Live Updates:ఈరోజు (జూన్-28) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు ఆదివారం, 28 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, అష్టమి (రా.12:36 వరకు), ఉత్తర నక్షత్రం (ఉ.08:36వరకు) సూర్యోదయం 5:44am,సూర్యాస్తమయం 6:54pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 28 Jun 2020 4:29 AM GMT
లోకేష్ పనిపాట లేకుండా ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకొంటున్నాడు: వైసీపీ ఎమ్మెల్యే రోజా
- టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు
- ఖజానాకి మూడున్నర లక్షల కోట్లు అప్పు ఉంచి వెళ్ళారని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూడా ప్రజలను క్లిష్టమైన సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా ఆదుకున్నారని రోజా అన్నారు.
- ఆదివారం ఆమె తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి కారణంగా శ్రీవారిని భౌతిక దూరం పాటిస్తూ దర్శించుకున్నానని తెలిపారు. కరోనా టెస్తుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉందన్నారు.
- 28 Jun 2020 4:27 AM GMT
ముగిసిన అచ్చెన్నాయుడు కస్టడీ..
- మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
- ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
- గుంటూరు జీజీహెచ్‌లో మూడు రోజులపాటు మొత్తం 12.30 గంటలు పాటు ఆయనను ఏసీబీ అధికారులు విచారించారు.
- కోర్టు ఆదేశాలతో మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారించారు. దీంతో ఏసీబీ విచారణ శనివారంతో ముగిసింది.
- 28 Jun 2020 3:57 AM GMT
ఇసుక రీచ్ ను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ డా .కె .మాధవీలత
తోట్లవల్లూరు: మండలం వల్లూరు పాలెం ఇసుక రీచ్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ డా. కె.మాధవీలత ఆకస్మిక తనిఖీ చేశారు.
- ఈ సందర్భంగా జేసీ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ధేశించిన ఇసుక రీజెర్వు స్టాక్ ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
- వర్షా కాలం దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు.
- ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని రవాణా, పట్టా భూముల కాంట్రాక్టర్లు ను జేసీ ఆదేశించారు.
- ఈ సందర్భంగా జేసీ వెంట మైనింగ్ శాఖ డిడి శ్రీనివాస్ కుమార్, జిల్లా సాండ్ అధికారి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
- 28 Jun 2020 3:23 AM GMT
మన్యంలో విస్తరిస్తున్న మహమ్మారి... అప్రమత్తమైన అధికారులు
విశాఖపట్నం: మన్యానికి కరోనా తాకిడి తగిలింది. అప్రమత్తమైన పాడేరు అధికారులు నియంత్రించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
- వ్యాపారరీత్యా అనకాపల్లితో నిత్యం సత్సంబంధాలు కలిగి ఉంటూ... ప్రతిరోజు కిరాణా, ఇతర సామగ్రి కోసం మన్యం వాసులు అక్కడికి చాలామంది రాకపోకలు సాగిస్తుంటారు.
- మరోవైపు.. శుక్రవారం ఒక్క రోజే అనకాపల్లిలో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- ఫలితంగా.. మన్యానికి వ్యాపారులు రాకపోకలు నిలిపివేసేందుకు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది.
- సరిహద్దుల్లో వాహనాలు నిలువరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
- హుకుంపేట సంతలో సరిహద్దులోని వాహనాలను ఇప్పటికే వెనక్కి పంపేశారు.
- పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం.. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.
- రద్దు విషయం తెలియని గిరిజనులు కొంత ఇబ్బందులు పడ్డారు. మన్యంలో ప్రస్తుతం ఐదు కేసులు నమోదు అయ్యాయి.
- మైదాన ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు మన్యంలో ప్రచారం చేస్తున్నారు.
- 28 Jun 2020 2:58 AM GMT
బెల్టుషాపుల మాకొద్దు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ రోడ్డెక్కిన మహిళలు
మైలవరం: నియోజకవర్గంలోని మైలవరం మండలం అనంతవరం బెల్ట్ షాపులు మాకొద్దు బాబోయ్ అంటూ అనంతవరం గ్రామంలో మహిళలు రోడ్డెక్కారు.
- ఆంద్ర బోర్డర్ లో రోజురోజుకూ విపరీతంగా పుట్టుకొస్తున్న మద్యం బెల్ట్ షాపులు తీసివేయాలని అనంతవరం మరియు ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న గ్రామస్తులు గళమెత్తారు.
- కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల నుండి తమ గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మధ్యం సేవించడానికి వచ్చి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న ముందు బాబుల ఆగడాలు తట్టుకోలేకపోతున్నామని వాపోతున్నారు.
- మహిళలకు రక్షణ లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.
- కరోనా భయంతో కకావికలమవుతుంటే ఎక్కడెక్కడి నుండో వస్తున్న మందుబాబులను బెల్ట్ షాపు నిర్వాహకులు కూర్చోబెట్టి తాగిస్తూ తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారన్నారు.
- బోర్డర్ లో నివాసాలుంటున్న తమకు ఇరు నియోజకవర్గ శాసనసభ్యులు న్యాయం చేయాలని కోరుతున్నారు.
- ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమకు న్యాయం చేయకుంటే నిరసనలు తీవ్రతరం చేస్తామని ఉద్ఘాటించారు.
- 28 Jun 2020 1:58 AM GMT
నూతన సబ్ స్టేషన్ ప్రారంభించిన ఎంపీ వంగా గీత
జగ్గంపేట: జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి, జగ్గంపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులను కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు.
- జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో నూతన సబ్ స్టేషన్ ను ఆమె ప్రారంభించారు.
- అనంతరం జగ్గంపేటలో నూతనంగా నిర్మించిన కల్వర్టును ప్రారంభించి, తదుపరి గండేపల్లి మండలం ఎన్ టి రాజాపురం, మురారి గ్రామాలలో నూతన సబ్ స్టేషన్ లను ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు.
- ఈ సందర్భంగా ఎంపి గీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైస్ జగన్ రైతులకు వెన్నుదన్నుగా అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు.
- రైతులకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారన్నారు.
- 28 Jun 2020 1:52 AM GMT
పిఠాపురం శ్రీ పాద శ్రీ వల్లభ క్షేత్రంలో భక్తుల దర్శనాలు నిలిపివేత
పిఠాపురం: పట్టణంలో శ్రీ పాద శ్రీ వల్లభ క్షేత్రంలో భక్తుల రక్షణ చర్యలలో భాగంగా భక్తులకు రేపటి నుంచి తాత్కాలికంగా దర్శనములు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
- ఆలయం పక్కనే గల వీధిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.
- పిఠాపురం పట్టణం చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
- స్వామి వారి నిత్య పూజాధికములు అర్చకులచే నిర్వహిస్తారన్నారు. భక్తులంతా ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
- 28 Jun 2020 1:46 AM GMT
గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
తుని: మండలంలోని కోటనందూరు జగన్నాధపురం ప్రధాన రహదారి గుండా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తుని రూరల్ సిఐ కిషోర్ బాబు తెలిపారు.
- ద్విచక్ర వాహనాలు తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పరార్ అయ్యేందుకు ప్రయత్నించారని అనంతరం పట్టుకుని తనిఖీలు నిర్వహించగా వారి వద్ద మూడు కేజీల గంజాయి బయటపడిందన్నారు.
- వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
- 28 Jun 2020 1:40 AM GMT
పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు
తాడిపత్రి: తాడిపత్రి డిఎస్పీ ఏ. శ్రీనివాసులు పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించి, కరోనా వైరస్ దృష్ట్యా జిల్లా ఎస్పీ రాజశ్రీ సత్య ఏసు బాబు ఆదేశాలనుసారం పోలీస్ స్టేషన్ బయట ఏర్పాటుచేసిన రిసెప్షన్ సెంటర్, పెడల్ ఆపరేటర్ శానిటైజర్, ఆక్సి మీటర్, బెల్ హాలర్, స్ప్రే మిషన్ మొదలగునవి పరిశీలించి, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా మాస్కులు, గ్లౌజులు, ఫేస్ షీల్డ్ తప్పనిసరిగా ధరించవలెనని, శానిటైజర్ ఉపయోగిస్తూ ఉండవలెనని మరియు వ్యాధినిరోధక శక్తి పెంచేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పామిడి రూరల్ ఇన్స్పెక్టర్ రవి శంకర్ రెడ్డి, మరియు ఎస్సై రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
- 28 Jun 2020 1:33 AM GMT
కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం.. నాలుగురు వ్యక్తులు అరెస్ట్
విడపనకల్లు: అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగి గ్రామ పొలాల దారి గుండా అనంతపురంకు చెందిన ముగ్గురు వ్యక్తులు, హావళిగి కు చెందిన ఒక వ్యక్తి అక్రమంగా కర్ణాటక లిక్కర్ తరలిస్తున్నవ్యక్తులను పట్టుకున్నారు.
- పాల్తూరు ఎస్ఐ రాజేశ్వరి రాజోల్ మరియు పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్యం తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు.
- వారి వద్ద నుండి 262 కర్ణాటక టెట్రా ప్యాకెట్లలతో పాటు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
- వారిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్ఐ రాజేశ్వరి రాజోల్ తెలిపారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire