Live Updates:ఈరోజు (జూలై-23) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు గురువారం, 23 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం తదియ (సా. 6-40 వరకు) తర్వాత చవితి, మఘ నక్షత్రం (రా. 8-06 వరకు) తర్వాత పుబ్బ నక్షత్రం.. అమృత ఘడియలు ( సా. 5-47 నుంచి 7-19 వరకు), వర్జ్యం ( ఉ. 8-34 నుంచి 10-06 వరకు తె.వ. 3-40 నుంచి 5-11 వరకు) దుర్ముహూర్తం (ఉ. 9-57 నుంచి 10-48 వరకు తిరిగి మ. 3-06 నుంచి 3-58 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-33
Live Updates
- 23 July 2020 11:47 AM GMT
ఏలూరు సబ్ జైలు ను తాకిన కరోనా
- పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సబ్ జైలులో కరోనా కలకలం రేగింది.
- రేమాండ్ లో ఉన్న 13 మంది కైదీలకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.
- 70 అనుమానితులకు టెస్ట్లు నిర్వహించగా 13 మందికి పాజిటివ్ నిర్దారణ అయినట్లు ఆధికారులు వెల్లడించారు.
- దీంతో మిగితా కైదీలు ఆందోళనకు గురవుతున్నారు.
- 23 July 2020 10:24 AM GMT
తిరుపతిలో కనిపించని 236 పాజిటీవ్ పేషేంట్లు.. ఫోన్ లు స్విచ్ ఆఫ్
- తిరుపతి కరోనా పాజిటివ్ కేసుల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కరోనా స్వాబ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చాక బాధితులు ఆసుపత్రుల్లో చేరడం లేదు. స్వాబ్ టెస్ట్ కోసం శాంపిల్స్ తీసుకునే సమయంలో కొంతమంది రాంగ్ ఫోన్ నంబర్లు, తప్పుడు అడ్రస్‌ల ను ఇస్తున్నారు...టెస్ట్‌ల్లో రిపోర్ట్ పాజిటివ్ వచ్చాక వారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా రాంగ్ నంబర్ అని వస్తోంది. ఇప్పటి వరకు 236 మంది పాజిటీవ్ పేషేంట్లు కనిపించడం లేదని అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు.
- 23 July 2020 4:48 AM GMT
బీమవరం లో 24 నుండి కఠిన ఆంక్షలు
భీమవరం: భీమవరం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో తేదీ.24.7.2020 నుండి 31.7.2020 వరకు కఠిన నిబంధనలు విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాల రాజు ఒక ప్రకటనలో తెలిపారు. భీమవరం రూరల్, అర్బన్ ప్రాంతాలలో covid 19 పొజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నందున ఆయా ప్రాంతాలలో కూరగాయలు, కిరణ, మంగళవారం, గురువారం, శనివారం ఉదయం 6.00 నుండి 10. గంటల వరకు, పాలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, మెడికల్ షాపులు.
ప్రతిరోజు 50% షాపులు ఒకరోజు మిగిలిన 50% షాపులు మరొక రోజు ఉదయం 6 గంటల నుండి ఒంటి గంట వరకు ,కొన్ని ప్రాంతాలలో కొన్ని మెడికల్ షాపులు 24 గంటలు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు. పైన తెలిపిన సేవలు తప్ప మిగిలిన అన్ని రకాల కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ శ్రీ రేవు ముత్యాలరాజు ఆ ప్రకటనలో తెలిపారు.
- 23 July 2020 4:45 AM GMT
కేకే లైన్ రెండో ట్రాక్ ను పరిశీలించిన రైల్వే సేఫ్టీ కమిషనర్
విశాఖపట్నం: కేకే లైన్ లో రైల్వే సెఫ్టీ కమిషనర్ ఏకే రాయ్ పర్యటించారు. ఈ మార్గంలో రెండో లైన్ పనులను పరిశీలించారు. ఆ మార్గంలో గరిష్ఠంగా ఎంత వేగంతో రైళ్లు ప్రయాణించవచ్చో ప్రత్యక్షంగా పరిశీలించారు. సెఫ్టీ కమిషనర్ రాయ్ వెంట వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
చారు మూలకుసుమ నుంచి జైపూర్ వరకు 20.704 కిలోమీటర్ల పొడవునా రెండో ట్రాక్ ను సెఫ్టీ కమిషనర్ పరిశీలించారు. కొత్తవలస కిరండల్ లైన్ లో జరుగుతున్న పలు ట్రాకుల పనులను సెఫ్టీ కమిషనర్ బృందం నిశితంగా పరిశీలించింది.
- 23 July 2020 4:43 AM GMT
కోరుకొండలో విజిలెన్స్ దాడులు
కోరుకొండ: కోరుకొండలో విజిలెన్స్ ఎస్పీ రవికుమార్, సిఐ సత్యకుమార్ లు దాడులు నిర్వహించారు.
- ఈ సందర్భంగా కోరుకొండలో ఒక షాపుపై నిర్వహించిన తనిఖీల్లో 12,390 రూపాయల విలువైన పురుగుల మందులను వ్యత్యాసాలు గుర్తించారు. పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు.
- ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్పి రవి ప్రకాష్, సీఐ సత్య కుమార్, శాఖ సిబ్బంది, మండల వ్యవసాయ అధికారి ఏ.గౌరీదేవి హాజరయ్యారు.
- 23 July 2020 4:38 AM GMT
ఆదాయం పెంపుపై ఆర్టీసీ ప్రయత్నం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాస్త పైకి లేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రరూపం దాల్చడం వల్ల ప్రజలు ప్రయాణం చేసే పరిస్థితి ఉండకపోవడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేస్తున్నారు.
- 23 July 2020 4:07 AM GMT
భరత్ లో 12 లక్షలు దాటిన కరోనా కేసులు..
- నేడు కొత్తగా కేసులు 45,720 నమోదు.
- ప్రస్తుత కేసులతో కలిపి దేశంలో 4,26,167 యాక్టివ్ కేసులున్నాయి.
- ఇప్పటివరకు కరోనాతో పోరాడి 7,82,606 మంది డిశ్చార్జ్ అయ్యారు.
- 29,861 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
- దేసవ్యప్తంగా 29 వేలు దాటిన మరణాల్ సంఖ్యా.
- గడిచిన మూడు రోజుల్లో లక్ష కేసులు నమోదు. 1900 మంది మృతిచెందారు.
- 23 July 2020 3:59 AM GMT
ఏవోబీలో తప్పని భారీ ఎన్ కౌంటర్..
ఏవోబీ ఒక్కసారే ఉలిక్కి పడింది. ఈ నెల చివర్లో జరగనున్న అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయడానికి సమావేశమైన మట్టుబెట్టడానికి చేసిన పోలీసుల ప్రయత్నం త్రుటిలో తప్పింది. ఈ ఘటనలో చలపతి, అరుణకు గాయాలు కాగా, ఆర్కే క్షేమంగా తప్పించుకున్నట్టు అంతరంగిక సమాచరం.
- 23 July 2020 3:58 AM GMT
తెలంగాణాలోనూ కొత్త 108లు..
కరోనా తీవ్ర రూపం దాల్చడంతో దానికి ఎదుర్కొనే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. మెరుగైన వైద్యంతో పాటు వాటికి అవసరమైన మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో సుమారుగా 1,050 108, 104 వాహనాలను కొనుగోలు చేసి, విధులను గాను మండల కేంద్రాలకు పంపారు. అదే రీతిలో తెలంగాణా ప్రభుత్వం సైతం ఇప్పటివరకు ఉన్న వాహనాలతో పాటు మరో వంద వాహనాలను అదనంగా కొనుగోలు చేసి,విధుల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
- 23 July 2020 3:23 AM GMT
హైదరాబాద్ లో భారీ వర్షం!
- భారీ వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది.
- నగరంలో పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురిసింది
- బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, కోఠి, అబిడ్స్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, గాజుల రామారం, సూరారం, ముషీరాబాద్,ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, అశోక్‌నగర్, ట్యాంక్‌బండ్,నాంపల్లి, దారుసలం సహా పలు చోట్ల భారీ వర్షం పడింది.
- పలు చోట్ల భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
- లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire