Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు గురువారం, 25 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, చవితి (ఉ.08:47 వరకు), ఆశ్లేష నక్షత్రం (మ.12:20వరకు) సూర్యోదయం 5:43am,సూర్యాస్తమయం 6:53 pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Jun 2020 1:43 AM GMT
చేబ్రోలులో మొదటి పాజిటివ్ కేసు నమోదు
- చేబ్రోలు: స్థానిక సాలీపేట బజారులో బుధవారం కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
- ప్పటి వరకు ఇదే చేబ్రోలు మండలంలో మొదటి కేసు నమోదు అయింది.
- సదరు పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తిని 108 వాహనంలో క్వారంటైన్ కు తరలించారు.
- చేబ్రోలులోని సాలీపేట బజారులో నివసించే ఈ యువకుడు నాలుగు రోజులుగా అస్వస్థతకు గురవటంతో తెనాలిలోని వైద్యశాలకు వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. - బుధవారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు గుర్తించారు.
- యువకుడి ప్రైమరీ కాంటాక్టులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
- సాలిపేట ప్రాంతాన్నికంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.
- 25 Jun 2020 1:35 AM GMT
దర్శనం వేళలు సడలించిన సత్యదేముని దేవస్థానం
అన్నవరం: కరోనా కేసులు జిల్లాలో అనూహ్యంగా పెరుగుతున్న పరిస్థితిల్లో జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా లోని కరోనా ఆంక్షలు, లాక్ డౌన్ దరిమిలా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే సత్యదేముని ఆలయ దర్శనములకు భక్తుల అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
వ్రతాలు నిర్వహించుకొను భక్తులు ఉదయం 6 గంటలనుండి 8 గంటల లోపు ఆలయం వద్దకు రావలెనని, నిత్యకళ్యాణం, ఆయుష్య హోమాలు నిర్వహించుకునే భక్తులు టికెట్లను ఆన్ లైన్ తీసుకొనిన యెడల పరోక్షంగా వారి పేరున చేయబడునట్లు, కేశఖండన చేసుకొనే భక్తులు ఉదయం 10 గంటల లోపు ఆలయంకు రావలెనని మొదలగు సమాచారంతో ఆలయ కార్యనిర్వాహణాధికారి పేరిట భక్తులకు సమాచారం తెలిపారు.
- 25 Jun 2020 1:30 AM GMT
తెలంగాణాలో ఆషాఢమాసంలో నిర్వహించే బోనాల ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి.
- ఏటా గోల్కొండ కోటలోని శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత సికింద్రాబాద్, పాతబస్తీతో సహా ఇతర ప్రాంతాల్లో జరగడం ఆనవాయితీ.
-ఇక్కడ 9 వారాలపాటు ఉత్సవాలు జరుగుతాయి.
- తెలంగాణలో బోనాల ఉత్సవాలు గోల్కొండ కోటలో ప్రారంభమై చివరకు ఇక్కడే ముగుస్తాయి.
- ఉత్సవాలను సంప్రదాయబద్దంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి మహేందర్‌కుమార్ తెలిపారు.
- 25 Jun 2020 1:21 AM GMT
నో మాస్క్.. నో ఎంట్రీ : ఎంపీడీవో
- బద్వేల్: జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో మాస్కులు లేనివారికి ప్రవేశం లేదని ఎంపిడిఓ ప్రతాప్ తెలిపారు.
- ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు వేసుకోవాలని అలా వేసుకొని వారికి జరిమానా విధించడం జరుగుతుందన్నారు. - మండలంలోని 10 గ్రామ సచివాలయాలకు సంబంధించిన పంచాయితీ కార్యదర్సులకు మాస్కులు లేనిదే ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశం లేదనే వాల్పోస్టర్ స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ ప్రతాప్ విడుదల చేశారు.
- వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు వాడలన్నారు.
- ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఫణిరాజకుమారి, రవిచంద్ర, పాలయ్య తదితరులు పాల్గొన్నారు.
- 25 Jun 2020 1:13 AM GMT
కుప్పం లో తమిళనాడు బియ్యం అక్రమరవాణా
- కొరొనా విపత్కర పరిసిత్తులలో కూడా ఆగని తమిళనాడు బియ్యం అక్రమ రవాణా...
- కుప్పంలోని బైరుగానీపల్లి దగ్గర ఉన్న రైస్ ముల్లు పై కుప్పం సిఐ ఈదురు బాషా దాడి చేసి 186 బస్తాలలో ఉన్న 9 టన్నుల తమిళనాడు బియ్యం పట్టివేత.
- 25 Jun 2020 1:06 AM GMT
అక్రమ మద్యం పట్టివేత
- ఉరవకొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలోని విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లి గ్రామ శివారులో ధర్మపురి గ్రామానికి చెందిన అంజనేయులు అనే వ్యక్తి నుండి 48 కర్ణాటక మద్యం హైవార్డ్ విస్కీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
- దింతో పాటు ఉరవకొండ పట్టణ శివారులో గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన మల్లికార్జున అనే వ్యక్తి నుండి 12 ఒరిజినల్ చాయిస్ 750 ml కర్ణాటక మద్యం బాటిళ్లను, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం సెబ్ అధికారులు చేసుకున్నారు.
- ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ శ్యాంప్రసాద్, ఇన్స్పెక్టర్ సునంద, ఎస్ఐ సత్యనారాయణ, హెచ్ పి రమేష్ , కానిస్టేబుల్ రామకృష్ణ, వీరారెడ్డి , శైలజ, మౌలా, శివ, కుమారి పాల్గొన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire