Live Updates:ఈరోజు (జూలై-26) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 26 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం షష్ఠి (ఉ.9-32 వరకు) తర్వాత సప్తమి, హస్త నక్షత్రం (మ. 12-37 వరకు) తర్వాత హస్త నక్షత్రం.. అమృత ఘడియలు ( మ. 12-46 నుంచి 2-17 వరకు), వర్జ్యం ( రా. 8-06 నుంచి 9-36 వరకు) దుర్ముహూర్తం (సా. 4-57 నుంచి 5-49 వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-30 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-32

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 26 July 2020 4:30 AM GMT

    ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి పెరిగిన గడువు

    శ్రీకాకుళం: రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోనే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆదర్శ పాఠశాలల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు.

  • 26 July 2020 4:16 AM GMT

    పొన్నూరులో భారీ వర్షం

    పొన్నూరు: పట్టణంలో శనివారం సాయంత్రం గంట పాటు భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికైనా అధికారులు రోడ్లపై వర్షపు నీరు నిలువకుండా సైడ్ కాలవలు నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


  • 26 July 2020 4:15 AM GMT

    కృష్ణదేవిపేటలో వ్యాపారులంతా స్వచ్ఛందంగా లాక్​ డౌన్

    గొలుగొండ: మండంలం కృష్ణదేవిపేటలో ఒకే ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడి వ్యాపారులంతా స్వచ్ఛంద లాక్​డౌన్​ పాటిస్తున్నారు. ఈ మేరకు గత రెండు రోజులుగా దీన్ని పటిష్టంగా అమలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే తమ దుకాణాలను తెరచి ఉంచారు.


  • 26 July 2020 4:14 AM GMT

    చీడికాడలో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు

    చీడికాడ: శివారు తోటల్లో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 2 వేల లీటర్ల బెల్లం ఊట గుర్తించి ధ్వంసం చేశారు. నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సురేశ్​ కుమార్​ వెల్లడించారు.

  • 26 July 2020 4:11 AM GMT

    అమలాపురంలో కర్వ్యూ కఠినంగా అమలు: డీఎస్పీ షేక్ మాసుం బాష

    అమలాపురం: పట్టణంలో ఏ ఒక్క షాపును తెరవకుండా, అలాగే ఎవరిని బయట తిరగకుండా కర్వ్యూ కఠినంగా అమలు చేస్తున్నట్లు డీఎస్పీ మాసూమ్ భాషా తెలిపారు.

    - అమలాపురం సబ్ డివిజన్ లో సీఐ, ఎస్ఐ లు అందరూ కూడా సబ్ డివిజన్ అంతటా ఉదయం 6 గంటల నుంచి కర్వ్యూ ను అమలు చేస్తురన్నారు.

    - ఎవరు కూడా ఈ 24 గంటలు షాపులు తీయవద్దు అని అనవసరంగా బయటికి వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, బైకులు సీజ్ చేస్తామని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

    - కొందరు అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా యువత ఎవరైనా రోడ్డు మీద తిరుగుతూ కనబడితే వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అని డీఎస్పీ మాసుం భాష తెలిపారు.

    - అమలాపురం పట్టణంలో కర్వ్యూ అమలును పట్టణ సీఐ బాజిలాల్ తో కలసి పరిశీలించారు.



  • 26 July 2020 4:10 AM GMT

    భూముల విలువ పెంపునకు ఓకే..

    నిర్మాణాల విలువ పెంచిన ఏపీ ప్రభుత్వం ఆగష్టు ఒకటి నుంచి భూముల విలువను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటి విలువ పెరడంతోనే రిజిస్ట్రేషన్ విలువ పెరిగి, ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైనట్లు కనిపిస్తోంది. పట్టణాలు, నగరాలలోని వ్యవసాయ భూములు, అపార్ట్‌మెంట్లు, ఖాళీ స్థలాల విలువను ఆగష్టు 1 నుంచి పెంచనుంది.

    - పూర్తి వివరాలు 

  • 26 July 2020 2:50 AM GMT

    కరోనా ఎఫెక్ట్: షార్ కేంద్రంలోనూ లాక్ డౌన్

    కరోనా వైరస్ ఎఫెక్ట్ షార్ కేంద్రానికి పాకింది... నాలుగు దశాబ్ధాల పాటు నిర్విరామంగా పనిచేసిన షార్ కోవిద్ వ్యాప్తి వల్ల మూసివేతకు దారి తీసింది. ఈ మహమ్మారి అదుపులోకి వచ్చాక తలుపులు తెరిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

    - పూర్తి వివరాలు 

  • 26 July 2020 2:49 AM GMT

    రేపట్నుంచి అడ్మిషన్లు.. బడులు తెరిచేందుకు ఏర్పాట్లు

    ఐదు నెలలుగా ఇంటి పట్టున ఉన్న బడులవైపు తీసుకెళ్లేలా ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూనే విద్యార్థులను బడివైపు మళ్లించేలా సన్నద్ధం చేస్తోంది. సోమవారం నుంచి అడ్మిషన్లు ప్రారంభించి, ఆన్లైన్ తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది.

    - పూర్తి వివరాలు 

  • 26 July 2020 2:47 AM GMT

    మరిన్ని వెంటిలేటర్లు..

    పది రోజుల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితి చూస్తే ఆందోళన కలిగిస్తోంది. దీనికి మరింత అవసరమైన ఏర్పాట్లు చేస్తేనే బయటపడే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఏపీ ప్రభుత్వం వీలైనన్ని వసతులు ఏర్పాటు చేసేందుకు సంకల్పించింది. వీటిని వెంటనే అమలు చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసింది.

    - పూర్తి వివరాలు 

  • శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద నీటి ప్రవాహం
    26 July 2020 2:46 AM GMT

    శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద నీటి ప్రవాహం

    - ఎగువన కురుస్తున్న వర్షాలతోశ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరిగింది.

    - ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 95,279 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 40,253 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.

    - జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం నీటి మట్టం 853.20 అడుగులకు చేరింది.

    - పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 87.2476 టీఎంసీలుగా ఉంది.

    - వరద నీటి ప్రవాహం నేపథ్యంలో ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Print Article
Next Story
More Stories