Live Updates:ఈరోజు (జూలై-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు శనివారం, 18 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం త్రయోదశి (రా. 11-14 వరకు) తర్వాత చతుర్దశి, మృగశిర నక్షత్రం (రా. రా. 8-52 వరకు) తర్వాత ఆరుద్ర నక్షత్రం.. అమృత ఘడియలు ( ఉ. 11-36 నుంచి 1-17 వరకు), వర్జ్యం ( తె..5-31 నుంచి 07-44 వరకు తిరిగి రా. 1-29 నుంచి 3-10 వరకు) దుర్ముహూర్తం (ఉ.5-38 నుంచి 7-21 వరకు తిరిగి మ. 12-31 నుంచి 1-23 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-38 సూర్యాస్తమయం సా.6-34
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 18 July 2020 4:10 PM GMT
అమర్ నాథ్ యాత్రపై కరోనా ఎఫెక్ట్
- కరోనా కష్టంలో అమర్నాథ్ యాత్ర.
- ఈ నెల 21 నుండి దర్శనానికి శ్రీకారం.
- ఆగష్టు ౩ వరకు కొనసాగున్న అమర్నాద్ యాత్ర.
- రోజుకు ఎంతమందికి దర్శన భాగ్యం? మొత్తం ఎంత మంది భక్తులకు అనుమతి? కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన అమర్నాథ్ యాత్ర ఈ నెల 21 నుండి ప్రారంభించనున్నారు.
- ఈ యాత్రకు రోజుకు 500 మంది.. మొత్తం 10 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు.
- 18 July 2020 4:08 PM GMT
భక్తులు లేకుండా బోనాలు
- చివరి అంకానికి చేరిన ఆషాడ బోనాలు.
- పాతబస్తీ సింహవాహిని అమ్మవారికి బోనం.
- లాల్ దర్వాజా బోనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి.
- ఈ ఏడాది భక్తులు లేకుండానే బోనాలు. బోనాల పాటలు, పోతురాజుల విన్యాసాలు లేకుండానే బోనాలు ముగింపు.
- ఎప్పటి లాగే యధావిదిగా అమ్మవారి రంగం. రేపటి భావిష్యవానికి రంగం సిద్దం చేసిన అధికారులు.
- 18 July 2020 2:17 PM GMT
కన్నా లక్ష్మీనారాయణ లేఖపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఆగ్రహం
- పార్టీ వైకరికి భినంగా లేక రాయటం పై అగ్తాహం
- రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం పరిదిలోని అంశం.
- రైతులకు న్యాయం చేయటమే బీజేపీ విధానం.
- టీడీపీ లైన్లో కన్నా లేక రాసారని భావిస్తున బీజేపీ కేంద్ర నాయకత్వం.
- గవర్నర్ కి సైతం వివరణ ఇచ్చే ఆలోచనలో బీజేపీ పెద్దలు.
- 18 July 2020 2:06 PM GMT
నితిన్ పెళ్ళికి ముహుర్తం ఫిక్స్!
లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ కి సంబంధించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు, యంగ్ హీరో నిఖిల్ , జబర్దస్త్ ఆర్టిస్ట్ మహేష్ ల పెళ్లిళ్లు అయిపోయాయి. అయితే ఎప్పుడెప్పడా అని ఎదురుచూస్తున్న యంగ్ హీరో నితిన్ పెళ్లి ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 26న అతికొద్ది మంది సమక్షంలో నితిన్ తన ప్రేయసి షాలిని ని పెళ్లి చేసుకోబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి 8.30 గం.లకు ముహర్తం.
- 18 July 2020 1:15 PM GMT
ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు
- ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. శనివారం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు వచ్చాయి.
- రాష్ట్రంలో గత 24 గంటల్లో 23,872 సాంపిల్స్ ని పరీక్షించగా 3,963 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
- అలాగే 1411 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ అయ్యారు.
- కోవిడ్ వల్ల తూర్పు గోదావరి లో పన్నెండు మంది, గుంటూరు లో ఎనిమిది మంది, కృష్ణ లో ఎనిమిది మంది, అనంతపురంలో ఏడుగురు, పశ్చిమ గోదావరి లో ఐదుగురు, ప్రకాశం లో నలుగురు, నెల్లూరు లో ముగ్గురు, విశాఖపట్నం లో ఇద్దరు, చిత్తూర్ లో ఒక్కరు, కడప లో ఒక్కరు మరియు విజయనగరం లో ఒక్కరు మరణించారు.
- ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 41,714 పాజిటివ్ కేసు లకు గాను 19,223 మంది డిశ్చార్జ్ కాగా.. 586 మంది మరణించారు..
- ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 21,905 గా ఉంది.
- 18 July 2020 4:23 AM GMT
కోటికి బేరమాడి పట్టుకున్నారు..
అటవీ జంతువులను వేటాడటం, అమ్మకం చేయడం నేరం. అది ఎవరు చేసినా తప్పే. అటువంటిది శరీరంపై చిప్పలుగా ఉండే అలుగు జంతువును అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను పన్నాగంతో పట్టుకున్నారు. తామే అలుగు కొంటామని నమ్మించి కటకటాల వెనక్కు నెట్టారు.
- 18 July 2020 4:22 AM GMT
3 రోజుల పాటు ఉత్తర కోస్తాకు వర్షాలు
నైరుతి రుతువవనాల ప్రభావం వల్ల ఏపీలో కురుస్తున్న వర్షాల జోరు మరో మూడు రోజుల పాటు కొనసాగనుంది. దీనివల్ల ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావం రాష్ట్రంపై చురుగ్గా కొనసాగుతోంది.
అదేవిధంగా తూర్పు పశ్చిమ షియర్ జోన్ 3.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ.ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.18, 19, 20 తేదీల్లో ఉత్తర కోస్తా, యానాం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది.
- 18 July 2020 4:22 AM GMT
భీమిలి భూ కుంభకోణంపై సిట్..
విశాఖ భూ కుంభ కోణం... ఐదారేళ్లుగా ఎన్ని మలుపులు తిరుగుతుందో రాష్ట్ర వాసులకు తెలియని విషయం కాదు... గత ప్రభుత్వం చంద్రబాబు హాయాంలోనే దీనిపై సిట్ వేశారు. దానిని నెలల తరబడి దర్యాప్తు చేసి, నివేదిక ప్రభుత్వానికి అందజేశారు. అది ఒక పక్కకు పోయింది. మరోమారు ఇదే కుంభ కోణంపై మరో దర్యాప్తు వేసేందుకు సీఎం అంగీకరించారని చెబుతున్నారు. మరి ఇది ఏ కంచికి వెళుతుందో చూడాల్సిందే.
- 18 July 2020 4:21 AM GMT
నిమ్మగడ్డకు ఏపీ గవర్నర్ అపాయింట్మెంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ సోమవారం ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అవ్వనున్నారు. సోమవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కలవాలని గవర్నర్ ఆఫీసు నుంచి నిమ్మగడ్డను సమాచారం అందింది. దీంతో హైకోర్టు ఆదేశాలతో గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు నిమ్మగడ్డ. sec గా నిమ్మగడ్డను నియమించకపోవడం పట్ల హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
- 18 July 2020 4:19 AM GMT
ఏపీలో మ్యూటేషన్ విధానం అమలు
ఏ వ్యక్తి అయినా కొంత భూమి కొంటే దానికి సంబంధించిన హక్కు పత్రాలన్నీ ఎవరి ప్రమేయం లేకుండా తహశీల్దారు కార్యాలయం నుంచి నేరుగా అన్ని వెరిఫి కేషన్ ప్రక్రియలు పూర్తిచేసి, మీ భూమి వెబ్ పోర్టల్ నుండి ఈ పాస్ పుస్తకంతో పాటు పలు పత్రాలు పొందేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం కొత్తగా మ్యూటేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire