Live Updates:ఈరోజు (జూన్-04) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు గురువారం, 04 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, త్రయోదశి (ఉదయం 06:05 వరకు), తదుపరి చతుర్దశి సూర్యోదయం 5:40 am, సూర్యాస్తమయం 6:48 pm

ఈరోజు తాజావార్తలు

Show Full Article

Live Updates

  • 4 Jun 2020 3:23 AM GMT

    విజయవాడలో వివాహిత ఆత్మహత్య

    - విజయవాడ మునిసిపల్ ఆఫీస్ దగ్గర బందరు కాలువలో ఒక వివాహిత ఆత్మహత్య

    - మృతురాలు నాగస్వరూప రాణి(30) పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మార్తా గ్రామంగా గుర్తింపు

    - మృతురాలు తన ఇద్దరు పిల్లలతో కావాలనే ఆత్మహత్య చేసుకోవటానికి వచ్చిందని చెబుతున్న పిల్లలు

    - వివాహిత పిల్లలు ఊపిరాడక ఒడ్డుకు వచ్చారని తన తల్లి మాత్రం రాలేదని రోదిస్తున్న పిల్లలు

    - ఈ మేరకు కేసును నమోదు చేసుకుని మృతురాలి కుటుంభ సభ్యులకు సమాచారం చేరవేత



  • 4 Jun 2020 2:45 AM GMT

    - హైదరాబాద్‌ లో ఈరోజు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ..

    - కృష్ణా నదీ జల వివాదాలపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల కార్యదర్శులు, ఇంజనీర్లు.

  • 4 Jun 2020 2:43 AM GMT

    - విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై ఈరోజు హైపవర్‌ కమిటీ విచారణ..

    - సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ఛైర్మన్‌గా పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి కరీకల్‌వలవన్..

    - జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌, సీపీ ఆర్కేమీనా సభ్యులుగా హైపవర్ కమిటీ..

    - ఇప్పటికే ప్రమాదంపై హైపవర్‌ కమిటీకి నివేదికలు అందించిన 5 కమిటీలు..

    - కేంద్రం నియమించిన  కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించనున్న హైపవర్ కమిటీ..

    - గ్యాస్‌ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు..

    - స్టైరిన్ ప్రభావంపై అధ్యయనం చేస్తున్న వైద్య నిపుణులు..



  • 4 Jun 2020 1:27 AM GMT

    - తెలంగాణా లో కొనసాగుతున్న కొవిడ్‌ ఉద్ధృతి.

    - బుధవారం 129 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    - రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,020కి పెరిగింది.

    - నిన్న నమోదైన కేసుల్లో తెలంగాణవాసుల్లో 127 పాజిటివ్‌ కాగా, వలసకార్మికుల్లో 2 కేసులు ఉన్నాయి.

    - తెలంగాణాలో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలోనే 108 ఉన్నాయి.



  • 4 Jun 2020 1:12 AM GMT

    ఈరోజు వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభం 10,000 రూ ఆర్ధిక సాయం నేటి నుంచి బ్యాంకు అకౌంట్ లో కి జమ చేయనున్న ఏపీ ప్రభుత్వం.



Print Article
More On
Next Story
More Stories