Live Updates:ఈరోజు (జూన్-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు శనివారం, 13 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, అష్టమి (రాత్రి 11:58 వరకు), పూర్వాభాద్ర నక్షత్రం (రాత్రి 09.27 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:51 pm

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 13 Jun 2020 4:29 AM GMT

    నలుగురు ఐఎ‌ఫ్‌ఎస్‌ అధికారులకు పోస్టింగులు

    ఏపీ బయోడైవర్సిటీ బోర్డు మెంబర్‌ సెక్రటరీగా డి.నళినీమోహన్‌, ఏపీ ఫారెస్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ వైస్‌చైర్మన్‌/ఎండీగా బినోద్‌ కుమార్‌ సింగ్‌, ఏపీ ఫారెస్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా ఎం.రేవతి, ఏపీ ఫారెస్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ రాజమండ్రి రీజనల్‌ మేనేజర్‌గా టి.జ్యోతిలకు పోస్టింగులు ఇచ్చిన ప్రభుత్వం

  • 13 Jun 2020 3:41 AM GMT

    - ఏ.పి.లో 17మంది.ఐ..పి.ఎస్.ల బదిలీకి రంగం సిద్ధం

    - ఈరోజు ఉత్తర్వులు వెలువరించనున్న ప్రభుత్వం

    - విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారాకతిరులమలరావుతో సహా పలువురు సీనియర్లకు స్థానచాలనం

    - విజయవాడ సి.పి.గా బి.శ్రీనివాసులు నియామకం చేయనున్న ప్రభుత్వం

  • 13 Jun 2020 3:11 AM GMT

    - సదర్మట్ బ్యారేజీపై చేపట్టే గోదావరి జలదీక్ష నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అరెస్ట్.

    - నిర్మల్ లో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని గృహ నిర్భంధించిన పోలీసులు, నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.

    - నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో కాంగ్రెస్ నాయకుల అరెస్ట్...

    - మమడ మండల్ పోనుకల్ సదర్మాట్ బ్యారేజ్ దగ్గర జలదీక్ష కొరకు పోతున్న కాంగ్రెస్ నాయకులను ఖానాపూర్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్....

  • 13 Jun 2020 1:59 AM GMT

    జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్!

    - మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.

    - ఆయనతోపాటు కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    - శనివారం ఉదయం హైదరాబాద్‌లోని వీరి నివాసంలో అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. - పూర్తి వివరాలు 




  • 13 Jun 2020 1:32 AM GMT

    అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్‌

    - ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టయిన టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడికి విజయవాడ అనిశా కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు.

    - అనారోగ్యం దృష్ట్యా ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని ఆదేశించారు.

    - తొలుత అనిశా అధికారులు విజయవాడ సబ్‌ జైలుకు ఆయన్ను తరలించనున్నారు.

    - జైలు అధికారుల అనుమతి అనంతరం ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టనున్నారు. 



Print Article
More On
Next Story
More Stories