Live Updates:ఈరోజు (జూన్-14) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు ఆదివారం, 14 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, నవమి ( తె.03:10 వరకు), ఉత్తరాభాద్ర నక్షత్రం (రాత్రి 12.48 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:51 pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 14 Jun 2020 2:12 PM GMT
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
-అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
-ముందుగా కర్ణాటకకు బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం.
-జూన్ 17 నుండి వివిధ ప్రాంతాలకు బస్సులు నడపనున్నారు.
-కర్ణాటకకు 168 బస్సులు.
-నాలుగు దశలలో బస్సుల సంఖ్య పెంచనున్న ప్రభుత్వం.
- 14 Jun 2020 2:03 PM GMT
కృష్ణా: వత్సవాయి మండలం
-కంభంపాడు గ్రామ
-చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ నుండి ఆంధ్రా కు అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తుల నుంచి 450 మద్యం బాటిల్ లను స్వాధీనం
-చేసుకొని అరెస్ట్ చేసిన పోలీసులు
- 14 Jun 2020 7:24 AM GMT
- మొగల్ రాజపురం మాలక్ష్మీ కాంప్లెక్స్ లో పని చేసే 12మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్దారణ
- భవనంలో పని చేసే సిబ్బంది, హౌస్ కీపింగ్ ఉద్యోగులకు కోవిడ్
- కాంప్లెక్స్ లో మారుతి కార్ షో రూమ్ తో పాటు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, యూనియన్ బ్యాంక్ ఇతర వాణిజ్య సంస్థల కార్యకలాపాలు
- భవనం మొత్తాన్ని మూసివేయాలని ఆదేశించిన పోలీసులు
- 14 Jun 2020 3:50 AM GMT
నైరుతి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం..
- 14 Jun 2020 3:50 AM GMT
ఈ నెల 16న కలెక్టర్లతో కేసీఆర్ భేటీ.
👉►వానాకాలం సాగు ఏర్పాట్లతో పాటు గ్రామీణ ఉపాధి హామి పథకం, హరితహారం అమలుపై సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు.
- 14 Jun 2020 3:49 AM GMT
నేడు తెరచుకోనున్న శబరి ఆలయం..
►నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తెరవనున్న అధికారులు..
►భక్తులకు అనుమతి లేదంటూ ఉత్తర్వులు జారీ చేసిన కేరళ ప్రభుత్వం..
- 14 Jun 2020 3:46 AM GMT
- ఆంద్ర తెలంగాణ సరిహద్దుల్లో అక్రమంగా రవాణా జరుగుతున్న 502మద్యం బాటిల్స్ పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు.
- 6గురు వ్యక్తులను అరెస్ట్.
- 4ద్విచక్రవాహనాలు సీజ్ .
- మొత్తం 92వేల రూపాయల విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మీడియా కి తెలిసిన ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ పెద్దిరాజు తెలిపారు.
- 14 Jun 2020 1:59 AM GMT
- శ్రీకాళహస్తిలో దర్శనాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పారు ఆలయ అధికారులు.
- సోమవారం నుంచి శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
- తొలిరోజు ఆలయ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు మాత్రమే దర్శనం ఉంటుందని, ఆ మరుసటి రోజు స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు.
- బుధవారం నుంచి సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -మరిన్ని వివరాలు
- 14 Jun 2020 1:54 AM GMT
తెలంగాణా ఎమ్మెల్యే భార్య సహా మరో ముగ్గురికి కరోనా
- టీఆరెఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇప్పటికే కరోనా బారిన పడగా… ఆయనతో కాంటాక్ట్ అయిన వారికి టెస్ట్ చేస్తే మరో నలుగురికి సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
- ఎమ్మెల్యే సతీమణితో పాటు వంట మనిషి, డ్రైవర్, గన్ మెన్ కు కూడా కరోనా వైరస్ సోకినట్లు తేలింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire