Live Updates:ఈరోజు (జూలై-14) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు మంగళవారం, 14 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం నవమి(సా. 6-33 వరకు) తర్వాత దశమి, అశ్వని నక్షత్రం (మ.01-20 వరకు) తర్వాత భరణి నక్షత్రం.. అమృత ఘడియలు (తే . 4-21 నుంచి ఉ. 7-08 వరకు), వర్జ్యం (ఉ. 8-54 నుంచి 10-40 వరకు, తిరిగి రాత్రి 11-54 నుంచి 1-40 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-11 నుంచి 9-03 వరకు రా. 10-58 నుంచి 11-42 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 14 July 2020 7:55 AM GMT
గాంధీ హాస్పిటల్ లో సిబ్బంది మళ్లీ సమ్మె సైరన్
- గాంధీ హాస్పిటల్ లో సిబ్బంది మళ్లీ సమ్మె సైరన్.
- విధులు బహిష్కరించానున్న 620 సిబ్బంది.
- ఆందోళనలో నలుగు యునియన్ లకు చెందిన ఉద్యోగులు.
- ఫోర్త్ క్లాసు ఎంప్లాయిస్ - 220 మంది సిబ్బంది.
- శానిటేషన్ సిబ్బంది - 220.
- పేషెంట్ కేర్ సిబ్బంది - 100.
- సెక్యూరిటీ సిబ్బంది 100 మంది.
- నాలుగో రోజుకు చేరుకున్న కాంట్రాక్టు నుర్సుల సమ్మె.
- 14 July 2020 6:29 AM GMT
విశాఖ ఘటనపై స్పందించిన మంత్రి గౌతంరెడ్డి
విశాఖపట్నం: విశాఖ రాంకీ ఫార్మాసిటీలోని ‘విశాఖ సాల్వెంట్స్’ సంస్థలో సోమవారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. పేలుడుకు గల కారణాలను జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌ను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాదం జరిగిన సమయంలో సంస్థలో నలుగురు సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. తీవ్రంగా గాయపడిన మల్లేశ్వరరావును రాత్రి 12 గంటల సమయంలో గాజువాకలోని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
- 14 July 2020 4:56 AM GMT
విశాఖలో మరింత అభివృద్ది..
ఇప్పటికే అభివృద్ది వైపు పరుగులు తీస్తున్న విశాఖపట్నం మరింత విస్తరించేందుకు పరిస్తితులు అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా ఏపీ ప్రభుత్వం విశాఖను క్యాపిటల్ గా చేయడంతో మరిన్ని పరిశ్రమలతో పాటు మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం విశాఖ నౌకాశ్రయాన్ని మరింత విస్తరించే దిశగా ఏర్పాట్లు చేస్తుండటం దానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడం చేస్తుండటంతో మరో అడుగు ముందుకు పడినట్టు తెలుస్తోంది.
- 14 July 2020 4:54 AM GMT
ఏపీలో మరో తొమ్మిది ఏకలవ్య పాఠశాలలు..
గిరిజనులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్రం తీసుకున్న చర్యల్లో భాగంగా కొత్తగా ఏపీలో మరో తొమ్మిది ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆరు నుంచి ప్రారంభమై క్రమేపీ జూనియర్ కళాశాలలుగా మార్చేందుకు ప్రణాళికలు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసే వాటికి అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది.
- 14 July 2020 4:53 AM GMT
నేటి నుంచి కృష్ణమ్మ తెలుగు రాష్ట్రాల్లోకి..
పశ్చిమ కనుమల్లో వర్షం ప్రభావం వల్ల కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీనివల్ల ఆల్మట్టి నుంచి నారాయణపూర్, అక్కడ విడుదలైన నీరు నేటి నుంచి తెలుగు రాష్ర్టాల్లోకి చేరనుంది. తొలుతగా తెలంగాణలోని జూరాలకు చేరి, అక్కణ్ణుంచి దిగువ ప్రాజెక్టులకు వెళ్ల నుంది.
- 14 July 2020 4:52 AM GMT
రెగ్యులర్ మాదిరిగానే కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు..
ఎవరైనా ఒకే పని చేస్తున్నారు.. రెగ్యులర్, పర్మినెంట్ అనే తేడా లేదు... అక్కడ లేని తేడా చెల్లింపుల్లో ఎందుకంటూ ఏపీ సీఎం జగన్ చెప్పిన విధంగా వేతనాలు సకాలంలో చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. గత ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే ముందు మినిమం టైం స్కేలు పై హడావిడిగా జారీ చేసిన జీవో ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు.
- 14 July 2020 4:49 AM GMT
ఆటో బైక్ ఢీ పలువురికి గాయాలు
- పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు లో రోడ్డు ప్రమాదం
- అనిగండ్లపాడు నుంచి పెనుగంచిపోలు వస్తుండగా. ప్రమాదం
- బైక్ పై వస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు
- 108. ద్వారా పెనుగంచిప్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- 14 July 2020 4:41 AM GMT
విశాఖ ఫార్మా సిటీ ప్రమాదంలో ఒకరి మృతి?
- సాల్వెంట్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
- ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్న మల్లేష్ ,మనోజ్ ,శ్రీనివాస్ సెక్యూరిటీ చిన్నారావు
- ఒక డెడ్ బాడీ గుర్తించినట్లు సమాచారం
- మంటలు ఎలా చెలరేగాయొ తెలియదంటున్న పోలీసులు.
- తమ వాళ్ళు మిస్ అయ్యారంటూ కొన్ని కుటుంబాలు ఆందోళన .
- భారీ అగ్ని ప్రమాదం పై ప్రభుత్వం కమిటీ
- విశాఖపట్నం లొ రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది
- 14 July 2020 3:12 AM GMT
మరో రెండు రోజుల పాటు వర్షాలు..
- నైరుతి రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై చూపుతోంది.
- వీటి వల్ల ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరో రెండు, మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
- అయితే ఈ వర్షాల వల్ల ఖరీప్ సీజను సంబంధించి రైతులు నారు మళ్లను సిద్ధం చేసుకుని, విత్తనాలు చల్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
- కరోనా వైరస్ వ్యాప్తి విషయానికొస్తే చల్లని వాతావరణం దీని వైరస్ వ్యాప్తికి అనుకూలమని పలువురు చెబుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
- 14 July 2020 3:10 AM GMT
విశాఖలో మరోసారి గ్యాస్ కలకలం..
- విశాఖ మరోసారి ఉలిక్కి పడిందనే చెప్పాలి.
- వరుస గ్యాస్ లీక్ ఘటనలతో హడలి పోతున్న జనానికి పరవాడ ఫార్మా సిటీలో ఒక పరిశ్రమలో ఒకేసారి మంటలు ఎగిసి పడటంతో విశాఖ వాసులంతా ఉలిక్కి పడ్డారు.
- మరోసారి ఎక్కడకు పరుగులు తీయాలిరా బాబూ అంటూ గగ్గోలు పెట్టారు.
- అయితే అదే సమయంలో భారీగా వర్షం కురుస్తుండటంతో మంటలు అదుపులోకి వచ్చాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire