Live Updates:ఈరోజు (జూలై-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు ఆదివారం, 19 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం చతుర్దశి (రా. 11-14 వరకు) తర్వాత అమావాస్య, ఆరుద్ర నక్షత్రం (రా. 9-37 వరకు) తర్వాత పునర్వసు నక్షత్రం.. అమృత ఘడియలు ( ఉ. 11-18 నుంచి 12-57 వరకు), వర్జ్యం ( ఉ.శే.వ. 7-10 వరకు) దుర్ముహూర్తం (సా. 4-50 నుంచి 5-42 వరకు వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం ఉ.5-38 సూర్యాస్తమయం సా.6-34
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 July 2020 2:05 PM GMT
సోమ, మంగళవారాల్లో కేసీఆర్ సమీక్షలు..
గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్న జీవగడ్డ తెలంగాణ కాబట్టి, ఈ ప్రాంతానికి పుష్కలమైన నీటి వసతి కల్పించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. ఈ మేరకు రాష్ర్టంలో రెండు కీలకమైన ఇంజినీరింగ్ విభాగాల ముఖ్యులతో సీఎం రేపు, ఎల్లుండి విస్ర్తతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు.
- 19 July 2020 12:05 PM GMT
వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింట సర్వే
గొల్లప్రోలు: పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే ప్రారంభించారు. ఆశా వర్కర్లు వారికి కేటాయించిన నెలలో కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా జ్వరం, రొంప, కరోనా వైరస్ లక్షణాలు ఉంటే తక్షణం వైద్య సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే తక్షణం కరోనా వైరస్ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
- 19 July 2020 11:31 AM GMT
కాట్రేనికోనలో సంపూర్ణంగా కర్వ్యూ అమలునాని
ముమ్మిడివరం: జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ముమ్మిడివరం కాట్రేనికోనలో పోలీసులు కర్వ్యూ ను అమలు చేయడంతో రహదారులు నిర్మానుస్యంగా మారాయి. కాట్రేనికోన ఎస్.ఐ. బి.సంపత్ కుమార్ తన సిబ్బందితో ఉదయం నుంచే ప్రధాన రహదారితో పాటు ముఖ్య కూడళ్ళలో బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలు ఎవ్వరు బయటకు రాకుండా కటిన చర్యలు చేపట్టారు.
కేవలం మందుల దుకాణాలకు మాత్రమే తెరుచు కున్నాయి. మిగిలిన దుకాణాలన్ని మూతపడ్డాయి. కర్వ్యూను కఠినంగా అమలు చేయడంతో నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారి బోసిపోయింది. పదేపదే చెబుతున్నా.. కొంతమంది యువత ద్విచక్ర వాహనాలపై రోడ్డు మీదికి వస్తున్నారని అటువంటి వారిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్.ఐ. తెలిపారు.
- 19 July 2020 11:27 AM GMT
సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ
సీఎం జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో గోశాల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2005 లో గోశాల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చారు. అయితే రాష్ట్ర పునర్విభజన జరిగిన తరువాత మళ్ళీ కమిటీలు వెయ్యలేదని అన్నారు.
- 19 July 2020 9:39 AM GMT
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం తృటిలో తప్పిన పెనుప్రమాదం...
చిత్తూరు జిల్లా: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం తృటిలో తప్పిన పెనుప్రమాదం.
- బెంగళూరు నుండి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం కు ఉదయం 8:30 నిమిషాలకు రావలసిన ఇండిగో విమానం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాకుండా బెంగళూరుకు వెళ్ళింది.
- వివరాల్లోకి వెళ్తే.. విమానం ల్యాండ్ కావలసిన రన్వే పై ఫైరింజన్ బోల్తా పడడంతో పైలెట్ విమానమును రన్వే పై ల్యాండ్ చేయకుండా విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు.
- 19 July 2020 5:12 AM GMT
గుత్తి మండలం జక్కల చెరువు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.
అనంతపురం: గుత్తి మండలం జక్కల చెరువు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.
- లారీ కారు ఢీ ఒకరు మృతి ఇద్దరికీ తీవ్రగాయాలు.
- ప్రమాదంలో పెళ్లి బృంధం , క్షతగాత్రులలో పెళ్లికూతురు మెర్సీతో పాటు మరో ఒకరు.
- క్షతగాత్రులు కడపజిల్లా కొండాపురం చెందిన వారిగా గుర్తింపు.
- కర్నూలు నుండి కొండాపురం వెళ్తుండగా ఘటన...
- 19 July 2020 5:12 AM GMT
కరోనాకు మరో జర్నలిస్ట్ బలి
- కరోనా తో తిరుపతి పద్మావతికోవిడ్ ఆసుపత్రిలో చనిపోయిన కెప్టెన్ టీవీ రిపోర్టర్ జే.సుబ్రమణి
- గత పదేళ్లుగా తిరుమల కొండపై వివిధ తమిళ టీవీ ఛానెళ్లకు రిపోర్టర్ గా పని చేసిన మణి..
- నాలుగురోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో చేరిన మణి
- ఇప్పటివరకూ వారం రోజులలో కరోనాకు బలైన నలుగురు జర్నలిస్టులు
- ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో పదిమంది..జర్నలిస్టులు
- 19 July 2020 5:09 AM GMT
టీటీడీ ఈవో సింఘాల్ పదవీ కాలం పొడగింపు
తిరుపతి: టీటీడీ ఈవో సింఘాల్ పదవీ కాలం పొడగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో గా పనిచేస్తున్న అనిల్‌కుమార్ సింఘాల్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈవోగా కొనసాగాలని ఉత్తర్వులో తెలిపింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్ కమిషనర్‌గా పని చేస్తున్న సింఘాల్‌ను 2017 మేలో టిటిడి 25వ ఈవోగా డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు.
- రెండేళ్ల పాటు ఉండే ఈ పదవిలో ఏపీ ప్రభుత్వం 2019లో మరో ఏడాది డిప్యూటేషన్‌ను పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లేటెస్టుగా రెండోసారి డిప్యూటేషన్‌ను పొడిగింపు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఈవో కొనసాగాలని స్పష్టం చేసింది.
- 19 July 2020 5:08 AM GMT
తెలంగాణలో ఈ-ఆఫీస్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో మొద్దమొదటి సారిగా ఈ-ఆఫీస్ ద్వారా పాలన ప్రారంభమైంది. జవాబుదారీతనం, పరిపాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు ఈ-ఆఫీస్ విధానం అమలువైపు ప్రభుత్వశాఖలు దృష్టిసారిస్తున్నాయి.
ఈ-ఆఫీస్ పాలన తొలివిడతలో భాగంగా అబ్కారీ, మద్యనిషేధశాఖ, సాధారణ పరిపాలనశాఖ, వాణిజ్యపన్నులు, ప్రధాన కమిషనర్, భూపరిపాలనశాఖలు ఈ-ఆఫీస్ విధానాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం 1,600 మంది ఉద్యోగులు ఈ-ఆఫీస్ కొత్త విధానం ద్వారా విధులు నిర్వర్తిస్తారని సీఎస్ వివరించారు.
- 19 July 2020 4:08 AM GMT
ఐటీ రిటర్న్స్ చెల్లించే వారికి గుడ్ న్యూస్..
కరోనా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమవుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో మార్పులు చేసుకుంటోంది. ప్రతి పనికి కార్యాలయాలకు వచ్చి చేసుకునే విషయంలో కాస్త వెసులుబాటు కల్పించారు. అన్ని కార్యాలయాల మాదిరిగా ఐటీ రిటర్న్స్ దాఖాలు చేసే వారికి ఇంటి నుంచే చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire