Live Updates:ఈరోజు (జూలై-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు సోమవారం, 20 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం అమావాస్య (రా. 10-44 వరకు) తర్వాత శుక్లపక్ష పాడ్యమి, పునర్వసు నక్షత్రం (రా. 9-53 వరకు) తర్వాత పుష్యమి నక్షత్రం.. అమృత ఘడియలు ( రా. 7-27 నుంచి 9-04 వరకు), వర్జ్యం ( ఉ. 9-45 నుంచి 11-22 వరకు తిరిగి తె. 5-48 నుంచి) దుర్ముహూర్తం (మ.12-31 నుంచి 1-23 వరకు తిరిగి మ. 3-07 నుంచి 3-58 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-34

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 20 July 2020 2:58 AM GMT

    శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు

    కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం నాడు జలాశాయానికి మరింత వరద నీరు వచ్చి చేరింది. ఈ సీజన్‌లో ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణా అధికారులు కరెంట్ ఉత్పత్తి ప్రారంభించారు. 3 జనరేటర్ల ద్వారా 0.474 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైంది. ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి లేదు.

    శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో పీక్ లోడ్ అవర్స్‌ను బట్టి కరెంటు ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు.కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో : 77,534 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటి మట్టం : 885 అడుగులుప్రస్తుతం : 840.90 అడుగులునీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలుప్రస్తుతం : 63.1940 టిఎంసీలుగా ఉంది.



  • 20 July 2020 2:52 AM GMT

    సంజీవినిలో 10 నిమిషాల్లో ఫలితం..

    కరోనా తీవ్రరూపం దాల్చడంతో దానికి అనుగుణంగా పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రారంభంలో కేవలం రాష్ట్రంలోనే ఐదు సెంటర్లలో ఉండే పరీక్షల ల్యాబ్ లన్నింటిని జిల్లా స్థాయికి విస్తరించారు. క్రమేణా కేసులు పెరుగుతుండటం, ఫలితం ఆలస్యం అవుతుండటంతో వీటిని డివిజన్లో ఉండే సమాజిక ఆస్పత్రికి విస్తరించారు. అయితే వీటిలో సైతం ప్రారంభంలో ర్యాపిడ్ టెస్ట్ మాత్రమే చేసేవారు.

    - పూర్తి వివరాలు 

  • 20 July 2020 2:50 AM GMT

    ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్

    కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవంతో ఏపీలో పాఠశాలలు పున: ప్రారంభం మరోసారి వాయిదా పడ్డట్టే కనిపిస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరిగడంతో పాటు మరణాలు సైతం ఎక్కువగానే సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మరోసారి వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకు ఆగష్టు3 నుంచి పాఠశాలలన్నీ తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించగా, ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో దీనిపై ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది.

    - పూర్తి వివరాలు 

  • 20 July 2020 2:48 AM GMT

    సీలేరులో గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులు అరెస్టు

    సీలేరు: జెన్‌కో త‌నిఖీ కేంద్రం వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. కారును సీజ్ చేశారు. నలుగురు యువకులను అరెస్టు చేశారు. వారు తెలంగాణ రాష్ట్రం న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ మండ‌లం ఇలియాపురం, మైస‌మ్మ‌కుంట గ్రామానికి చెందిన బానోతు సైదా, తేజావ‌త్ వినోద్‌, బానోతు నాగ‌రాజు, రామావ‌త్ శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు.



  • 20 July 2020 2:42 AM GMT

    నిర్మానుష్యంగా కనిపించిన తుని ప్రధాన రహదారులు

    తుని : జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు నిర్వహించిన కర్ఫ్యూ కారణంగా తుని పట్టణ ప్రధాన రహదారులన్ని నిర్మానుష్యంగా మారాయి. ప్రజలే ప్రస్తుతం ఉన్న పరిస్థితి రీత్యా స్వచ్ఛందంగా నివాసాల్లో ఉంటూ కలిపి పూర్తి మద్దతు తెలిపారు. ప్రధాన సెంటర్ అయిన గొల్ల అప్పారావు సెంటర్ తో పాటు రామ థియేటర్ మసీద్ సెంటర్ బాలికోన్నత పాఠశాల సెంటర్ ఇలా ప్రధాన రహదారులన్ని అత్యంత నిర్మానుష్యంగా కనిపించాయి.




  • 20 July 2020 2:40 AM GMT

    ఎస్ రాయవరం మండలంలో కరోనా సోకిన 7 గురిని చికిత్సకై తరలింపు

    ఎస్ రాయవరం: మండలంలో కరోనా పాజిటివ్ నిర్దారణ జరిగిన 7 కేసులను చికిత్సకై ఆదివారం ప్రత్యేక అంబులెన్స్ లో తరలించారు. దార్లపూడి గ్రామంలోని నలుగురిని, కొరుప్రోలుకి చెందిన ఇద్దరిని, కొత్తపోలవరంకి చెందిన ఒకరిని చికిత్సకై అనకాపల్లి వద్ద రేబాక పాలిటెక్నిక్ కేంద్రం నందు ఏర్పాటుచేసిన చికిత్సా కేంద్రానికి తరలించినట్లు పెనుగొల్లు వైద్యాధికారి డా. జగదీష్ తెలిపారు. దీంతో ఆయా గ్రామాలలో పారిశుద్య పనులను చేపట్టి సమీప నివాసులకు పెనుగొల్లు పి హెచ్ సి సిబ్బంది పలు సూచనలు చేశారు.

  • ఏపీలో ఉచిత రేషన్ పంపిణీ నేటి నుంచి!
    20 July 2020 2:11 AM GMT

    ఏపీలో ఉచిత రేషన్ పంపిణీ నేటి నుంచి!

    - బియ్యం కార్డుదారులకు నేటి (సోమవారం) నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఉచిత సరుకుల పంపిణీ జరగనుంది.

    - కోవిడ్‌–19 వైరస్‌ కారణంగా ఉపాధి కోల్పోతున్న పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇప్పటికే లబ్ధిదారులకు ఏడు సార్లు ఉచితంగా సరుకులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

    - తాజాగా 8వ విడతలో భాగంగా కార్డులో పేర్లు నమోదై ఉన్న ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

    - ఈ సందర్భంగా 1.49 కోట్ల కుటుంబాలకు పైగా లబ్ధి చేకూరనుంది. 

Print Article
Next Story
More Stories