Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు శుక్రవారం, 12 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సప్తమి (రాత్రి 10:51 వరకు), శతభిష నక్షత్రం (మధ్యాహ్నం 06.48 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:50 pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 12 Jun 2020 6:07 AM GMT
అచ్చెన్నాయుడి అరెస్డ్ పై యనమల కామెంట్స్..
కేసులు,అరెస్ట్ లతో ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు..
జగన్ పోలీసు వ్యవస్థ ను ఉపయోగించి టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు..
ఇది ప్రభుత్వం కుక్ అప్ చేసిన కేసు..
అనారోగ్యం తో ఉన్న అచ్చెన్నాయుడు కు మందులు కూడా ఇవ్వనీయకుండా ఏసిబి అధికారులు చేయడం దారుణం..
ఏసిబి అధికారులు చాలా ఇన్ హ్యుమన్ గా బిహేవ్ చేసారు.
అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము..
రాజ్యాంగ వ్యవస్థ పై జగన్ కు గౌరవం లేదు..
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది.
దళిత డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వం వ్యవహరించిన తీరు దీనికి నిదర్శనం..
బిసి,ఎస్సీ,ఎస్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు..
అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చేసినంత మాత్రాన భయపడేది లేదు..
గత ప్రభుత్వం లో ఎక్కడా అవినీతి జరగలేదు..
జగన్ అధికారం లోకి వచ్చిన ఏడాది కాలంలో ఎన్నో మాఫియాలు తయారయ్యాయి..
ఇసుక, మట్టి, మద్యం మాఫియా లు తయారయ్యాయి..
- 12 Jun 2020 6:06 AM GMT
అచ్చెంన్నాయుడు అరెస్టు పై ప్రెస్ మీట్ కి వెళ్తున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, మాజీ ఏమ్మేల్యే పల్లా శ్రీనివాస్ లు అరెస్ట్
- 12 Jun 2020 6:06 AM GMT
విశాఖ
ఏసీబీ జేడీ రవికుమార్ కామెంట్స్...
ఈఎస్సై స్కాంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ముగ్గురి అరెస్ట్
అచ్చెన్నాయుడు, డాక్టర్ రమేష్ కుమార్, డాక్టర్ విజయ్ కుమార్ అరెస్ట్
ఈ సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్ట్ లో ప్రవేశపెడతాం
ఈ కేసులో డాక్టర్ జనార్ధన్, రమేష్ బాబు, చక్రవర్తిని అరెస్ట్ చేస్తాం
అచ్చెన్నాయుడు అరెస్ట్ లో అన్ని నిబంధనలు ఫాలో అయ్యాం
మందులు, వైద్య పరికరాల కొనుగోలులో 150 కోట్లకు పైగా అవినీతి గుర్యించాం
ఇప్పటివరకు 19 మంది ప్రనేయం ఉన్నట్యు గుర్యిణ్చాం
- 12 Jun 2020 5:30 AM GMT
అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారు: చంద్రబాబు
టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్టుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు భగ్గుమన్నారు. ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. అచ్చెన్న అరెస్ట్ నేపథ్యంలో పార్టీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం చేస్తున్న మోసాలపై నిరంతరం పోరాడుతున్న అచ్చెన్నాయుడిపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. దాదాపు 100 మంది పోలీసులు అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేశారని ఆరోపించారు. కనీసం మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదని, వారి కుటుంబ సభ్యులు ఫోన్‌లో కాంటాక్ట్ చేసినా ఫోన్ అందుబాటులో లేకుండా చేశారని తెలిపారు. జగన్ ఉన్మాదం, పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- 12 Jun 2020 5:29 AM GMT
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కామెంట్స్ ...
ఎస్ఇసి కేసులో అత్యున్నత న్యాయ స్థానం ఎన్నడూ చేయని వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం పై చేసింది.
సిగ్గు ఉంటే రాజీనామా చేయాలి.
హై కోర్టు జడ్జిమెంట్ పై స్టే కోసం సుప్రీంకోర్టు లో పిల్ వేస్తే నిరాకరించింది.
ప్రజల ఆలోచనలను ప్రక్క దారి పట్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ లో 14 వందల కోట్ల రూపాయల పైన అవినీతి జరిగింది.
ఆరున్నర లక్షల కోట్ల అవినీతి జరిగిందని చార్జిషీట్ వేయడం సిగ్గు చేటు.
ప్రభుత్వం తోక మీద ఈక పట్టుకుని ఈదుతుంది.
ఎమ్ చేసినా చంద్రబాబు ను ఏమి చేయలేరు.
పార్టీకి,బిసిలకు అచ్చెన్నాయుడు వెన్ను దన్నుగా ఉన్నా నాయకుడు.
ప్రభుత్వం చేసే తప్పుడు పనులకు అచ్చెన్నాయుడు అరెస్ట్ పరాకాష్ట.
కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇఎస్ఐ కొనుగోళ్లు జరిగాయి.
సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవాలి కాని ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయడం సిగ్గుచేటు.
కరోనా లేకుంటే దీని పై రాష్ట్రం రావణ కాష్ణంలా మారేది.
నోటీసులు ఇవ్వాలి కాని అరెస్ట్ చేయడం దారుణం.
ప్రజా స్వామ్యవాదులు అచ్చెన్నాయుడు అరెస్ట్ ను ఖండించాలి.
- 12 Jun 2020 5:28 AM GMT
బిజెపి అధ్యక్షుడు కన్నా కామెంట్స్.
ఈ రాష్ట్ర విభజన రాష్ట్రానికి శాపం.
చంటి బిడ్డలా కాపాడాల్సిన ప్రాంతీయ పార్టీలు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాయి.
ప్రజల సంపదను, ఆస్థులను విచ్చలవిడిగా కొల్లగొడుతున్నారు.
దోచుకోవడానికి హక్కు ఇచ్చినట్లు భావిస్తున్నారు.
ప్రజలను మోసం చేసి జగన్ అధికారంలోకి వచ్చారు.
ప్రజల చెమటను, రక్తాన్ని జగన్ పిండుతున్నారు.
సిఎం అసమర్థతకు ఇసుక విధానమే నిదర్శనం.....
గత ప్రభుత్వ పాలనలో అవినీతి జరిగింది.
అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని గత ఎన్నికలకు ముందు హామి ఇచ్చారు.
ఎవరూ అవినీతికి పాల్పడిన చర్యలు తీసుకోవాలి.
ఇసుక మాఫియాకి పాల్పడిన వారిని కూడా జైలుకి పంపినప్పుడే సిఎం కిచిత్తశుద్దిన్నట్లుగా బావిస్తాం.
ఏడాది పాలనలో అవినీతికి పాల్పడిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలి.
- 12 Jun 2020 5:28 AM GMT
ప్రకాశం జిల్లా...
వైకాపా పాలన కక్షపురిత పాలన మాదిరిగా ఉంది నిమ్మగడ్డ రమేష్ పై అదే తరహా దాడులు..
టీడీపీ నేత అచ్చంనాయుడు అరెస్ట్ కుడా రాజకీయమే
జనసేన తో తప్ప మరొకరితో పొత్తులు లేవు వుండబోవు.
రాష్ట్రంలో యడాది పాలన పూర్తి అయ్యింది సంబరాలు చెడుకుంటున్న వైసీపీ 45 లక్షల భావన నిర్మాణ కార్మికులు ను రోడ్డు కు ఈడ్చేరు.
బీజేపీ జాతీయ మహిళ నాయకురాలు మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కామెంట్స్
- 12 Jun 2020 3:19 AM GMT
గాంధీ హాస్పిటల్ సమ్మె విరమించి విధులకు హాజరైన జూడాలు.
గాంధీ ఆసుపత్రి లో జూనియర్ డాక్టర్స్ సమ్మె విరమించారు.
తక్షణమే విధుల్లో చేరుతున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు.
రోగి బంధువులు వైద్యుడిపై దాడికి పాల్పడటంతో మంగళవారం రాత్రి నుంచి జూడాలు విధులను బహిష్కరించారు.
జూడాలతో రెండుసార్లు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ చర్చలు జరిపారు.
తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం తో విధులకు హాజరవుతున్నామని జూడాలు ప్రకటించారు.
- 12 Jun 2020 3:07 AM GMT
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.
రాష్ట్రంలో ఫోటోగ్రఫీ వృత్తిగా చేసుకుంటున్న ఫోటో/వీడియోగ్రాఫర్ లకు తక్షణమే రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టండి.
కరోనా విపత్కర కాలంలో పనులు లేక గత 3 నెలలుగా ఫోటో/వీడియోగ్రాఫర్లు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
లాక్ డౌన్ వల్ల ఉపాధి కరువై ఫోటో/వీడియోగ్రాఫర్ల కుటుంబాలు అగమ్యగోచరంలో ఉన్నాయి.
ఛాయా చిత్రకారులను ఆదుకునేందుకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి తగిన నిధులు కేటాయించవలసిందిగా కోరుతున్నాను.
- 12 Jun 2020 3:06 AM GMT
తూర్పుగోదావరి: నేడు జిల్లాలో పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ పర్యటన. కాకినాడ ఏటిమొగలో మత్స్యశాఖ సంయుక్త సంచాలక భవన నిర్మాణానికి శంకుస్థాపన. అనంతరం అధికారులతో సమీక్ష. పెద్దాపురం నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి మోపిదేవి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire