Live Updates:ఈరోజు (జూలై-24) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు శుక్రవారం, 24 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం చవితి (సా. 4-39 వరకు) తర్వాత పంచమి, పుబ్బ నక్షత్రం (సా. 6-50 వరకు) తర్వాత ఉత్తర నక్షత్రం.. అమృత ఘడియలు ( మ. 12-46 నుంచి 2-17 వరకు), వర్జ్యం ( రా. 1-35 నుంచి 3-06 వరకు తె.వ. 3-40 నుంచి 5-11 వరకు) దుర్ముహూర్తం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-32
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 24 July 2020 12:02 PM GMT
తూర్పుగోదావరిలో పూర్తి కర్ఫ్యూ
- తూర్పు గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి విజ్రుంభిస్తుంది.
- రొజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
- కరోనా కేసులు పెరగటం తో జిల్లా కలెక్టర్ మురళిదర్ రెడ్డి ఆదేశాలతో ఆంక్షలు మరింత కఠినతరం చేసారు.
- ఉదయం 11 గం. నుండి మరుసటి రోజు ఉదయం 6 గం. వరకు ప్రజలు భయట తిరగటాన్ని నిషేదించారు.
- ఆంక్షలను ఉల్లంగిస్తున్న వారిపై పోలీసులు ఫైన్లు విడుస్తున్నారు.
- 24 July 2020 10:00 AM GMT
లాక్‌డౌన్ ప్రచారం అవాస్తవం: విజయవాడ కలెక్టర్
-26 నుంచి వారం రోజులపాటు లాక్‌డౌన్ అంటూ ప్రచారం
- నగరంలో లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదన్న కలెక్టర్
-అవాస్తవాలు ప్రచారం చేయొద్దని హితవు
- కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడలో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వారం రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.
- ఈ ప్రచారంపై కలెక్టర్ ఇంతియాజ్ స్పందించారు. 26 నుంచి వారం రోజులపాటు లాక్‌డౌన్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలతో ప్రజలను అయోమయానికి గురిచేయవద్దని హితవు పలికారు. నగరంలో లాక్‌డౌన్ విధించే ఆలోచనేదీ లేదని తేల్చి చెప్పారు.
- కాగా, కృష్ణా జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా నిన్న 230 నిర్ధారిత కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,482కు చేరుకుంది. వీరిలో ఇప్పటి వరకు 3,260 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
- 24 July 2020 9:15 AM GMT
ఇంద్రకీలాద్రి పై శ్రావణమాసం సందడి
- ఇంద్రకీలాద్రి పై శ్రావణమాసం సందడి
- తొలి శుక్రవారం కావడంతో దుర్గమ్మ దర్శనార్ధం తరలివస్తున్న భక్తులు
- అమ్మవారికి మహిళల ప్రత్యేక పూజలు
- కోవిడ్ దృష్ట్యా కొండపైన కొనసాగుతున్న ఆంక్షలు
- 24 July 2020 9:11 AM GMT
నిమ్మగడ్డ విషయంలో ఏపీ సర్కార్ కి సుప్రీం షాక్..!
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సీఎం జగన్ సర్కార్ కి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టులో కోర్టు థిక్కార పిటీషన్ పై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ పిటీషన్ ను తోసిపుచ్చింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. హైకోర్టు తీర్పు ఇచ్చినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి ఏమయింది అని ప్రశ్నించింది. గవర్నర్ సలహాలు ఇవ్వాలా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు స్టే నిరాకరించడంతో హైకోర్టులో నిమ్మగడ్డ కోర్టు థిక్కార పిటీషన్ యధావిధిగా కొనసాగనుంది. కాగా, ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ సూచించిన విషయం తెలిసిందే.
- 24 July 2020 9:08 AM GMT
ఆరోగ్యశ్రీ కార్డుల పేరిట మోసాలకు పాల్పడే అవకాశం
ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసిన నేపథ్యంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓ డాక్టర్ మల్లికార్జున్ హెచ్చరికలు చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల పేరిట మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ప్రభుత్వం మీ ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తుందని కొందరు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్ నెంబరు, ఓటీపీ అడుగుతారని, అలాంటి వారికి వివరాలు చెబితే మోసపోయే ప్రమాదం ఉంటుందని వివరించారు. అందుకే అలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇలాంటివే కొన్ని ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో కూడా దర్శనమిస్తున్నాయని, వాటితో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు ఎలాంటి సంబంధంలేదని డాక్టర్ మల్లికార్జున్ స్పష్టం చేశారు.
- 24 July 2020 4:50 AM GMT
కరోనాతో పెళ్లి వాయిదా
ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది తూర్పుగోదావరి జిల్లాలోనే. ఈ పరిస్థితుల్లో ఇక్కడ కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుంటున్నారు స్థానిక ప్రజలు. అయితే మంచి ముహూర్తం అనుకున్నారో ఏమో ఇదే జిల్లాకు చెందిన ఒక జంటకు నేడు వివాహం కానుంది. అయితే పెళ్లి హడావిడిలో అక్కడా, ఇక్కడా అనకుండా తిరిగిన పెళ్లి కొడుకు ఎందుకైనా మంచిదని పెళ్లికి ఒకరోజు ముందు అనగా గురువారం కరోనా టెస్టు చేయించుకున్నాడు.
- 24 July 2020 4:35 AM GMT
స్వీయ నిర్బంధంలోకి మాజీ ఎంపీ కవిత
నిజామాబాద్ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సెల్ఫ్ క్వారెంటైన్ లోనికి వెళ్లారు. కవిత వద్ద పనిచేసే డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ గా తేలడంతో వైద్యుల సూచనల మేరకు ఆమె హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు.
- 24 July 2020 2:58 AM GMT
ఇక మార్కెటింగ్ బలోపేతం..
వ్యవసాయం దండగ నుంచి పండగకు తీసుకొచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రైతులకు ఏటా భరోసా కింద కొంత సాయం అందింస్తున్నారు. దీంతో పాటు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి కావాల్సిన మౌలిక ఏర్పాట్లతో పాటు మరిన్ని అవసరాలకు తీర్చేందుకు చర్యలు తీసుకున్నారు.
- 24 July 2020 2:56 AM GMT
ఇక అంగన్వాడీల వంతు..
ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు నాడు- నేడు కార్యక్రమం ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం తాజాగా దీనిని అంగన్వాడీలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు వీటిలో ప్రధాన లబ్ధిదారులైన చిన్నారులతో పాటు గర్భవతులకు ప్రత్యేక పోషణకరమైన ఆహారాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
- 24 July 2020 2:55 AM GMT
ఇక నుంచి రైల్వేల్లోనూ కార్గో సేవలు..
ఏపీలో ఆర్టీసీ మాదిరిగా రైల్వేల్లేనూ కార్గో సేవలు తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. వాస్తవంగా చూస్తే రైల్వేలో ఆదాయం వచ్చేది కేవలం సరుకుల రవాణా మీదే. పాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లన్నీ కేవలం ప్రజల సౌకర్యార్ధమే. దీనిని రుజువు చేసింది లాక్ డౌన్. ఈ సమయంలో రెండు నెలల పాటు కేవలం ఒక్క పాసింజర్ రైలు తిరగకున్నా రైల్వే ఆదాయం వేల కోట్లలో ఉండేది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire