Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 30 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం ఏకాదశి (రాత్రి 12-39 వరకు) తదుపరి ద్వాదశి; అనురరాధ నక్షత్రం (ఉ. 9-36 వరకు) అమృత ఘడియలు ( రాత్రి 11-07 నుంచి 1-39 వరకు), వర్జ్యం (మ. 2-56 నుంచి 4-28 వరకు) దుర్ముహూర్తం ( ఉమ. 2-56 నుంచి 4-28 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.5-41సూర్యాస్తమయం సా.6-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 30 July 2020 7:18 AM GMT

    ఎంపి రఘురామకృష్ణం రాజు

    ప్రభుత్వ రంగంలో ఇంగ్లీషు మీడియం స్కూల్స్ తీసుకు రావడాన్ని అన్నప్పుడు మీరెందుకు వ్యతిరేకించారు అని నాకు షోకాజు నోటీసు ఇచ్చారు

    ప్రాథమిక విద్యను మాతృభాషలో జరపాలని కేంద్రం తెచ్చిన జాతీయ విద్యావిధానం సూచించింది. దీన్ని ఏపి సీఎం గమనించాలి

    జపాన్ , చైనా, దక్షిణ కొరియాలలో మాతృభాషలోనే విద్యాభ్యాసం జరుగుతుంది.

    మాతృభాష వల్లనే సంపూర్ణ వికాసం సాధ్యమవుతుంది. ప్రపంచమంతా ఒక దారిలో వెళితే 151 సీట్లు గెలిచిన సీఎం మరో దారిలో వెళుతున్నారు.

    ఈ విద్యాసంవత్సరం నుండి మాతృభాషలోనే విద్యావిధానం కొనసాగించాలి. సీఎం కు నేరుగా చెప్పే అవకాశం లేదు కాబట్టే మీడియా ముఖంగా ఆ విషయాలను ప్రస్తావిస్తున్నాను.

    నాతోపాటు చాలా మందికి సీఎం కలిసే అవకాశం ఇవ్వరు. పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయనప్పుడు నన్ను సమావేశాలకు ఎందుకు పిలవరు?

    ప్రశ్నకు, ప్రశ్న సమాధానం కాదని సీఎం గుర్తుంచుకోవాలి. ఇంగ్లీషు మీడియం ను ప్రశ్నిస్తే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని సీఎం ప్రశ్నిస్తున్నారు.

  • 30 July 2020 6:18 AM GMT

    మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 13 వ రోజు సిబిఐ దర్యాప్తు

    కడప :

    మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 13 వ రోజు కొనసాగుతున్న సిబిఐ దర్యాప్తు...

    మరొమారు సిబిఐ విచారణకు హజరైన వైఎస్ వివేకా కుమార్తె సునీత...

    గడచిన రెండు రోజుల క్రితం సుమారు ఏడు గంటల పాటు సిబిఐ విచారణకు హజరైన సునీత...

    నేడు మరోమారు విచారణకు హజరుకావాలని సిబిఐ పిలుపు

    నిన్న విచారణకు హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డి...

  • 30 July 2020 2:25 AM GMT

    కడప :

    ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ ఫైనలియర్‌ విద్యార్థులు కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక...

    ఇటీవల ఆయా కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 15 మందికి ఉద్యోగాలు...

    అమెజాన్‌, ఐబీ హబ్‌, డివైజస్‌ వంటి సంస్దల్లొ ఉద్యోగాలకు ఎంపిక...

    8 లక్షల నుంచి 28లక్షల వరకు వార్షిక వేతనం...హర్షం వ్యక్తం చేసిన అధ్యాపకులు

  • 30 July 2020 2:25 AM GMT

    కామారెడ్డి :

    బిక్కనుర్ మండలము సిద్దరమేశ్వర్ నగర్ శివారులో అక్రమంగా గోవులను తరలిస్తుండగా అడ్డుకున్న భజరంగ్ దళ్, బిజేపి కార్యకర్తలు

    పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 27 అవులు స్వాధీనం

    బక్రీద్ సందర్భంగా మెదక్ నుంచి కాలినడకన కామారెడ్డి కి తరలిస్తున్నారని భజరంగ్ దళ్ కార్యకర్తల ఆరోపణ

  • 30 July 2020 2:23 AM GMT

    తూర్పుగోదావరి

    జిల్లాలో మార్చి 21న రాజమండ్రి లో తొలిగా మొదలైన పాజిటివ్‌ కేసు నమోదు ప్రస్థానం.

    ప్రస్తుతం జిల్లాలో 64 మండలాలను కరోనా వైరస్‌ చుట్టేసింది.

    రాజమండ్రి ,కాకినాడ వంటి నగరాలతో పాటు 30 మండలాల్లో కోవిడ్ తీవ్రత అధికం

    ప్రస్తుతం జిల్లాలో 17,739కి చేరుకున్న పాజిటీవ్ కేసుల సంఖ్య

Print Article
Next Story
More Stories