Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు శుక్రవారం, 19 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, త్రయోదశి ( ఉ.11:00 వరకు), కృత్తిక నక్షత్రం (ఉ.10:31వరకు) సూర్యోదయం 5:42 am,సూర్యాస్తమయం 6:52 pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 Jun 2020 4:39 PM GMT
»» అమరావతి.
- రేపే వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం రెండో ఏడాది ఆర్ధిక సాయం విడుదల
- కరోనా, లాక్‌డౌన్ నేపధ్యంలో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నేతన్నల కుటుంబాలను ఆదుకునేందుకు 6 నెలలు ముందుగానే ఆర్ధిక సాయం
- క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైయస్.జగన్
- సొంత మగ్గమున్న నేతన్నల కుటుంబాలకు ఏడాదికి రూ.24వేలు చొప్పున ఆర్ధిక సాయం.
- మొత్తం 81,024 మంది లబ్ధిదార్లకు రూ.194.46 కోట్ల అర్ధిక సాయం అందజేయనున్న ప్రభుత్వం
- చేనేత సహకార సంఘాలకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.103 కోట్లు చెల్లించేందుకు ఆప్కోకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
- కరోనా వైరస్ నివారణకై మాస్కుల తయారీకై ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాల నుంచి సేకరించిన వస్త్రాలకు రూ.109 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.
- 19 Jun 2020 4:38 PM GMT
బ్రేకింగ్:
» ఉమ్మడి మెదక్ జిల్లాలో గత రెండురోజులుగా నలుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు..
- పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్న విద్యార్థులు
- నిన్న తూప్రాన్ ఒకరు, గజ్వెల్ లో మరో ఇంటర్ ఇంటర్ విద్యార్తి ఆత్మహత్య
- ఈరోజు గజ్వెల్ పట్టణానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం లో మార్కులు తక్కువ వచ్చాయని ఆగుళ్ల శ్రావణి అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య..
- ఇంటర్ లో ఫెయిల్ అయ్యానని మనస్థాపం తో గజ్వెల్ పట్టణానికి చెందిన మరో విద్యార్థి మహంకాళి బద్రీనాథ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణం
- 19 Jun 2020 4:36 PM GMT
» అమరావతి.
- వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, కృతజ్ఞతలు తెలిపిన మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్.
- హాజరైన ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.
- 19 Jun 2020 4:36 PM GMT
- కాంగ్రెస్ డిమాండ్ మేరకు కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన కేసీఆర్ కి కృతజ్ఞతలు - ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- చైనా దాడిలో వీర మరణం పొందిన సైనికుడు కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుని కుటుంబంలో ఒకరి గ్రూప్1 ఉద్యోగం ఇవ్వాలన్న తమ డిమైండ్ కు స్పందించి 5 కోట్ల ఆర్థిక సహాయం గ్రూప్1 ఉద్యోగం ఇస్తామని ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు....
- 19 Jun 2020 4:35 PM GMT
-» జాతీయ అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
- 20 మంది వీర సైనికుల మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తంచేస్తున్నా
- వారి త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నా
- వారి కుటుంబాలకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది
- అణ్వాయుధాలున్న ఈ రోజుల్లో సంప్రదాయ యుద్ధం కాకుండా దౌత్యం, వ్యాపార, ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ద్వారా వివిధరకాలుగా యుద్ధంచేయొచ్చు:
- భారత్‌ను ఆర్థికంగా, దౌత్యపరంగా శక్తివంతమైన దేశంగా మార్చడానికి 2014 నుంచి ప్రధాని మోదీ కృషిచేస్తున్నారు
- ప్రధాని విజయవంతమైన విదేశీ విధానాల ద్వారా 3 రకాల ఇంటర్నేషనల్ కంట్రోల్ రిజైమ్స్‌లో భారత్ చోటు సాధించింది
- మిసైల్స్, ఆర్మ్స్ అండ్ బయోవెపన్స్, వెసెనర్ అగ్రిమెంట్, ఆస్ట్రేలియా గ్రూపులో భారత్ చోటు సాధించింది
- 192 సభ్యదేశాలున్న ఐక్య రాజ్యసమితిలో భారత్ 184 మంది సభ్యుల మద్దతుతో భద్రతామండలిలో సభ్యదేశంగా ఎంపికైంది
- గ్లోబల్ స్టేట్స్‌మన్‌గా ప్రధాని సాధించిన విజయాలు ఒకవైపు అయితే మరోవైపు పరోక్షంగా భారత్‌ను అస్థిరపరచాలని మరోవైపు ప్రయత్నాలు చేస్తున్నారు.
- ప్రధాని మోదీ నేతృత్వంలో పుల్వామా, డోక్లాం అంశాల విషయాల్లో అలాగే మసూద్ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తింపచేయడంలో విజయాలు సాధించాం
- కులభూషన్ జాదవ్ కేసులో 15–1 ఓట్ల తేడాతో అంతర్జాతీయ కోర్టులో విజయం సాధించాం
- ఈ పరీక్ష సమయంలో వైయస్సార్‌సీపీ అధ్యక్షుడిగానే కాదు, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ వెనుక ఉన్నాం,
- మా రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలుకూడా మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నాం
- గాల్వాన్ సంక్షోభంలో ఈ దేశాన్ని మీరు సరైన మార్గంలో విజయవంతంగా నడిపిస్తారని నమ్ముతున్నాం
- ఈ సంక్షోభం సమయంలో ఏ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నా దానికి మేం కట్టుబడి ఉంటాం
- 19 Jun 2020 4:32 PM GMT
» తెలంగాణ లో ప్రస్తుతం 34 కోవిడ్ హాస్పిటల్ లు...
- ప్రస్తుతం కోవిడ్ హాస్పిటల్ లలో మొత్తం 17.081 కోవిడ్ బెడ్లు...
- ఇప్పటికే 976 బెడ్ల లో నిండిపోయాయి...
- కోవిడ్ హాస్పిటల్ ఐసోలేషన్ బెడ్స్ 10,979..
- ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న బెడ్స్ 3227...
- రాష్ట్రంలో ప్రస్తుతం 1448 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి...
- వెంటిలేటర్ బెడ్స్ 460...
- 19 Jun 2020 4:19 PM GMT
అమరావతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్. హాజరైన ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.
- 19 Jun 2020 12:07 PM GMT
» విజయవాడ
- ఏపీ టూరిజం బోట్ కంట్రోల్ రూమ్ లను ప్రారంభించిన సీఎం జగన్...
- రాష్ట్రం వ్యాప్తంగా 9 కంట్రోల్ రూములు
- ఐదు డిపార్టుమెంట్ల పర్యవేక్షణలో నడవనున్న కంట్రోల్ రూములు
- ఎమ్మార్వో లేదా డెప్యూటీ ఎమ్మార్వో కంట్రోల్ రూముకు మేనేజర్..
- రెవెన్యూ, ఇరిగేషన్, టూరిజం, పోలీస్, ఎస్ డీ ఆర్ ఎఫ్ ల పర్యవేక్షణలో కంట్రోల్ రూములు...
- 19 Jun 2020 12:06 PM GMT
♦♦ అమరావతి ♦♦
- ఫేక్ ట్వీట్ల పై చంద్రబాబు అసహనం
- తనకు ప్రధాని ఫోన్ చేసినట్లు చంద్రబాబు పేరుతో ఫేక్ ట్వీట్.
- ఇండియా - చైనా వివాదం పై చంద్రబాబును సలహాలు అడిగారని ఫేక్ ట్వీట్.
- తాను చెయ్యని ట్వీట్ లను మార్ఫింగ్ లతో తనకు ఆపాదించడం పై చంద్రబాబు ఆగ్రహం.
- క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్లే ఇలా ఫేక్ ట్వీట్ లతో దుష్ప్రచారం చేస్తారని చంద్రబాబు ట్వీట్.
- 19 Jun 2020 12:01 PM GMT
» తూర్పు గోదావరిజిల్లా
- రాజానగరం నియోజకవర్గ పరిధిలోని సీతానగరం మండలంలో గల చిన్నకోండేపూడి గ్రామంలో 15 రోజుల వయస్సు గల పాప అపహరణకు గురైంది.
- దీనిపై సి ఐ పవన్ కుమార్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు..
- మునుపెన్నడూ లేనివిధంగా ఇలా జరగడం పై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire