెడుతుంటే పెరగలేదనడం చాలా తప్పు..

    -అధికారంలోకి వస్తే 200ల యూనిట్ల వరకు బిల్లులు కట్టనవసరం లేదన్న ముఖ్యమంత్రి దొంగదారిలో పెంచడం దారుణం.

    -ప్రభుత్వంపై విమర్శలు చేస్తే కేసులు పెట్టడం దారుణం.. సోషల్ మీడియాలో ఒక పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు వృద్ధురాలు అని చూడకుండా కేసు నమోదు చేశారు...

    -ఇంతటి దారుణమైన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు... అయ్యన్న

  • 21 May 2020 7:51 AM GMT

    ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

    హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానంపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటలపై అధికారులంతా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు

    -మరిన్ని వివరాలు 

  • 21 May 2020 6:46 AM GMT

    -తూ.గో.జిల్లా.. సఖినేటిపల్లి (మం) అంతర్వేది దేవస్థానంలో నలుగురిని క్వారంటైన్ కు తరలించిన అధికారులు..

    -పశ్చిమగోదావరిజిల్లా పెనుకొండలో పెళ్లి కి హాజరైన నాలుగురు..

    -పెళ్లిలో బంధువులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అనుమానంతో టెస్ట్ చేయిస్తున్న అధికారులు..

  • 21 May 2020 6:44 AM GMT

    అమరావతి

    -విదేశాల నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రవాసాంధ్రులు కోసం క్వారంటైన్ ఏర్పాటు

    -మంగళగిరి మండలం ఆత్మకూరు హ్యాపీ క్లబ్ మరియు చినకాకాని హాయిలాండ్ లో పెయిడ్ క్వారెంటైన్ ఏర్పాటు

    -రెండు క్లబ్బుల్లో 90 రూమ్ లు ఏర్పాటు..

    -ఈ రోజు నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా రిసార్ట్స్ కి రానున్న ప్రవాసాంధ్రులు

Print Article
More On
Next Story
More Stories