Live Updates:ఈరోజు (జూలై-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు గురువారం, 17 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం ద్వాదశి(రా. 10-43 వరకు) తర్వాత త్రయోదశి, రోహిణి నక్షత్రం (రా. 7-36 వరకు) తర్వాత మృగశిర నక్షత్రం.. అమృత ఘడియలు ( సా. 4-10 నుంచి 5-53వరకు), వర్జ్యం ( ఉ. 11-02 నుంచి 12-44 వరకు తిరిగి రా. 1-29 నుంచి 3-10 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-12 నుంచి 9-04 వరకు తిరిగి మ. 12-31 నుంచి 1-23 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-37 సూర్యాస్తమయం సా.6-34
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 17 July 2020 8:34 AM GMT
గుంటూరులో లాక్ డౌన్.. ఉల్లంగిస్తే చర్యలు తప్పవు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. కేసులతో పాటగా మరణాలు కూడా భారీగానే నమోదు అవుతున్నాయి. ఇక ఏపీలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
- పూర్తి వివరాలు
- 17 July 2020 8:14 AM GMT
ఏవోబీలో మరోసారి కాల్పుల మోత..
చాలాకాలం నుంచి ప్రశాంతంగా ఉన్న ఏవోబీలో మరోసారి కాల్పుల మోత వినిపిస్తోంది. దాదాపుగా ఆరేడు నెలల నుంచి కేవలం అక్కడక్కడా లొంగుబాటులే తప్ప ఎటువంటి కాల్పుల మోత లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్న గిరిజనుల్లో మరోసారి అలజడి రేగుతోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే తెలంగాణా రాష్ట్రం భద్రాద్రికి సమీపంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటు చేసుకోగా, సంఘటన గడిచిన రెండు రోజుల్లోనే ఏవోబీలో మరోసారి ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకోవడంతో భవిషత్తులో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
- 17 July 2020 5:15 AM GMT
గ్యాస్ పైప్ లైన్ తెగటంతో లీకైన గ్యాస్... స్పందించిన అధికారులు... తప్పిన పెను ప్రమాదం
నూజివీడు: స్థానిక మున్సిపాలిటీలోని బాపునగర్ వద్ద మెగా గ్యాస్ పైప్ లైన్ తెగటం వల్ల గ్యాస్ లీక్ అవ్వటంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పట్టణ ఎస్ఐ, మున్సిపల్ కమిషనర్ నేపా.వాసు బాబు తన సిబ్బంది చేరుకుని మెగా గ్యాస్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి గ్యాస్ లీక్ అవకుండా సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గ్యాస్ లీక్ కాకుండా అదుపుచేయటంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణంలో ఎంత భద్రత లేకుండా గ్యాస్ వ్యవస్థ పైప్ లైన్ వేయకూడదని నిబంధనలు ఉండా గతంలో కొన్ని చోట్ల ఘోర సంఘటన జరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేయాలని పైప్ లైన్ వేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలని మెగా గ్యాస్ పైప్ లైన్ వారికి తెలియపరచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
- 17 July 2020 5:12 AM GMT
విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలకు మెరుగైన సేవలు: ఎస్పీ విశాల్ గున్నీ
గుంటూరు: ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా జిల్లా పోలీసు శాఖ ఎప్పుడూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా గుంటూరు జిల్లా రూరల్ ఎస్పి విశాల్ గున్నీ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ రూరల్ జిల్లా పోలీసు శాఖలో ఇప్పటివరకు 63 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. వారిలో 25 మంది పూర్తిగా కోలుకోవడం సంతోషంగా ఉందన్నారు. నేడు నలుగురు కానిస్టేబుళ్లు విధులకు కూడా హాజరయ్యారన్నారు. కరోనాను లెక్కచేయకుండా ప్రజలకు అనునిత్యం సేవలు అందిస్తున్న హోంగార్డు స్థాయి నుండి అడిషనల్ ఎస్పీ స్థాయి ఉద్యోగులందరికి నా ధన్యవాదాలు తెలిపారు.
- 17 July 2020 5:08 AM GMT
జిల్లాలో లక్ష టన్నుల ఇసుక నిల్వలు: జాయింట్ కలెక్టర్
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం లక్ష టన్నుల ఇసుక నిల్వ ఉందని, దీన్ని రెండు లక్షల టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు తెలిపారు. గురువారం రాత్రి కమిషనర్ గోపాలకృష్ణ త్రివేదితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా 30 ఇసుక రీచ్ ఏర్పాటు చేసి రోజుకు 3500 ఇసుక నిల్వ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
- 17 July 2020 5:04 AM GMT
బయో టెక్నాలజీ హబ్ గా హైదరాబాద్
కరోనా వైరస్ కట్టడిలో మానవ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్-19 నివారణకు వ్యాక్సీన్ అభివృద్ధికి, చికిత్సకు ఔషధాల తయారీకి బయోటెక్నాలజీ, ఫార్మా, వైద్య రంగాల సమ్మిళిత పరిశోధనలు అత్యంతావశ్యం అని గవర్నర్ తెలిపారు. జె.ఎన్.టి.యూ. హైదరాబాద్ ఆధ్వర్యంలో మూడు రోజుల జాతీయ సదస్సు "ఫ్రాంటియర్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయో ఇంజినీరింగ్-2020 " అన్న అంశంపై ఈరోజు ప్రారంభమైంది.
- 17 July 2020 5:01 AM GMT
ఆగష్టు 17 నుంచి ఇంజనీరింగు కాలేజీలు..
కరోనా మహమ్మారి వ్యాప్తితో తాళాలు పడిన అన్ని సంస్థలను తిరిగి తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కేంద్రం ఆదేశాల మేరకు డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తాజాగా ఆగష్టు 17 నుంచి ఇంజనీరింగు తరగతులు ప్రారంభిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
- 17 July 2020 5:00 AM GMT
రూపుమారనున్న అంగన్వాడీలు
కరోనా వైరస్ మహామ్మారి ఇంకా ఎన్ని మార్పులు తీసుకొస్తుందో చెప్పలేని పరిస్థితి. దీని ప్రభావం మానవ జీవితం నుంచి ఏకంగా వ్యవస్థలను మార్చే వరకు చూపించింది. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల మాదిరిగానే అంగన్వాడీల్లో పిల్లలకు చెప్పే విధానంలో మార్పులు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారుల కోసం నిర్వహించే అంగన్వాడీ స్కూళ్లల్లో వీడియోల్లోనే ఆటలు, పాటలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
- 17 July 2020 4:59 AM GMT
మానవత్వం చాటుకున్న ఎస్ఐ
ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందంటే చాలు.. కిలో మీటరు దూరంలో ఎవ్వరూ కనిపించడం లేదు. తల్లీ, తండ్రీ, కొడుకు, కూతురు ఇలా ఎంతమంది అయిన వాళ్లయినా దగ్గరకు వెళ్లేందుకు సహాసం చేయడం లేదు. ఒక ఈ వ్యాధితో మరణిస్తే మధ్యలోనే విదిలేసి పోతున్నారు. అలాంటి పరిస్థితులున్న తరుణంలో ఓ ఎస్.ఐ తన మానవత్వాన్ని చాటుకున్నారు.
- 17 July 2020 4:58 AM GMT
కోవిద్ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: పవన్ కళ్యాణ్
కరోనా మహమ్మారి ప్రజలనే కాదు... అధికారులను సైతం బలి తీసుకుంటోంది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కబళించివేస్తోంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఇలాంటి ఘటనలపై జనసేన అధినేత వపన్ కల్యాణ్ స్పందించారు. వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ కట్టడికి ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నవారిలో కొందరు ఆ మహమ్మారి కాటుకు బలైపోతుండడం చాలా బాధ అనిపిస్తోంది. వైద్యం, పారిశుద్ధ్య, పోలీస్ శాఖలకు చెందిన వారు మృతి చెందడం మనసు కలచివేసే విషాదం.
నిన్న మొన్న తిరుపతి, అనంతపురం నగరాలలో సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా పని చేస్తున్న ఇద్దరు అధికారులు కోవిడ్ బారినపడి మరణించడం దురదృష్టకరం. అలాగే గుంటూరు జిల్లాలో సీనియర్ వైద్యాధికారితోపాటు, రాష్ట్రంలో ముగ్గురు యువ వైద్య విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడి కన్నుమూయడం దిగ్భ్రాంతికరం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire