Live Updates:ఈరోజు (జూలై-28) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం, 28 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం అష్టమి (ఉ. 7-03 వరకు) తదుపరి నవమి (తె. 4-45వరకు) స్వాతి నక్షత్రం (మ. 12-27 వరకు) తర్వాత విశాఖ నక్షత్రం.. అమృత ఘడియలు ( రాత్రి 2-41 నుంచి 4-11 వరకు), వర్జ్యం (సా. 5-41 నుంచి 7-11 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-14 నుంచి 9-05 వరకు తిరిగి రాత్రి 10-58 నుంచి 11-43 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-40 సూర్యాస్తమయం సా.6-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 28 July 2020 1:02 PM GMT
సినీ ప్రముఖులు రావి కొండలరావు మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం
- బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
- తెలుగు సినీ ప్రముఖుడిగా, దర్శకుడుగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, జర్నలిస్టుగా ఆయన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.
- క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా అనేక చిత్రాల్లో నటించిన రావి కొండలరావు తెలుగు సినీ ప్రేక్షకులకు శాశ్వతంగా గుర్తుండిపోతారని అన్నారు.
- ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయినట్లైందని జగన్ అన్నారు.
- ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
- 28 July 2020 12:58 PM GMT
రావికొండలరావు మరణం పై లోకేష్ సంతాపం
అమరావతి
- సినీ, సాహిత్యరంగ ప్రముఖుడు రావికొండలరావు మృతి. తెలుగు చలనచిత్రరంగానికి తీరనిలోటు.
- ఐదు దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని తన నటనతో అలరించిన రావికొండలరావు స్క్రీన్‌ప్లే రచయితగా,సహనిర్మాతగా బహుముఖ రంగాల్లో తనసేవలు అందించారు.
- ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను
- 28 July 2020 12:41 PM GMT
సినీ నటుడు రావికొండలరావు ఇకలేరు!
- ప్రముఖ నటుడు రావి కొండలరావు మరణించారు.
- నటుడు, దర్శకుడు, రచయిత, నాటకం.. సినీమా.. టీవీ.. పత్రికలు.. మిమిక్రీ ఇలా అన్ని రంగాలలోనూ విశేష అనుభవం రావి కొండలరావు మంగళవారం నాడు (జూలై 28) గుండెపోటుతో మరణించారు.
- 28 July 2020 9:39 AM GMT
HRC లో NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఫిర్యాదు
- కరోనా సమయంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఆదేశించాలని ఫిర్యాదు
- జీవించే హక్కును ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని HRC కి ఫిర్యాదు
- ఆన్లైన్ క్లాసులను వెంటనే ఆపేయాలి కోరిన NSUI నేతలు.
- 28 July 2020 8:57 AM GMT
రామడుగు మండల తహశీల్దార్ కార్యాలయం ముందు మందు డబ్బాతో యువకులు
కరీంనగర్ జిల్లా:
👉 రామడుగు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు మందు డబ్బాతో బైఠాయించిన ఇద్దరు యువకులు ...
👉 తమ తాతకు సంబంధించిన భూమిని మరొకరిపై పట్టా చేయించారని ఆవేదన
👉రామడుగు లోని 13/డి ,13/ఇ, 13/ఎఫ్ ,13/జి,13/ఇ పదిహేను గుంటల భూమిని అక్రమ పట్టా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన యువ రైతులు...
👉ఎమ్మార్వో కోమల్ రెడ్డి ఎంత చెప్పిన వినని పర్శరాం, మహేష్ లు...
👉 పరశురామ్ మహేష్ లను చివరకి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు
- 28 July 2020 8:50 AM GMT
ఆక్వాకల్చర్‌కు పురోగతి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి: ఎంపీ రఘురామ కృష్ణంరాజు
- ఆక్వా రైతుల తరఫున కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజ్‌నాథ్ సింగ్ తదితరులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాను
- రైతులకు రూ. 6,500 ఇచ్చినట్టే, ఆక్వా రైతులకు కూడా ఇచ్చే విషయం పరిశీలించాలని కోరుతున్నాను
- నాకు భద్రత కల్పించే అంశంపై హోం సెక్రటరీతో చర్చించాను
- రాష్ట్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది
- నాకు సమస్యే రాష్ట్ర ప్రభుత్వ భద్రతతో అన్న విషయం చెప్పాను
- ఈ వారాంతం వరకు నాకు కేంద్ర బలగాల భద్రత అందుతుందని నమ్ముతున్నాను
- దురదృష్టావశాత్తూ నేను నా నియోజకవర్గానికి వెళ్లే పరిస్థితి లేదు
- నేను ధైర్యం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా, నా శ్రేయోభిలాషులు వద్దంటున్నారు
- సుమారు 24 పోలీసు స్టేషన్లలో నా అనుచరులు, వారి అనుచరులు వేర్వేరు కేసులు పెట్టారు
- ప్రభుత్వమే నామీద కక్షగట్టి వ్యవహరిస్తోంది.
- నేను స్పీకర్‌కు లేఖ రాసిన 20 రోజుల తర్వాత కేసులు పెడుతూ పోయారు
- నేను క్షేత్రస్థాయికి వెళ్లలేని నిస్సహాయస్థితిలో ఉన్నాను
- అతిత్వరలో నాకు భద్రత వస్తుంది. అప్పుడే నా నియోజకవర్గానికి రాగలను
- 28 July 2020 8:45 AM GMT
తిరుపతిలో విదేశీ మహిళ లాక్ డౌన్ కష్టాలు
- చేతిలో చిల్లిగవ్వలేక దాతల సాయంతో తలదాటుకుంటూ గడుపుతున్న విదేశీయురాలు
- తల్లి బృందావనంలో కూతురు తిరుపతిలో మూడు నెలలుగా ఇక్కట్లు
- విదేశీ మహిళకు ఆర్థిక సాయమందించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
- ప్రభుత్వంతో మాట్లాడి వారిని వారి దేశానికి పంపే ప్రయత్నం చేస్తామని భరోసానిచ్చిన కరుణాకర్ రెడ్డి
- 28 July 2020 6:04 AM GMT
వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ప్రత్యెక పూజలు
విజయవాడ
- ఈ నెల 31న శ్రావణ మాసం 2 వ శుక్రవారము పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు
- దుర్గమ్మ వరలక్ష్మి దేవి గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
- ప్రతీ ఏడాది నిర్వహించు సామూహిక వరలక్ష్మీ వ్రతములు, ఉచిత సామూహిక ఆర్జిత సేవలను రద్దు.
- భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయంలో అమ్మవారికి 8-00 గా.లకు దేవస్థానం వారిచే జరిపించు వరలక్ష్మీ వ్రతము నిర్వహించనున్నారు.
- వ్రతములో పరోక్షముగా గోత్రనామములతో జరిపించుకోవడం కోసం ఏర్పాట్లు
- 28 July 2020 5:58 AM GMT
జివికె కేసులో రంగంలోకి దిగిన ఈడీ
బ్రేకింగ్...
- దేశ వ్యాప్తంగా తొమ్మిది చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఈ డి..
- ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో తో సహా మరో ఐదు ప్రాంతాల్లో ఈడి సోదాలు..
- ఇప్పటికే జివికె పై కేసు నమోదు చేసిన సీబీఐ ..
- సిబిఐ కేసు ఆధారంగా సోదాలు..
- Mial కు చెందిన 730 కోట్ల నిధుల దుర్వినియోగంపై జీవికి పై కేసు నమోదు.
- ముంబై ఎయిర్ పోర్ట్ లో నిధుల దుర్వినియోగంపై కేసు నమోదు చేసిన సిబిఐ ఈడి
- 28 July 2020 5:55 AM GMT
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులొ 11 వ రొజు సిబిఐ విచారణ
కడప :
- కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లొ రెండవ రొజు సిబిఐ విచారణ
- ఈ రొజు విచారణకు హజరైన వైఎస్ వివేకా కుమార్తె సునీత
- ఇది వరకే పులివెందులలొ విచారించిన సిబిఐ
- మరొమారు సిబిఐ అదికారులు పిలవడంలొ విచారణకు హజరైన సునీత
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire