Live Updates:ఈరోజు (జూలై-11) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు శనివారం, 11 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం షష్ఠి(ఉ. 12-44 వరకు) తదుపరి సప్తమి, పూర్వాభాద్ర నక్షత్రం (ఉ.5-42వరకు) తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం.. అమృత ఘడియలు (మ.2-51 నుంచి 4-37 వరకు), వర్జ్యం (సా.4-16 నుంచి 6-02 వరకు) దుర్ముహూర్తం (ఉ. 5-36 నుంచి 7-19 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 11 July 2020 6:53 PM GMT
ప్రకాశం బ్యారేజీ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల..
విజయవాడ:
◆1450 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల..
◆ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం.
◆మున్నేరు వాగు నుంచి ప్రకాశం బ్యారేజీకి 11,500 క్యూసెక్కుల వరద ప్రవాహం..
బ్యారేజీ గేట్లు తెరవడంతో దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు..
- 11 July 2020 6:43 PM GMT
అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్
- బాలీవుడ్ నటుడు.. బిగ్ బీ అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
- కొద్ది సేపటి క్రితమే అమితాబ్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ముంబాయిలోని నానావతి హాస్పిటల్ లో చేరారు.
- ఈ క్రమంలో అమితాబ్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.
- అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- 11 July 2020 11:23 AM GMT
మీ ఇంటి వద్ద నుంచే కరోనా టెస్ట్ లకు నమోదు చేయించుకోవచ్చు.. ఏపీ ప్రభుత్వ వినూత్న కార్యక్రమం
- కరోనాను కట్టడి చెయ్యడానికి పరీక్షల విషయంలో ఇప్పటికే ముందు వరుసలో ఉన్న ఏపీ సర్కార్..కోవిడ్-19 ట్రీట్మెంట్ ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.
- కరోనాకు వైద్యం అదించే హాస్పిటల్స్ ను మానిటరింగ్ కోసం ఐఏఎస్ ఆఫిసర్ రాజమౌళిని నియమించింది.
- అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టులు చేయడాన్ని మరింత సులభతరం చేసింది.
-. ఎవరైనా కరోనా టెస్ట్ చేయించుకోవాలనుకుంటే ఇంట్లోనే కూర్చొని అధికారులకు చెబితే చాలు.
-. దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది శనివారం ఓ ట్వీట్ చేశారు. దాని ప్రకారం
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా కోవిడ్-19 చేయించుకోవాలి అనుకుంటే.. (https://covid-andhrapradesh.verahealthcare.com/person/register ) క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలు. అధికారులు వారిని సంప్రదించి వారికీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరైనా కరోనా టెస్టు చేయించుకోవాలి అనుకుంటే....
— Gopal Krishna Dwivedi (@gkd600) July 11, 2020
ఈ లింక్ ఓపెన్ చేసి.....
మీ వివరాలు నమోదు చేసుకోండి....
సంబంధిత అధికారులు మిమ్మల్ని సంప్రదిస్తారు......https://t.co/80NQxSFLZD - 11 July 2020 11:11 AM GMT
ప్రగతి భవన్ కు సీఎం కేసీఆర్
- చాల రోజుల తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు వచ్చారు.
- గత రెండు వారాలుగా ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్ ఈరోజు కొద్ది సేపటి క్రితం ప్రగతి భవన్ కు వచ్చారు.
- అభివృద్ధి పనులపై, కరోనా పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
- రైతులతో జరపాలనుకుంటున్న సమావేశానికి సంబంధించి ఒక నిర్ణయం ఈరోజు తీసుకోవచ్చని చెబుతున్నారు.
- 11 July 2020 7:07 AM GMT
ఇన్ స్పెక్టర్ శంకరయ్య విషయంలో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు
- లంచం తీసుకుంటూ ఏసీబీకి ట్రాప్ అయిన శంకరయ్య కు పాత నేరస్తుల తో సంబంధాలు
- రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన చిగురిపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు కి
- పలు రకాలు గా సహాయం చేసినట్లు శంకరయ్య పై ఆరోపణలు
- జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డి కి సహరికించిన ఇన్ స్పెక్టర్
- జయరాం, శిఖా రెడ్డి కాల్ రికార్డ్ లు చేసేందుకు నిందితుడికి సహకారం
- దుండిగల్ ఇన్ స్పెక్టర్ గా ఉన్న సమయంలో రాకేష్ రెడ్డి తో కలిసి ల్యాండ్ సెటిల్ మెంట్లు
- ఇన్ స్పెక్టర్ శంకరయ్య కేసులో కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు
- ఇప్పటికే బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం 40 కోట్లు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ
- 11 July 2020 7:05 AM GMT
పెళ్లి చేసుకున్న యువతి పై కుటుంబ సభ్యుల దాడి..
- నిర్మల్ జిల్లా బాసర మండలం కౌట గ్రామంలో ప్రేమ. పెళ్లి చేసుకున్న యువతి పై కుటుంబ సభ్యుల దాడి..
- యువతి మంజుశాకు తీవ్ర గాయాలు
- బైంసా అసుపత్రికి తరలింపు
- కదంరాజును ప్రేమించి పెళ్లి చేసుకున్నా మంజుశా
- 11 July 2020 7:01 AM GMT
హెచ్ఎంటివి ఇంపాక్ట్...
విజయనగరం: హెచ్ఎంటివి ఈతమానువలస 15 మంది గ్రామ బహిష్కరణ కధనానికి స్పందించిన సాలూరు మెజిస్ట్రేట్, మండల అధికారులు.
- పాచిపెంట మండలం ఈతమానువలసలో గ్రామ బహిష్కరణ చేసిన 15 మందిని గ్రామంలోకి తీసుకెళ్ళి హోమ్ క్వరంటేన్ చేసిన అధికారులు.
- కరోనా పాజిటివ్ కాంటాక్ట్ వ్యక్తులనే నెపంతో మూడు రోజుల క్రితం గ్రామం నుండి బయటకు పంపించేసి ఊరు చివరన వదిలేసిన గ్రామస్తులు.
- ఘటనపై మండిపడ్డ సాలూరు మెజిస్ట్రేట్
- పాచిపెంట రెవిన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మెజిస్ట్రేట్.
- కరోనా పాజిటివ్ కాంటాక్ట్ వ్యక్తులపై వివక్ష చూపకూడదని గ్రామస్తులకు చూచన.
- 15 మంది కుటుంబ సభ్యులను ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశం.
- 11 July 2020 6:58 AM GMT
వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్ఆకస్మిక దాడులు
- లాక్ డౌన్ లో ఆక్సిజన్ సిలిండర్ల అమ్నుతున్న మోసగాళ్లు..
- అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్ అమ్ముతున్న ముఠాలు..
- హైదరాబాదులోని 2 ముఠా ల పై దాడి చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్..
- 34 ఆక్సిజన్ సిలిండర్ స్వాధీనం..
- అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్ అమ్ముతున్న ముఠా..
- ఒక్కొక్క సిలిండర్ కు లక్షల రూపాయల ను వసూలు చేస్తున్న ముఠా.
- సిలిండర్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి అప్పగించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ..
- సిలిండర్ల అమ్మకాల పై దృష్టి సారించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్.
- ఎవరైనా అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు చర్యలు తప్పవు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ..
- 11 July 2020 6:49 AM GMT
. భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్.
ఢిల్లీ: హెల్త్ బులిటెన్
(కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ)
. 8 లక్షల దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.
• గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 519 మంది మృతి
• దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916
• దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 2,83,407
• “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,15,385
• “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123
గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,82,511 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు
ఇప్పటి వరకు దేశంలో 1,13,07,002 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు.
- 11 July 2020 6:36 AM GMT
ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఈనెల 15న
- ఆంధ్ర ప్రదేశ్:ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది.
- సచివాలయం ఫస్ట్ బ్లాక్‌లో ఈ నెల 15న ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.
- పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో మంత్రివర్గం చర్చించనుంది.
- పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
- ఇప్పటికే కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.
- ఈ నెల 13 సాయంత్రం నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని స్పష్టం చేశారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire