Live Updates:ఈరోజు (జూన్-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు సోమవారం, 29 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, నవమి (రా.10:12 వరకు), హస్త నక్షత్రం (ఉ.07:14 వరకు) సూర్యోదయం 5:44am,సూర్యాస్తమయం 6:54pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 29 Jun 2020 2:17 PM GMT
- మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిదిలోని ఇంటర్ విద్యార్థినిలు మిస్సింగ్
- బిజేఆర్ నగర్ కు చెందిన గ్లోరియా (19) సంవత్సరాలు ఇంటినుండి చెప్పకుండా వెళ్లిపోయినట్లు
- గ్లోరియా తల్లిదండ్రులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు .
- మౌలాలి షఫీ నగర్ కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని నవనీత (18) యువతి ఇంటి నుండి తల్లితండ్రులకు చెప్పకుండా వెళ్లిపోయినట్లు నవనీత తల్లిదండ్రులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు
- రెండు మిస్సింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలుసులు
- 29 Jun 2020 2:16 PM GMT
- హైదరాబాద్ లాక్ డౌన్ తో తెలంగాణ లో జరగాల్సిన ఎంట్రన్స్ పరీక్షలపై ప్రభావం
- ఎంసెట్, ఈసెట్, పీజీ సెట్ లు వాయిదా పడే అవకాశం
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 80 శాతం పరీక్షా కేంద్రాలు
- జులై ఒకటి నుంచి 20 వరకు వివిధ ఎంట్రన్స్ లు
- ఉన్నత విద్యా మండలి , వివిధ యూనివర్సిటీ ల అధికారులతో జరుగుతున్న కీలక సమావేశం
- 29 Jun 2020 2:14 PM GMT
కరీంనగర్ పోలీస్ రేంజ్ పరిధిలో ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్
_ కరీంనగర్ రేంజ్ పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల కు చెందిన ఇద్దరు ఎస్ఐలు సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కరీంనగర్ రేంజ్ ఇంఛార్జి డీఐజీ పి ప్రమోద్ కుమార్ ...
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఎల్ ప్రవీణ్ కేసును నమోదు చేయడంలో ఆలస్యం చేయడం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలం కావడం కారణాలతో సస్పెన్షన్
- కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ ఎస్ఐ ఎన్ వెంకటేష్ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కలప ను తెప్పించి వివిధ రకాల వస్తువులను తయారు చేసినందుకు గాను సస్పెన్షన్
- 29 Jun 2020 2:13 PM GMT
_నాగరత్న ఐఎండి అసిస్టెంట్ డైరెక్టర్ @ హైదరాబాద్....
- దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది...
- మరట్వాడ ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం 3.5 కి.మి ఆవరించి ఉంది...
- మధ్యప్రదేశ్ నుండి మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతోంది...
- ఉపరితల ఆవర్తనం వల్ల రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది....
- ఉరుములు ,మెరుపులతో పాటు 30 కి.మీ వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది....
- ఇవాళ ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...
- సంగారెడ్డి, మెదక్ ,సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ ,వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...
- 29 Jun 2020 12:24 PM GMT
పోలీస్ డిపార్ట్మెంట్ సిస్టం ఎప్పుడు ఫెయిల్ కాదు : సీపీ అంజనీ కుమార్
- నక్సల్స్ సమస్య నుంచి కరోనా వరకు అన్ని సమస్యలను పోలీసులు ముందుడి ఎదుర్కొంటున్నారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు.
- దేశంలోని ఇతర ప్రధాన సిటీలతో పోలిస్తే హైదరాబాద్ లో తక్కువ కేసులు రావడానికి సిటీ పోలీసులే కారణం అని ఆయన తెలిపారు.
- మా డిపార్ట్మెంట్ హీరోస్ ను వెల్కమ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
- పోలీస్ డిపార్ట్మెంట్ సిస్టం ఎప్పుడు ఫెయిల్ కాదన్నారు.
-జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పటివరకు ప్రతీ సందర్భంలో పోలీసులు ముందున్నారన్నారు.
- కరోనాను ఎదుర్కోవడంలో సిటీ పోలీసుల కృషి చరిత్రలో నిలుస్తుందన్నారు.
- కరోనాను జయించాక తిరిగి మాస్కులు...సానిటైజర్లు వాడాలని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి ఆయన సూచించారు.
- ప్రతి ఒక్క పోలీసుల కుటుంబసభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
- 29 Jun 2020 10:22 AM GMT
మచిలీపట్నం
- జిల్లా కేంద్రం మచిలీపట్నంలో వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్య
- మార్కెట్ లో ఉండగా కత్తితో పొడిచి పరారైన గుర్తు తెలియని వ్యక్తి
- దాడిలో గాయపడ్డ భాస్కరరావు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
- చికిత్స పొందుతూ మృతి
- పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు అనుమానం
- ఆస్పత్రికి భారీగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు
- భారీగా మోహరించిన పోలీసులు
- గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గా పని చేసిన భాస్కరరావు
- 29 Jun 2020 10:20 AM GMT
కృష్ణాజిల్లా
- నందిగామ మండలం మనగచర్ల గ్రామానికి చెందిన క్రైమ్ ఇండియా రిపోర్టర్ గంట నవీన్ హత్య కేసును ఛేదించిన నందిగామ పోలీసులు.
- ఈ కేసులో తొమ్మిది మంది నేరస్తులను మీడియా ముందు హాజరు పరిచిన నందిగామ డిఎస్పీ.
- తొమ్మిది మందిలో ఒకరు బాల నేరస్తుడు.
- 29 Jun 2020 10:14 AM GMT
కృష్ణాజిల్లా :
- మచిలీపట్నం.
- మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరావు పై మునిసిపల్ చేపల మార్కెట్ లో హత్యాయత్నం.
- కత్తితో పొడిచి పరారైన గుర్తు తెలియని వ్యక్తి . హాస్పిటల్ కు తరలింపు.
- 29 Jun 2020 9:47 AM GMT
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- నగరంలోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఉధ్రిక్త వాతావరనం నెలకొంది.
- తమిళనాడు, ఆంద్రప్రదేశ్, కేరళ బార్డర్ టాక్స్ ఏడాది కాలం పాటు రద్దు చేయాలంటూ, తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ పర్మిషన్ ఇవ్వాలంటూ స్టేట్ క్యాబ్స్ అండ్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది.
- 29 Jun 2020 9:45 AM GMT
జూలై 2 న తెరుచుకోనున్న మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం
- కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా అన్ని దేవాలయాలు మూత పడిన విషయం తెలిసిందే.
- ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కొన్ని ఆలయాలను తెరచి భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నప్పటికీ, మరి కొన్ని ఆలయాలు ఇంకా తెరచుకోకుండానే ఉన్నాయి.
- ఆ ఆలయాల జాబితాలో మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం కూడా ఒకటి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire