Live Updates:ఈరోజు (జూలై-31) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 31 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం ద్వాదశి (రాత్రి 11-03 వరకు) తదుపరి త్రయోదశి; జేష్ఠ నక్షత్రం (ఉ. 8-33వరకు) తదుపరి మూల నక్షత్రం, అమృత ఘడియలు ( రాత్రి 1-35 నుంచి 3-0వరకు), వర్జ్యం (సా. 4-17 నుంచి 5-50 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-15 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-32 నుంచి 1-23 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-41సూర్యాస్తమయం సా.6-31
ఈరోజు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 31 July 2020 6:11 AM GMT
నెల్లూరు జిల్లా వాకాడు బీసీ కాలనీలో పేలిన గ్యాస్ సిలిండర్
నెల్లూరు
-- ఎనిమిది మందికి తీవ్ర గాయాలు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు. ముగ్గురి పరిస్థితి విషమం.
-- మెరుగైన చికిత్స కోసం బాధితులను గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలింపు.
-- గతరాత్రి నుంచి సిలిండర్లో లీకైన గ్యాస్ను పరిశీలించక విద్యుత్ లైట్ లో ఆన్ చేయడం తో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.
-- ప్రమాదానికి ముందు ఇంట్లోని ఫ్రిజ్ డోర్ ఓపెన్ కావడంతో ఒక్కసారిగా పేలుడు శబ్దం తో ఇంటి మొత్తాన్నీ వ్యాపించిన మంటలు.
-- ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన ఇల్లు
- 31 July 2020 6:09 AM GMT
రోడ్డు టాక్స్ కట్టేందుకు గడువు పెంచాలని సీఎం జగన్ నిర్ణయం..
అమరావతి
- కరోనా నేపథ్యంలో రోడ్డు టాక్స్ కట్టేందుకు ఇచ్చిన గడువు నేటితో ముగింపు..
- లాక్ డౌన్ కారణంగా నష్టాల్లో ఉన్న ఆటో, టాక్సీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకువెళ్లిన మంత్రి పేర్ని నాని..
- రోడ్డు టాక్స్ గడువు సెప్టెంబర్ నెలాఖరు వరకు పెంపు..
- సాయంత్రం అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్న ప్రభుత్వం..
- 31 July 2020 5:59 AM GMT
ముఖ్యమంత్రి వైయస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
అమరావతి
- ముస్లిం సోదరులకు, సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
- త్యాగం, భక్తి, విశ్వాసానికి ఈ పండుగ ప్రతీక అని అన్నారు.
- దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే ఈ పండుగ భక్తి భావానికి, త్యాగానికి చిహ్నమని అన్నారు.
- పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్ ఇచ్చే సందేశమన్నారు.
- బక్రీద్‌ను ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.
- 31 July 2020 5:37 AM GMT
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులొ 14వ రొజు సిబిఐ విచారణ
కడప
- ఒకే రొజు నలుగురు సిబిఐ విచారణకు హజరు
- నేడు కూడా సిబిఐ విచారణకు హజరైన వైఎస్ వివేకా కుమార్తె సునీత
- సునీతతొ పాటు వైఎస్ వివేకా పిఎ క్రిష్ణారెడ్డి, కంప్యూటర్ అపరేటర్ ఇనాయతుల్లా, వంట మనిషి లక్ష్మీదేవి
- 31 July 2020 5:36 AM GMT
మంచీర్యాల జిల్లలో ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ సస్పెన్షన్
- మంచిర్యాల జిల్లాలో ఇద్దరు మహిళ కానిస్టేబుల్స్ పై సస్పెన్షన్ వేటు..
- సీఐ సంతకాలను పోర్జరీ చేసిన
- జయచంద్ర, వనిత లను సస్పెండ్ చేసిన. రామగుండం కమీషనర్ సత్యనారాయణ
- సీక్ లీవ్ విషయంలో సీఐ సంతకాలను పోర్జరీ చేసిన మహిళ. కానిస్టేబుల్స్
- 31 July 2020 5:33 AM GMT
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత
హైదరాబాద్
- వందే భారత్ మిషన్ విమానాల్లో వస్తున్న ప్రయాణికుల్లో బంగారం స్మగ్లింగ్....
- దామన్ నుంచి వస్తున్న పదకొండు మంది ప్రయాణికులు బంగారం స్మగ్లింగ్..
- దుస్తుల్లో పెట్టుకొని బంగారం తీసుకొని వస్తున్న 11 మంది ప్రయాణికులు...
- ప్రయాణికులు నుంచి 3.11 కిలోల బంగారాన్నిస్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ..
- కోటి అరవై ఆరు లక్షల రూపాయల విలువైన విలువైన బంగారాన్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు.
- 31 July 2020 5:02 AM GMT
శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుమల
శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా జరుగుతున్న పవిత్రోత్సవాలు
ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మూలమూర్తితో సహా అన్ని దేవతామూర్తులకు, ఉత్సవమూర్తులకు పవిత్రమాలలను సమర్పణ చేయనున్న అర్చకులు
- 31 July 2020 5:01 AM GMT
క్రోవిడ్ ఆసుపత్రిలో మహిళ ఆత్మహత్య యత్నం..
విజయవాడ
రెండో అంతస్తుపై నుంచి దూకిన మహిళ అదిలక్ష్మీ
తీవ్ర గాయాలు...చికిత్స అందిస్తున్న పోలీసులు..
విచారణ చేస్తున్న పోలీసులు..
- 31 July 2020 3:36 AM GMT
రాజధాని విషయంలో మా జోక్యం ఉండదు.. బిజేపీ నూతన అధ్యక్షుడు వీర్రాజు
నాలుగు రోజుల క్రితం బీజేపీ ఏపీ శాఖ నూతన అద్యక్షునిగా నియమితులైన సోము వీర్రాజు రాజధానిపై ఆసక్తి కర ప్రకటన చేశారు. రాజధాని ఏర్పాటులో స్థానికంగా ఉన్న అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. దానికి బీజేపీ అడ్డుకాదన్నారు. అయితే అమరావతి రైతులకు అన్యాయం జరిగే విషయంలో న్యాయం జరిగే వరకు తాము పోరాటానికే కట్టుబడి ఉన్నామన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతలు అనేవి పార్టీ నిర్ణయించే అంశాలని, అందరి సమన్వయంతో పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తానని తెలిపారు.
- 31 July 2020 3:19 AM GMT
హత్యకు దారితీసిన ఘర్షణ
*బ్రేకింగ్*...
*హైదరాబాద్*..
చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గంజాయి సేవించి ఇద్దరు వ్యక్తులు మధ్య గొడవ హత్య యత్నం కు దారి తీసింది..
ఈ ఘటన అర్దరాత్రి చోటు చేసుకుంది..
చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్ లోని ఘోస్ నగర్ లో నివసించే షౌకత్ 25 (పాత నేరస్తుడు ఇతని పై చాంద్రాయణగుట్ట పీస్ లో ఒక 307 , రెండు దొంగతనం కేసులు ఉన్నాయి..
మొహ్మద్ 25 (ఇతనుకుడా పాత నేరస్తుడు) ఇద్దరు నివాసం చాదర్ఘాట్..
గంజాయి మత్తులో పరస్పరం కత్తులతో దాడి పాల్పడ్డారు..
శోకత్ అహ్మెద్ కు తలకు గాయాలు కావడంతో పోలీసులు ఉస్మానియా అసుపత్రిక తరలించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire