Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 29 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం దశమి (తె.03-15వరకు) తదుపరి ఏకాదశి విశాఖ నక్షత్రం (ఉ.8-33 వరకు) అమృత ఘడియలు ( రాత్రి 9-31 నుంచి 11-11 వరకు), వర్జ్యం (మ.12-24 నుంచి 1-57 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-14 నుంచి 9-05 వరకు తిరిగి రాత్రి 10-58 నుంచి 11-43 వరకు) రాహుకాలం (మ. 12-22 నుంచి 1-55 వరకు) సూర్యోదయం ఉ.5-40 సూర్యాస్తమయం సా.6-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 29 July 2020 10:48 AM GMT
సామాజిక మాధ్యమాల్లో అనారోగ్యాంగా ఉన్న ప్రజలను చుయిస్తూ వారిని ఆదుకోవాలని ప్రకటనలు చేస్తూ దాతలు డబ్బులు రూపంలో ఇస్తున్న సహాయలను దుర్వినియోగం చేస్తూ, దాతలను మోసం చేస్తున్న సల్మాన్ ఖాన్,అతనికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్ట పోలీసులు.
- 29 July 2020 10:48 AM GMT
మచిలీపట్నంలో మరోమారు లాక్డౌన్ కి మొగ్గు చూపిన మంత్రి పేర్నినాని...
మచిలీపట్నం : ఆగస్టు 3 నుండి 9 వరకు మచిలీపట్నం మరియు గ్రామీణ ప్రాంతాల్లో లాక్డౌన్ నిర్వహణకు మంత్రి పేర్ని ఆదేశాలు. నేటి టాస్క్ఫోర్స్ సమావేశంలో మంత్రి కీలక నిర్ణయం..ప్రజా శ్రేయస్సే ముఖ్యమన్న మంత్రి. నిత్యావసర సరుకుల కోసం ఉదయం 6 నుండి 9గంటల వరకు వేసులు బాటు. వ్యాపారాలు తప్పనిసరిగా హ్యాండ్ గ్లౌస్ ధరించి,మాస్క్ తో వ్యాపార కార్యక్రమాలు నిర్వహించాలి. పనికి,వ్యాపారానికి,ముచ్చట్లకి పక్క ఊర్లకి పోవడం..లేదు బందరులోకి రావడం జరగకూడదని అధికారులకు ఆదేశాలు. వ్యవసాయ రైతులకు,కూలీలకు వెసులుబాటు..తప్పని సరిగా మాస్క్ ఉండాలి. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం, బక్రీద్ అంటూ పండుగల పేరుతో వైరస్ని ఆహ్వానించకండి. మన శ్రేయస్సు, మన ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసమే ఈ కఠిన నిర్ణయం. లాక్డౌన్ నియమావళి అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ.
- 29 July 2020 10:46 AM GMT
కర్నూలు జిల్లా: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిచిన దుకాణదారులు మరియు ఇతర వ్యక్తులు మొత్తం 31 మందిపై 14 కేసులు. వీటితో పాటు రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై ఎం.వి కేసులు మొత్తం 551 నమోదు. రూ.1,97,875/- ల ఫైన్ లు వేస్తూ చలానాలు జారీ మరియ 03 వాహనాలు సీజ్. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై కేసులు నమోదు, అరెస్టులతో పాటు రూ.3100/- ల నగదు, 3794 లిక్కర్ బాటిల్స్ (606.68 లీటర్లు) మరియు, మరియు 52 లీటర్ల నాటు సారా స్వాధీనం. మాస్కులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు మొత్తం 790 నమోదు. రూ.58,700/- ల ఫైన్ లు వేస్తూ చలానాలు జారీ.
- 29 July 2020 10:46 AM GMT
సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా కు సిద్ధమవుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కరోనా లక్షణాలతో బాధపడుతున్న సంగారెడ్డి పట్టణానికి చెందిన ఒక మహిళ ను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసుకునేందుకు నిరాకరించి గాంధీకి పంపిన వైద్యులు. వైద్యం నిరాకరించిన వైనం పై సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సుపెరిండెంట్ పై నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి. గాంధీలో చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందడం తో ఆందోళనకు సిద్ధమైన జగ్గారెడ్డి. జగ్గారెడ్డి ఆందోళనకు పిలుపునివ్వడం తో సంగారెడ్డి లో ఉద్రిక్తత.
- 29 July 2020 10:45 AM GMT
కృష్ణా జిల్లా... పెనమలూరు
నిత్య పెళ్లి కొడుకు గా మారిన ప్రధానో ఫాద్యాయుడు సురేష్
మూడు పెళ్లిళ్ల తో ముగ్గురు యువతులకు టోకరా
2011లో గుంటూరుకు చెందిన శాంతి ప్రియతో పరిణియం
2015 లోఉయ్యూరు కి చెందిన శైలజ తో వి వాహం
2019లో విశ్వనాథ పల్లికి చెందిన అనూష తో పెళ్లి
ఒకరికి తెలియ కుండా మరోకరి ని వివాహంచేసుకున్న సురేష్
రెండవ భార్య ఫిర్యాదు తో బయట పడ్డ సురేష్ బండారం
దిశా పోలీస్ స్టేషన్ లో పిర్యాదు ...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- 29 July 2020 8:25 AM GMT
అమరావతి:
ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పోస్టర్, బ్రోచర్ ఆవిష్కరించిన సీఎం వైయస్.జగన్.
పాల్గొన్న పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రతీప్ కుమార్, ఇతర ఉన్నతాధికారు
- 29 July 2020 8:24 AM GMT
గుంటూరు:
మాచవరం మండలం చెన్నాయపాలెం లో సైదారెడ్డి అనే టిడిపి సానుభూతి పై దాడి.
పొలం గట్టు విషయం లో వివాదం.
గ్రామం లోని సెంటర్ లో రచ్చబండ వద్ద కూర్చున్న సైదారెడ్డి పై మారణాయుదాలతో దాడి.
దాడికి పాల్పడిన వైసిపి సానుభూతిపరులు.
గురజాల ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సైదారెడ్డి.
- 29 July 2020 8:24 AM GMT
విజయవాడ
రేపు దుర్గగుడి పాలకమండలి సమావేశం
రేపు సమావేశంలో పాల్గొననున్న ఈవో సురేష్ బాబు, చైర్మన్ పైలా సోమినాయుడు పాలకమండలి సభ్యులు
గత మార్చిలో జరిగిన పాలకమండలి సమావేశం
రేపు 23 అజెండాలతో జరగనున్న దుర్గగుడి పాలకమండలి సమావేశం
ఇంద్రకీలాద్రిపై కోవిడ్ పై తీసుకోవాల్సిన చర్యలు, పవిత్రోత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తుల సౌకర్యాలు, కోవిడ్ దృష్ట్యా కోల్పోయిన దుర్గగుడి ఆదాయంపై చర్చించే అవకాశం
- 29 July 2020 8:23 AM GMT
తూర్పుగోదావరి :
మామిడికుదురు మం. పెదపట్నంలో ఐదు రోజుల నుంచి కరోనా బాధితుల నిరీక్షణ..
ఒకే కుటుంబంలో 11 మందికి సోకిన కరోనా వైరస్.. హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించిన అధికారులు..
ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ.. ఇప్పటి వరకు మందులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తోన్న బాధితులు..
బాధితుల్లో ముగ్గురు చిన్నారులు సహా ఒక క్యాన్సర్ పేషెంట్.. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆవేదన..
- 29 July 2020 8:23 AM GMT
తూర్పుగోదావరి -రాజమండ్రి
రాజమండ్రిలో కోవిడ్ పై సమీక్షించిన మంత్రులు ఆళ్ళ నాని, పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, ఎంపీ భరత్ , ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
డిప్యూటీ సిఎం , వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నాని మీడియాలో కామెంట్స్
జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో కాకినాడ లో మరో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు
జిల్లాలో మరో మూడు ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తాం
పేషెంట్స్ కు ఫుడ్ నాణ్యత పెంచుతాం, ఒక్కో పేషెంట్ కు 500రూపాయలు వెచ్చిస్తున్నాం
నాణ్యత బాగున్నా, సరఫరా లో జాప్యం జరుగుతుంది ..దాన్ని సరిచేస్తాఁ
పాజిటీవ్ పేషెంట్ త్వరగా కోలుకునేలా సిఎం జగన్ ఆదేశాలతో బలవర్ధక ఫుడ్ సరఫరా చేస్తన్నాం
ఫుడ్ సరఫరా సక్రమంగా నాణ్యంగా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం
కరోనా నియంత్రణ కు కట్టడి చర్యలు సిఎం జగన్ నేతృత్వంలో ప్రభుత్వం విస్తృతంగా చేపట్టింది.
చంద్రబాబు తన రాజకీయ లబ్డికోసం కోవిడ్ ను వాడుకుంటున్నారు.
కోవిడ్ ను పట్టించుకోవడం లేదని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు.
కరోనా మృతులు ఆస్పత్రి నుంచి డిస్పోజ్ చేయడం లో కొంత జాప్యం బంధువులు వల్లనే జరుగుతోంది
వారు బాడీ దగ్గర చట్టపరంగా పూర్తిచేయాల్సిన తంతు చేయాలి.. మరణం బాధతో వారు రెస్పాండ్ కావడం లేటవుతుంది
కొత్తగా రాష్ట్రంలో 17వేల మంది డాక్టర్లను, వైద్యసిబ్బంది పోస్టులు భర్తీ చేస్తాం
కోవిడ్ టెస్ట్ రిపోర్టు లు 24 గంటలలోపే వచ్చేలా చూస్తాం
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం
బెడ్స్ లేవని తిరిగి పంపడం కుదరదు.. డిస్ ప్లే లో కోవిడ్ ఆస్పత్రుల బెడ్స్ ఆక్యూపెన్సీ పెడతాం
ప్రైవేటు ఆస్పత్రులలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే కోవిడ్ బాధితుల నుంచి ఎక్కువ వసూళ్ళు చేయరాదు.
వారం రోజులు విధులు చేస్తే మరో వారం హోం క్వారైంటన్ వైద్యసిబ్బందికి కొత్త రిక్రూట్మెంట్ తర్వాత ఇస్తాం..
ఆక్సిజన్ అందించే విషయంలో అధికారుల నిర్లక్ష్యం వుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం
రాజమండ్రిలో కోవిడ్ కు ప్రత్యేక అధికారిగా ఐఎఎస్ అధికారి ఆనంద్ ను నియమించాం
రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ కొరత వుందంటే సరిచేయాలని అధికారులను ఆదేశించాం
డిప్యూటీ సిఎం , వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నాని
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire