Live Updates:ఈరోజు (జూన్-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు బుధవారం, 03 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ద్వాదశి (ఉదయం 09:04 వరకు), తదుపరి త్రయోదశి.సూర్యోదయం 5:42am, సూర్యాస్తమయం 6:47 pm
ఈరోజు తాజావార్తలు
Live Updates
- 3 Jun 2020 5:09 PM GMT
మరి కొద్ది సేపట్లో ముంబైలో ల్యాండ్ కానున్న విజయ్‌మాల్యా..
-నేరుగా ఆర్ధర్ రోడ్ జైలుకు తరలించే అవకాశం..
-బ్యాంకులకు కోట్లాదిరూపాయల రుణాల బకాయి ఉన్నారని విజయ్ మాల్య మీద ఆరోపణలు.
-ఇటీవల లండన్ కోర్టు భారత్ కు మాల్యాను అప్పచేప్పాలని తీర్పు ఇచ్చింది.
- 3 Jun 2020 4:33 PM GMT
తిరువూరులో భారీగంజాయి పట్టివేత
-సీలేరు నుండి విజయవాడ అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ ముగ్గురు నిందితులు
-పోలీసులు లకు వచ్చిన సమాచారం మేరకు తిరువూరు పట్టణ శివారు తోకపల్లి దగ్గర తనిఖీ నిర్వహిస్తుండగా పట్టుబడ్డ నిందితులు
-వారి వద్ద నుండి10.7 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు..
-పట్టుబడిన ముగ్గురు యువకుల్లో ఒకడు విజయవాడలో ఇంజనీరింగ్ అభ్యసిస్తున్నాడు..
-మిగతా ఇద్దరు ఒకరు ఐటీఐ, మరొక్కరు బీటెక్ చదువును మధ్యలో మానేశారు..
-మీడియాకు వివరాలు వెల్లడించిన నూజివీడు డిఎస్పీ- బి.శ్రీనివాసులు..
-నిందితులను రిమాండ్ తరలిస్తున్నట్లు పేర్కొన్న-డీఎస్పీ..
-ఇన్ఛార్జ్ సీఐ పి.శ్రీను,ఎస్సై ఎం. సుబ్రహ్మణ్యం, సిబ్బందిని అభినందించిన-డిఎస్పీ బి.శ్రీనివాసులు.
- 3 Jun 2020 11:52 AM GMT
బందరు డివిజన్ దేవాదాయ శాఖ అధికారులతో రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సమీక్ష.
పాల్గొన్న ఆలయ EO అధికారులు, ఆలయ సిబ్బంది.
ఆలయాల్లో పనితీరు, ఉత్సవాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చలు
- 3 Jun 2020 11:38 AM GMT
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు జగన్ గ్రీన్‌సిగ్నల్
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్
బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని ఆదేశించిన సీఎం
టెన్త్ పరీక్షల తర్వాత బదిలీలు చేపట్టాలని సూచించిన సీఎం
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని, గిరిజన ప్రాంతాల్లో కూడా టీచర్ల కొరత లేకుండా చూడాలని చెప్పిన జగన్
క్యాంపు ఆఫీసులో నాడు–నేడుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్
స్కూళ్లలో ఏర్పాటు చేయనున్న సదుపాయాలను పరిశీలించిన సీఎం
- 3 Jun 2020 11:35 AM GMT
నాడు–నేడు ఎడ్యుకేషన్ పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
నాడు–నేడులో భాగంగా స్కూళ్లలో ఏర్పాటు చేయనున్న సదుపాయాలను పరిశీలించిన సీఎం.
పాల్గొన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు.
- 3 Jun 2020 11:34 AM GMT
ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవికాలం మరో 3 నెలలు పొడిగింపు - ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించిన కేంద్రం
- 3 Jun 2020 10:11 AM GMT
మరో 8 పాఠశాలలకు అవకాశం ఇవ్వండి: ఎమ్మెల్యే
అనకాపల్లి: జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా అనకాపల్లి పట్టణ పరిధిలోని 26 ప్రాథమిక పాఠశాలల్లో… ప్రస్తుతం 8 స్కూళ్లలో నాడు నేడు కార్యక్రమం జరుగుతుందని… మరో ఎనిమిది పాఠశాలలకు ఈ కార్యక్రమం వర్తింపచేయాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మంత్రి బొత్సను కోరారు. అనకాపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ మూర్తి, వైకాపా నాయకులు మందపాటి జానకి రామరాజు, పలకా రవి, జాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
- 3 Jun 2020 10:09 AM GMT
నగదు కావాలంటే... నడక సాగాల్సిందే
విశాఖపట్నం: మౌలిక సదుపాయలు, రవాణా సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడే విశాఖ గిరిజనులకు కొత్తగా ఓ సమస్య వచ్చి పడింది. కరోనా సాయం, పింఛను, ఉపాధి హామీ పనులు... ఇలా ప్రతి పథకానికి సంబంధించిన నగదును నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయటం వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఖాతాల్లో పడిన నగదు విత్‌డ్రా చేసుకోవటానికి స్థానికంగా ఏటీఎమ్‌లు ఉండట్లేదు. ఆధార్ అనుసంధానంతో పనిచేసే పేటీఎం, ఎయిర్‌టెల్ బ్యాంకు వంటి సేవలను కొంతమంది యువత స్థానికంగా అందిస్తున్నప్పటికీ... కమిషన్ రూపంలో కొంత సొమ్మును పోగొట్టుకోవాల్సి వస్తోంది. కమిషన్ పోయినా నగదు అంత సులభంగా చేతికి రాక ఇబ్బందులు పడుతున్నారు.
మారుమూల ప్రాంతమైన డుంబ్రిగుండ మండలం కిరిడివలసకు చెందిన చిన్నమ్మి అనే వృద్ధురాలు అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. ఆమె ఖాతాలో ఇటీవల జమ అయిన ఉపాధి హామీ కూలీ డబ్బులు తీసుకుందామంటే బయోమెట్రిక్ తప్పనిసరిగా వేయాలి. అత్యవసర సమయాల్లో మొబైల్ సిగ్నల్ కోసం ఎత్తుగా ఉన్న ప్రాంతాలకు స్థానికులు పరుగులు పెట్టినట్లుగా ఆమె వెళ్లలేక సాయం కోసం ఎదురుచూశారు. చివరికి కుటుంబసభ్యులే 5 కిలోమీటర్ల దూరంలోని కొండ ప్రాంతానికి డోలీలో ఆమెను మోసుకుపోయారు. అక్కడ సిగ్నల్ వచ్చాక బయోమెట్రిక్ వేసి ప్రైవేటు బ్యాంకు సర్వీసు అందిస్తున్న యువత నుంచి నగదు తీసుకున్నారు. మారుమూల గ్రామాల్లోనే ఈ పరిస్థితి ఉందని గిరిజనులు వాపోయారు. మండల కేంద్రాల్లోని ఏటీఎమ్‌ల నుంచి యువత పెద్దసంఖ్యలో నగదు విత్‌డ్రా చేసి.. మారుమూల గ్రామస్థులకు ఇస్తున్నారు. అవి అయిపోతే నడుచుకుంటూ మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే మారుమూల గ్రామాల్లో నగదు పంపిణీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారమవుతుందని స్థానికులు కోరుతున్నారు.
- 3 Jun 2020 10:07 AM GMT
డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని గ్రామస్తుల ఆందోళన
చొప్పదండి: గతంలో అనేక సార్లు మల్లన్నపల్లి ఉరికి పక్కనే చొప్పదండి మున్సిపల్ డంపింగ్ యార్డ్ ను పెట్టదని ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా కలెక్టర్ అధికారులను కలవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మల్లంపల్లి గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది. డంపింగ్ యార్డు మీ ఊరి దగ్గర ఏర్పాటు చేయబోమని, వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఈ రోజు మళ్ళీ డంపింగ్ యార్డ్ ఊరిలోకి పంపిస్తున్నారని, ఈ సందర్భంలో గ్రామస్తులందరూ వ్యతిరేకిస్తూ రోడ్డుపైబైఠాయించారు.
- 3 Jun 2020 10:01 AM GMT
వైద్య కళాశాల స్థలం పరిశీలించిన మంత్రులు
పాడేరు: పాడేరులో వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటించారు. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మించబోయే వైద్య కళాశాల స్థలాన్ని పరిశీలించారు. సీఎం జగన్ ఆదేశాలతో వైద్య కళాశాల కోసం పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో 35 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఎంత విస్తీర్ణంలో ఏయే భవనాలు రానున్నాయో అధికారులు మంత్రికి వివరించారు. సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో కళాశాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. వచ్చే ఆగస్టులో టెండర్లు పిలిచి నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మంత్రి ఆళ్ల నానితో పాటు పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire