Live Updates:ఈరోజు (జూన్-21) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు ఆదివారం, 21 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, అమావాస్య (మ.12:10 వరకు), మృగశిర నక్షత్రం (మ.01:01వరకు) సూర్యోదయం 5:42 am,సూర్యాస్తమయం 6:53 pm
ఈరోజు ప్రత్యేకతలు : అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఫాదర్స్ డే - సూర్యగ్రహణం
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 21 Jun 2020 4:10 PM GMT
»» తెలంగాణ లో రికార్డ్ స్థాయిలో 730 కరోన పాజిటివ్ కేసులు నమోదు..
- ఒక్క జిహెచ్ఎంసి లోనే 659 కేసులు...
- ఇప్పటి వరకు 7802 కి చేరిన కేసుల సంఖ్య ..
- ఇవాళ మరో 7 మంది మృతి 210 కి చేరిన మరణాల సంఖ్య...
- 3861 అక్టీవ్ కేసులు...
- ఇవాళ 225 మంది డిచార్జ్ ఇప్పటి వరకు 3731 డిచార్జి అయ్యారు...
- ఇప్పటి వరకు తెలంగాణ లో 57,054 టెస్టులు పూర్తి
- 21 Jun 2020 9:14 AM GMT
అంబాజీపేట మండలం వాకలగరువు నుండి అక్రమంగా తరలిస్తున్న మట్టిని అడ్డుకున్న గ్రామస్తులు
- అమలాపురం నుండి వచ్చి మట్టి తరలిస్తే మా గ్రామ పరిస్తితి ఏమిటని ఆందోళన చేస్తున్న గ్రామస్తులు..
- ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు
- 21 Jun 2020 8:36 AM GMT
తిరుమలలో గ్రహణ శాంతి యజ్ఞం
- సూర్యగ్రహణం సందర్భంగా టీటీడీ కరోనా వ్యాధి నుంచి ప్రపంచ మానవాళిని రక్షించాలని గ్రహణ శాంతి జపయజ్ఞం నిర్వహించింది.
- సూర్యగ్రహణ సమయం ఉదయం 10:18 గంటల నుంచి మధ్యాహ్నం 1:35 గంటల వరకు ఈ యజ్ఞం నిర్ప్రవహించారు.
- పంచ శాంతి, సృష్టిలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఈ జపయజ్నం నిర్వహించారు.
- ఇందులో శ్రీవారి అర్చకులు, జీయంగార్లు, శ్రీవారి సేవకులు ప్రముఖ వేద పారాయణదారులు పాల్గొని జపహోమ అభిషేకాలను నిర్వహించారు.
- 21 Jun 2020 8:28 AM GMT
సూర్యగ్రహణం ముగిసింది
- ముగిసిన సూర్యగ్రహణం
- ఆకాశంలో ఆవిస్క్రుతమైన అద్భుత దృశ్యాలు
- ఆసక్తితో వీక్షించిన ప్రజలు
- 21 Jun 2020 6:58 AM GMT
»» తాడేపల్లి:
- ఉండవల్లి గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు.
- అడ్డుకున్న రెవెన్యూ అధికారులు..
- అధికారులతో వాగ్వాదానికి దిగిన మట్టి తవ్వకం దారులు
- గుంటూరు ఛానెల్ పక్కన ఉన్నటువంటి నల్లమట్టిని జేసిబి ద్వారా తవ్వి సొంత ప్రయోజనాలు కోసం వాడుకుంటున్న కొంత మంది వ్యక్తులు...
- అధికారులు అడ్డుకోవడంతో తవ్వకాలు నిలిపివేత..
- 21 Jun 2020 3:37 AM GMT
పెన్నా నది ఒడ్డున నాగేశ్వరుని గుడి దర్శనాలు నిషేధం
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్ళపాడు గ్రామం వద్ద ఇసుక లో కూరుకుపోయి బయటకు తీసిన నాగేశ్వర స్వామి శివాలయం ను ప్రజల సందర్శన తాకిడి ఎక్కువ కావడంతో దేవాలయం కు వెళ్లేందుకు నిషేధిస్తూ ఆలయానికి వెళ్లేందుకు ఉన్న ప్రధాన రహదారిని ముళ్ళకంప తో మూసేసిన అధికారులు.. పెన్నా బ్రిడ్జి దాటిన వెంటనే ప్రత్యేక పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి ఎవరిని ఆ ఆలయ పరిసర ప్రాంతాలకు వెళ్లి వచ్చేందుకు నిరాకరిస్తూ వచ్చే భక్తులను నిలుపుదల చేస్తున్న పోలీసులు...
*ఆలయ స్థలాలను క్షుణ్నంగా పరిశీలించి గుడిని పూర్తిస్థాయిలో ప్రత్యేక పద్ధతిలో బయటికి తీసే వరకు ఎవరిని ఆలయ పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా దేవాలయం వద్ద కూడా ముళ్ల కంచెను ఏర్పాటు చేసిన గ్రామస్థులు..
- 21 Jun 2020 3:26 AM GMT
ఏపీలో బలంగా ఋతుపవనాలు
- ఉత్తర ఒడిసా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
- రాజస్థాన్ నుంచి మధ్య భారతం, ఉత్తర ఒడిసాలోని ఆవర్తనం మీదుగా బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది.
- వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉంది.
- దీంతో రానున్న రెండు రోజులపాటు కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
- శనివారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.
- 21 Jun 2020 3:18 AM GMT
కొద్దిసేపట్లో సూర్యగ్రహణం
ఆకాశవీధిలో అద్భుతం జరగబోతోంది. అరుదైన వార్షిక సూర్యగ్రహణం కొద్ది సేపట్లో ఆవిష్కృతం కాబోతోంది. సూర్య గ్రహణం అనగానే రాహువు..కేతువు అంటూ పెద్దలు చెప్పే కబుర్లు గుర్తొస్తాయి. అయితే, ఖగోళ శాస్త్రజ్ఞులకు మాత్రం గ్రహణం అనగానే ఎన్నో విషయాలపై వారు చేసే ప్రయోగాలకు ప్రత్యేకరోజుగా ఉంటుంది. ఈసారి వస్తున్న ఈ సూర్య గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది.
- 21 Jun 2020 1:48 AM GMT
నాన్నకు వందనం!
అమ్మ ఊపిరి పోస్తే.. నాన్న జీవితపు ఉషస్సులను చూపిస్తాడు..
అమ్మ గోరుముద్దలతో కడుపు నింపితే.. నాన్న తర్జనితో ప్రపంచపు జీవనచిత్రాన్ని చూపిస్తాడు..
అమ్మ కడుపున దాచుకుని మోస్తే..నాన్న భుజాలపైకి ఎక్కించుకుని జీవితపు ఎత్తు పల్లాలను కళ్ళ ముందుంచుతాడు!
నాన్నంటే ఓదార్పు.. నాన్నంటే గుప్పెడంత గుండెలో దాగిన అనంతమైన ప్రేమామృతం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే వెన్నంటి ఉండే ధైర్యం అన్నీ ఎందుకు నాన్నంటే నాన్న అంతే!
ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు!
ఫాదర్స్ డే ప్రత్యెక కథనం నాన్నకు వందనం!
- 21 Jun 2020 1:46 AM GMT
మన్యం ప్రాంతానికి పాకిన కరోనా
- చింతపల్లి గ్రామంలో కరోనా కలకలం రేగింది.
- గ్రామంలో పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుప్పుమనడంతో గ్రామంలో ప్రజలతోపాటు మన్యవాసులలో ఆందోళన మొదలైంది.
- కరోనా కలకలంతో అప్రమత్తమైన అధికారులు లక్షణాలు కలిగిన వ్యక్తిని హుటాహుటిన కరోనా వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నం తరలించారు.
- అనంతరం కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ముగ్గురిని ఐసోలేషన్ కు తరలించారు.
- స్థానికంగా దుకాణ సముదాయాలను అధికారులు వెంటనే మూయించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire