Live Updates:ఈరోజు (జూన్-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు మంగళవారం, 30 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, దశమి (రా.10:12 వరకు), చిత్త నక్షత్రం (ఉ.07:14 వరకు) సూర్యోదయం 5:44am,సూర్యాస్తమయం 6:54pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 30 Jun 2020 5:00 PM GMT
@ కృష్ణాజిల్లా÷ వత్సవాయి
- కృష్ణాజిల్లా వత్సవాయి మండలం దేచిపాలెం గ్రామ వ్యవసాయ బావిలో ఇనుప బీరువా లభ్యం
- బావిలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల మోటార్లతో నీటిని బయటికి లాగి బీరువా ని వెతికి తీసిన గ్రామస్తులు ,పోలీసులు
- బీరువాలో పలు కీలక పత్రాలు,ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా పుస్తకాలు ,దుస్తులు, వివాహ ఆల్బమ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
- వాటి ఆధారంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పేరిచర్ల గ్రామానికిచెందినవిగా గుర్తించిన పోలీసులు
- గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం చెందిన బీరువా వత్సవాయి మండలం దేచి పాలెం గ్రామ వ్యవసాయ బావి లోకి ఎలా వచ్చింది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు పోలీసులు
- ఎవరైనా దుండగులు తీసుకొచ్చి పడేశారు అని అనుమానం వ్యక్తం చేస్తూ మరి ఇంకా ఏదైనా ఆధారాలు దొరుకుతాయా అని బావిలో నీళ్ళు తోడేస్తున్న పోలీసులు
- 30 Jun 2020 3:40 PM GMT
- నెల్లూరులో లిక్కర్ మాఫియా
- నెల్లూరు నగరంలోని కుక్కలగుంటలో భారీ మద్యం డంప్ ని పట్టుకున్న స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు. రూ.3లక్షల విలువ చేసే మద్యం, ఓ వాహనం స్వాధీనం. మెయిన్ బ్రాండ్ల మద్యాన్ని నిల్వచేసి అధిక ధరలకి అమ్మకాలు సాగిస్తున్న ముఠా.
- 30 Jun 2020 3:39 PM GMT
@ తూర్పుగోదావరి జిల్లా
_ చింతూరు మండలం
- మోతుగూడెం లొ సుమారు10 లక్షలరూపాయల విలువచేసే,, 230 కే.జిల గంజాయి పట్టివేత,,,ఆరుగురు వ్యక్తులు,అరెస్ట్,,రెండు వాహనాలు షిజ్,,సీలేరు నుండి భద్రాచలం తరలిస్తుండగా వాహనాల తనికిలలొ పట్టు బడినట్లు ఎస్సై.టి.వి సుబ్బారావు తెలిపారు.
- 30 Jun 2020 2:55 PM GMT
@ అనంతపురం జిల్లా
- రెండు లారీలు ఢీ.....
- డ్రైవర్ సజీవ దహనం
- తాడిపత్రి పట్టణం సమీపంలోని కడప రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి.
- ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఓ లారీ డ్రైవర్ సజీవదహనమయ్యాడు.
- తాడిపత్రి నుంచి వరిపొట్టు లోడుతో వెళ్తున్న లారీ, కడప వైపు నుంచి నల్లబొగ్గు లోడ్‌తో తాడిపత్రి వైపు వస్తున్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి.
- దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బొగ్గు లారీ డ్రైవర్ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిషార్ సజీవదహనమయ్యాడు.
- మరో లారీలో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
- స్థానికులు, పోలీసులు గంటపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు.
- అనంతరం క్షతగాత్రులను బయటకు తీసి తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు.
- 30 Jun 2020 10:46 AM GMT
ప్రధాని మోడీ ప్రసంగం
- మాస్క్ పెట్టుకోలేదని ఒక దేశ ప్రధానికి జరిమానా విధించారు .
- అంత కఠినంగా ఉంటే తప్ప కరోనాను కట్టడి చేయలేం
- నిబంధనలు పాటించని వారి తీరు మార్చాలి
- 30 Jun 2020 10:42 AM GMT
ప్రధాని మోడీ ప్రసంగం..
- నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది
- మనం అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నాం
- కంటైన్మెంట్ జోన్ల పై దృష్టి పెట్టాలి
- 30 Jun 2020 10:38 AM GMT
ప్రారంభం అయిన ప్రధాని ప్రసంగం
- కరోనాతో పోరాడుతూ అన్ లాక్ 2.0 లోకి ప్రవేశించాం
- లాక్ డౌన్ తో లక్షలాది మంది ప్రాణాలు కాపాడాం
- ఈ దశలో జాగ్రత్తలు అవసరం
- మనదేశంలో కరోనా మరణాల శాతం తక్కువ
- 30 Jun 2020 9:42 AM GMT
@విజయనగరం జిల్లా
- భోగాపురం మండలం
- అవనాం గ్రామంలో భారీ దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
- జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాజకుమారి..
- 6గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- 31 లక్షల రూపాయల దొంగ నోట్లు, 65,350 వేల రూపాయల అసలు నగదు, 5 సెల్ ఫోన్లు, జెరాక్స్ మెషీన్, దొంగనోట్ల ప్రింటింగ్ కోసం వాడుతున్న యంత్రాలు స్వాధీనం.
- సవరవిల్లి సంతలో 2 గొర్రెలు కొని 20 వేల రూపాయల దొంగ నోట్లు అంటగట్టిన నిందితులు.
- అనుమానం వచ్చి నిందితులను వెంటాడి పెట్టుకున్న గొర్రెల వ్యాపారి, మరో వ్యాపారుడు.
- భోగాపురం మండలం అక్కివరం గ్రామానికి చెందిన బిటెక్ విద్యార్ధి, మాజీ నేవీ ఉద్యోగి కంది రాము, మజ్జి రమణ, గౌరునాయుడు, లెంక శేఖర్, సురేష్, మొగిలి విజయ్ కిరణ్ అరెస్ట్
- విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రధాన నిందితుడు కింది రాము ఇంటిలో దొంగ నోట్ల ముద్రణ
- 5 వేల రూపాయల ఒరిజినల్ నోట్లు ఇస్తే... 15వేల రూపాయల దొంగ నోట్లు ఇవ్వటానికి పలువురితో ఒప్పందం.
- 30 Jun 2020 9:36 AM GMT
-రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా విజయవాడ బెంజ్ సర్కిల్ సెంటర్ నుండి ప్రారంభించనున్న 104, 108అంబులెన్సు వాహనాలు...
- బెంజ్ సర్కిల్ లో ఏర్పాట్లును మంగళవారం పరిశీలించిన ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతి యాజ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire