Live Updates:ఈరోజు (జూన్-01) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు సోమవారం, 01జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, దశమి (మధ్యాహ్నం 02:57 వరకు), తదుపరి ఏకా దశ.సూర్యోదయం 5:41am, సూర్యాస్తమయం 5:47 pm

ఈరోజు తాజావార్తలు

Show Full Article

Live Updates

  • 1 Jun 2020 8:28 AM GMT

    కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

    -నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళ తీరాన్ని తాకాయి.

    -ఈ విషయాన్నీ భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా చెప్పారు.

    -నైరుతి రుతుపవనాలు కేరళ తీరం ద్వారా భారత్ లోకి ప్రవేశించాయని స్పష్టం చేశారు.

    -ఇక వాతావరణ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం జూన్ నుండి సెప్టెంబర్ వరకు దేశంలో 75 శాతం వర్షపాతం నమోదు కానుంది.

    -మరిన్ని వివరాలు 

  • 1 Jun 2020 8:04 AM GMT

    ఏపీలో కొత్తగా 76 కరోనా కేసులు..

    -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

    -గడిచిన 24 గంటల్లో 76 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

    -రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,567 శాంపిల్స్‌ని పరీక్షించగా 76 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు.

    -34 మంది డిశ్చార్జ్ అయ్యారు.

    -గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో కర్నూలు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.

    -మరిన్ని వివరాలు 

  • 1 Jun 2020 2:49 AM GMT

    అమరావతి

    పంట ప్రణాళికలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

    ఆపై మధ్యాహ్నం 3 గంటలకు వైద్య ఆరోగ్యశాఖలో నాడు నేడుపై సమీక్ష చేయనున్నారు.

    అలాగే 3:30 గంటలకు సీఆర్‌డీఏపై సీఎం సమావేశం నిర్వహించనున్నారు. 

  • 1 Jun 2020 2:47 AM GMT

    ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ పెన్షన్‌ కానుక పంపిణీ ప్రారంభమయింది.

    ఉదయం ఆరు గంటల నుంచే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు వాలంటీర్లు పెన్షన్లను అందిస్తున్నారు.

    రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,421.20 కోట్లు విడుదల చేసింది. 2,37,615 మంది వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో నిమగ్నమయ్యారు.

    కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌కు బదులు పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.

    లాక్‌డౌన్‌ వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న పొర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందజేస్తున్నారు.



     


  • రాత్రంతా వాన..ఈరోజు, రేపు ఇదే పరిస్థితి
    1 Jun 2020 1:22 AM GMT

    రాత్రంతా వాన..ఈరోజు, రేపు ఇదే పరిస్థితి

    తెలంగాణలో నిన్న రాత్రంతా వర్షం కురుస్తూనే వుంది

    హైదరాబాద్ లో నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఈ ఉదయానికి కొనసాగుతూనే ఉంది.

    కొంతకాలంగా ఎండ వేడిమికి అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది.

    ఉపరితల ద్రోణి కారణంగా నిన్న రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా 382 ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్టు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

    పిడుగులు పడి వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

    ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

    ఈరోజు, రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

  • 1 Jun 2020 1:12 AM GMT

    ప్రపంచంలో 7 వ స్థానంలో భారత్!

    - ఒక్కరోజే 8,390 కరోనా పాజిటివ్ కేసులు

    - ఒక్కరోజులో రికార్డు స్థాయిలో అత్యధిక కేసులు నమోదు.

    - 4,614 మంది కరోనా నుంచి కోలుకున్నారు

    - గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 193 మంది మరణించారు    

Print Article
More On
Next Story
More Stories