Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 30 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం ఏకాదశి (రాత్రి 12-39 వరకు) తదుపరి ద్వాదశి; అనురరాధ నక్షత్రం (ఉ. 9-36 వరకు) అమృత ఘడియలు ( రాత్రి 11-07 నుంచి 1-39 వరకు), వర్జ్యం (మ. 2-56 నుంచి 4-28 వరకు) దుర్ముహూర్తం ( ఉమ. 2-56 నుంచి 4-28 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.5-41సూర్యాస్తమయం సా.6-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 30 July 2020 11:29 AM GMT
నల్గొండ : నకరికల్లు లో నియోజకవర్గం మొత్తం కరోనా వైరస్ నుంచి ఉప శమనం కోసం ...ఉచిత కషాయ వితరణ పంపిణీ కార్యక్రమాన్ని సొంత నిధులతో ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ,బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంబయ్య.
- 30 July 2020 11:29 AM GMT
రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మానవ అక్రమ రవాణా అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం..
మహిళలను, చిన్నారులను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ బృందం అన్ని పోలీస్ స్టేషన్ లను కోఆర్డినేషన్ చేస్తుంది..
మహిళల అక్రమ రవాణా, చిన్న పిల్లల కిడ్నాప్, కిడ్నీ రాకెట్, అనాధ పిల్లలను పనిలో పెట్టుకోవడం లాంటి వాటిపై ఈ బృందం ప్రత్యేక నిఘా పెడుతుంది...
గడిచిన సంవత్సర కాలం వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళల అక్రమ రవాణా కు సంబంధించి 290 కేసులను నమోదు చేశాం..
ఇందులో 557 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు
మంది మహిళలకు చిన్నారులను విముక్తి కల్పించారు..
144 వ్యభిచార గృహాలపై కేసులు నమోదు చేశాం..
50 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశాం..
ఇకనుండి రాచకొండ కమిషనరేట్ లో అక్రమ రవాణాపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే డయల్100కు సమాచారం ఇవ్వండి.
- 30 July 2020 11:28 AM GMT
విజయవాడ:
రేపు శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున ఇంద్రకీలాద్రి పై వరలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ
రేపు ఉదయం 8 గంటలకు దేవస్ధానం వారిచే వరలక్ష్మీ దేవి వ్రతం
కోవిడ్ ద్రుష్ట్యా ప్రతీ ఏడాది నిర్వహించే సామూహిక, ఉచిత వరలక్ష్మీ దేవి వ్రతాలు, ఆర్జిత సేవలు రద్దు...భక్తులకు పూజలకు అనుమతి నిరాకరణ
వరలక్ష్మీ దేవి వ్రతంలో భక్తులకు పరోక్ష పూజల ద్వారా గోత్రనామాలతో జరిపేందుకు అవకాశం కల్పించిన దుర్గగుడి అధికారులు
టిక్కెట్ కావాల్సిన భక్తులు www.kanakadurgamma.org ద్వారా సొమ్ము చెల్లించి టిక్కెట్ పొందాలని సూచించిన దుర్గగుడి ఈవో ఎంవి సురేష్ బాబు
- 30 July 2020 11:28 AM GMT
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును వెంటనే నిలిపివేయాల్సిందిగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయడాన్ని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు తప్పు పట్టింది.
ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్యుడు హరికేశ్ మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వక ఆదేశం పంపారు.
కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనుల విషయంలో కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వాన్ని బోర్డు హెచ్చరించింది.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని అక్రమంగా మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పునర్విభజన చట్టానికి విరుద్దమైందని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో కృష్ణా వాటర్ బోర్డు ప్రతిస్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులను నిర్మించడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొన్నది.
ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 84, పేరా 7లోని నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసిందని బోర్డు తప్పు పట్టింది.
కొత్త ప్రాజెక్టులేవైనా ముందుగా వాటి సమగ్ర నివేదిక (డీపీఆర్)ను కేంద్ర జలవనరుల సంఘానికి సమర్పించి, అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలైనా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని బోర్డు నిర్దిష్టంగా పేర్కొన్నది.
- 30 July 2020 11:27 AM GMT
గుంటూరు జిజిహెచ్ లో దారుణం.
రెండు నెలల బాబుకు, తల్లికి కరోనా రావటంతో మూడు రోజుల క్రితం జిజిహెచ్ లో చేరిన తల్లి, బాబు.
పట్టించుకోని వైద్యులు, సిబ్బంది.
ఇంజక్షన్స్ లోడ్ చేసి చేయకుండ వదిలి వెళ్ళిన సిబ్బంది..
తల్లి వెళ్ళి ఎన్ని సార్లు అడిగిన ఇంజక్షన్స్ చెయ్యని సిబ్బంది...
తనను, బిడ్డను కాపాడాలంటూ తల్లి సెల్ఫీ వీడియో......
- 30 July 2020 8:51 AM GMT
అమరావతి:
ఏపీ బిల్డ్ పేరుతో ప్రభుత్వ ఆస్తుల అమ్మకం పై హైకోర్టులో జరిగిన విచారణ
కౌంటర్ ధాఖలు చేయడానికి సమయం కోరిన కొంతమంది ప్రతివాదులు
నాలుగు వారాలు వాయిదా వేసిన ధర్మాసనం
తుది తీర్పు ఇచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు
అప్పటి వరకు టెండర్లు ఖరారు చేయవద్దని ఆదేశాలు
- 30 July 2020 8:50 AM GMT
గజ్వేల్ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం
- వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సింలు మృతి దురదృష్ట కరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.
- మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది పేర్కొన్నారు.
- ఎస్సీ రైతు నర్సింలు మృతి బాధాకరం
- ఇది విపక్షాల రాజకీయ ప్రేరేపిత హాత్య
- శవాలపై పేలాలు ఏరుకునే నీచ రాజకీయాలు చేయొద్దు.
- స్వలాభo కోసం అమాయకులను బలి పశువులు చేయొద్దు
- వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి.
- మృతుడి భూమిని టీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా తీసుకుందనే ఆరోపణలల్లో ఏ మాత్రం నిజం లేదు.
- మృతుడి భూమిని కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే సబ్ స్టేషన్ కోసం స్వాధీనం చేసుకున్నారు.
- మృతుడి కుటుంబానికీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది.
- ఎక్స్రే గ్రేషియా తో పాటు ఎకరం భూమి
తక్షణ సహాయంగా రూ.2 లక్షలు అందజేస్తున్నాం. మృతుడి కుమార్తెను ప్రభుత్వ ఖర్చులతో చదివిస్తాo.
- రైతు మృతికి గల కారణాలపై లోతైన విచారణ జరిపిస్తాం.
- దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తాo...
- 30 July 2020 8:50 AM GMT
కుమ్రంబీమ్.. జిల్లా చింతమానే పల్లి తహసీల్దారు ఖాజామియా వసూళ్ల దందా..
రైతుల. దగ్గర నుండి డబ్బులు వసూళ్లకు పాల్పపడిన ఎమ్మర్వో..
బదిలీ పై వెళ్లుతున్నా ఎమ్మర్వో..
మా డబ్బులు మాకు ఇవ్వాలని ఖాజామియాను నిర్బందించిన రైతులు..
నూట యాబై మంది లక్షల. రుపాయలు వసూలు చేసిన. ఎమ్మర్వో..
విషయం బయట పోక్కడంతో డబ్బులు ఇస్తానని హమీ పత్రాలు రాయించి ఇస్తున్నా ఎమ్మర్వో
- 30 July 2020 8:48 AM GMT
టీఎస్ హైకోర్టు....
బక్రీద్ సందర్భంగా జంతు వధ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు ఆదేశం
అక్రమ జంతు వధ చేస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలన్న డాక్టర్ శశికళ పిల్ పై హైకోర్టులో విచారణ
హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతు వధ కేంద్రాలను తనిఖీ చేసినట్టు తెలిపిన ప్రభుత్వం
అక్రమ జంతు వధపై రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపిన ప్రభుత్వం
జంతు వధ నిబంధనల ప్రకారమే జరగాలన్న హైకోర్టు
జంతు మాంసం ద్వారా కూడా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్న హైకోర్టు
చైనాలో గబ్బిలాలు తినడం ద్వారా కరోనా వచ్చిందన్న ప్రచారం ఉందన్న హైకోర్టు
మాంసం దుకాణాలను జీహెచ్ ఎంసీ అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేశారా అని ప్రశ్నించిన హైకోర్టు
రెండు వారాల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- 30 July 2020 7:22 AM GMT
విజయవాడ:
దుర్గగుడి మహామండపము 6 వ అంతస్తులో పాలకమండలి సమావేశం
సమావేశంలో పాల్గొన్న ఈవో సురేష్ బాబు, చైర్మన్ పైలా సోమినాయుడు పాలకమండలి సభ్యులు
చివరిగా మార్చిలో జరిగిన పాలకమండలి సమావేశం
23 అజెండాలతో జరుగుతున్న దుర్గగుడి పాలకమండలి సమావేశం
కరోనా కారణంగా గుడిపై తీసుకోవాల్సిన చర్యలు, పవిత్రోత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా జరగనున్న చర్చ
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire