Live Updates:ఈరోజు (జూన్-27) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు శనివారం, 27 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, సప్తమి (రా.02:52 వరకు), పుబ్బనక్షత్రం (ఉ.10:11వరకు) సూర్యోదయం 5:44am,సూర్యాస్తమయం 6:54pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 27 Jun 2020 10:30 AM GMT
- ఏల్లవరం గ్రామపంచాయతీ వాలంటీర్లు పై దాడి చేసిన కొరుప్రొలు సతీష్...
- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వాలెంటిర్లు..
- ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సచివాలయ సిబ్బంది భోజనాలు చేస్తుండగా కార్యాలయానికి వచ్చిన సతీష్ విచక్షణారహితంగా వాలంటీర్ పై దాడి చేసి ఫోను లాక్కున్నాడు..
- 2 రోజుల క్రితం కుల దృవపత్రం కావాలంటూ సచివాలయంలో దరఖాస్తు చేసినట్లు సమాచారం...
- ఎందుకు కుల దృవపత్రం ఇంకా చేయలేదని వాలెంటర్ల్లు పై దాడి చేసి గాయపరిచాడు.
- వాలెంటిర్లు గొలుగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
- 27 Jun 2020 9:37 AM GMT
- అనంతపురం: కలెక్టర్ గంధం చంద్రుడు కి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోన్.
- హిందూపురం ను జిల్లా కేంద్రం గా ప్రకటించాలని కోరిన బాలకృష్ణ.
- జిల్లా ఏర్పాటుకు కావలసిన అన్ని సౌకర్యాలు హిందూపురం లో ఉన్నాయని స్పష్టం చేసిన ఎమ్మెల్యే.
- హిందూపురం సమీపంలోని మలుగూరు వద్ద మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే బాలకృష్ణ
- 27 Jun 2020 9:37 AM GMT
- నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణ కేంద్రంలో హరితహారం లో పాల్గొని మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.....
- 27 Jun 2020 9:36 AM GMT
- నల్గొండ : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్. బ్రాహ్మణ వెళ్ళేంల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టును ఆశ్రయిస్తా... కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్లు ఖర్చు పెట్టిన సీఎం కేసీఆర్...50 కోట్లు ఖర్చుపెడితే బ్రాహ్మణ వెళ్లేంల ప్రాజెక్టు పూర్తయ్యేది కాదా ? ప్రాజెక్టు పూర్తయ్యితే నకిరేకల్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందుతుంది... రైతుల దగ్గర బాగా డబ్బు ఉన్నదని కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారు.. గ్రౌండ్ రియాల్టీ పరిశీలిస్తే ఆ పరిస్థితి లేదు.రైతులంతా అప్పుల్లో కూరుకు పోయారు.. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా నేటి నుంచి రైతులకు సబ్సిడీ కింద విత్తనాలు అందిస్తాం.
- 27 Jun 2020 9:36 AM GMT
>> ఎంసిహెచ్ఆర్డి
- ప్రభుత్వ భూముల రక్షణ పైన మంత్రి కేటిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం
- రాజధానిలో పరిధిలోని ప్రభుత్వ భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపైన ఈరోజు మంత్రులు కేటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కూమార్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
- హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు, జిహెచ్ఎంసి, దేవాదాయ శాఖ అధికారులు
- ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు- కేటిఆర్
- ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తులకు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి
- ముఖ్యంగా రెవిన్యూ, దేవాదాయ భూముల పైన ప్రత్యేక దృష్టి సారించాలి
- ప్రభుత్వ భూములను కాపాడటం కోసం ఇప్పటికే ఆయా శాఖల వద్ద ఉన్న సమాచారం మేరకు ఆయా స్థలాలకు జియో పెన్సింగ్ వేయడంతో పాటు జిఐఎస్ మ్యాపింగ్ చేయాలి
- ప్రభుత్వ భూములపైన ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులను మంత్రులు కేటిఆర్, తలసాని అదేశం
- 27 Jun 2020 9:35 AM GMT
@విశాఖ: చిటీల పేరుతో టోకరా
- సుమారు రెండు కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ
- 140 కుటుంబాల నుంచి రెండు కోట్ల రూపాయలు వసూలు
- చంద్రానగర్ లో కొణతాల లక్ష్మీమాధురీ, అప్పలరాజు దంపతుల నిర్వాకం
- అప్పలరాజు రైల్వే ఉద్యోగి కావడంతో నమ్మకంగా చిటీ వేసిన స్థానికులు
- రైల్వేలో సీనియర్ కమర్షియల్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న అప్పలరాజు
- కోట్ల రూపాయల వసూలు చేసి చేతులెత్తేసిన దంపతులు
- ఇటీవల లక్ష్మీమాధురీ మరణంతో చెల్లింపుల బాధ్యత తీసుకున్నభర్త అప్పలరాజు
- నెలలు గడుస్తున్నా పైసా కూడా చెల్లించని అప్పలరాజు
- డబ్బు కోసం నిలదీయగా రాత్రికి రాత్రే ఇల్లు మారిపోయిన అప్పలరాజు
- లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
- 27 Jun 2020 9:34 AM GMT
- జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన దాసరి ప్రభు...
- తన సోదరుడు దాసరి అరుణ్ పై ఈ నెల 25 న జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదు...
- పోలీస్ స్టేషన్ కు మరోసారి ప్రభు ను పిలిచిన జూబ్లీహిల్స్ పోలీసులు.
- 27 Jun 2020 9:34 AM GMT
- కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తో భేటియైన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు
- కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేయనున్న రఘురామకృష్ణరాజు
- 27 Jun 2020 9:01 AM GMT
- కాంట్రవర్సీలో చిక్కుకున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’
- సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాధ్, శీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’..సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి.. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై వివాదం నెలకొంది.. అయితే ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు అయిన హీరోయిన్లుకి హిందూ దేవతల పేర్లు పెట్టారని, వారితో అధిక మోతాదులో రొమాన్స్ నడిపారని రాకేష్ అనే వ్యక్తి చిత్రంపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. దీనితో ఈ చిత్రాన్ని వెంటనే ఆపేయాలని రాకేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు..
- 27 Jun 2020 8:44 AM GMT
- లోకసభ స్పీకర్ ఓం బిర్లాతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ.
- సుమారు 50 నిమిషాల పాటు*జరిగిన చర్చ.
- తనకు రక్షణ కల్పించే విషయంపై ప్రధానంగా మాట్లాడినట్లు సమాచారం.
- రఘురామకృష్ణ రాజు భద్రతకు సంబంధించి తన ఓఎస్డీ ద్వారా హోం శాఖకు సమన్వయం చేస్తున్నట్లు చెప్పిన స్పీకర్.
- కమిటీ సమావేశాలు, పార్లమెంటు సమావేశాల నిర్వహణపై కూడా ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం..
- ఈ ఉదయం 10 గం.లకు రాజ్నాథ్ సింగ్ తో సమావేశం అయిన రఘురామ కృష్ణంరాజు.
- పలువురు బీజేపీ సీనియర్ నేతలనూ కలిసే అవకాశం..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire