Live Updates:ఈరోజు (జూలై-10) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్,...
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు శుక్రవారం, 10 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, కృష్ణపక్షం, పంచమి (ఉ.11:37 వరకు), పూర్వాభాద్ర నక్షత్రం (తె.05:33 వరకు) సూర్యోదయం 5:48am,సూర్యాస్తమయం 6:54pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 10 July 2020 2:22 PM GMT
కృష్ణా జిల్లాలో ముగ్గురికి పాము కాటు
కృష్ణాజిల్లా: పామర్రు నియోజకవర్గం మొవ్వ మండల పరిధిలోని ముగ్గురు రైతులకు పాముకాటు...
- తోట్లవల్లూరు మండలానికి చెందిన గోళ్ళ. చింతయ్య(35), మరియమ్మ, చింతయ్యలు వారి పొలాల్లో పనిచేస్తుండగా కాటు వేసిన రక్త పింజరి పాము...
- దగ్గరలోని నాటు వైద్యుని ఆశ్రయించిన భాదితులు...
- పరిస్థితి విషమించడంతో మొవ్వ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి న గ్రామస్థులు...
- వైద్యులు శొంఠి.శివరామకృష్ణ సరైన వైద్యం అందించడంతో తప్పిన ప్రమాదం...
- 10 July 2020 11:47 AM GMT
వైద్య విద్య చివరి సంవత్సరం పరీక్షలకు సిద్ధం కావాలి
విశాఖపట్నం: వైద్య విద్య చివరి సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ తెలిపింది.
- పరీక్షల కోసం విద్యార్థులు సిద్ధం కావాలని విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ సూచించారు.
- ఇవి అన్లైన్లో కాకుండా పేపర్లతోనే ఉంటాయన్నారు. ఒక పరీక్ష హాల్లో కేవలం 20 మందికి మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
- 10 July 2020 11:44 AM GMT
నాన్ బల్క్ కార్గోపై ప్రత్యేక దృష్టి పెట్టిన భారతీయ రైల్వే
విశాఖపట్నం: నాన్ బల్క్ కార్గోపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన రైల్వే రాయితీలు ఇస్తోంది.
- ఈ రంగంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా బిజినెస్ మోడల్ అభివృద్ధి చేస్తోంది.
- ఇందుకోసం వ్యాపార వర్గాలు, వివిధ అసోసియేషన్ సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరింది.
- ఆపరేషన్స్ మేనేజర్ పేరిట డివిజన్ స్థాయిలో ఇందుకోసం ప్రత్యేకంగా అధికార యంత్రాంగానికి బాధ్యత అప్పగించింది.
- వాల్తేరు డివిజన్లో ఈ రకమైన వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ ఏర్పాటు చేశారు.
- 10 July 2020 11:29 AM GMT
కోరుకొండలో కంటైన్మెంట్ జోన్ తొలగింపు
కోరుకొండ: మండల కేంద్రమైన కోరుకొండ గ్రామం ఫ్రీ జోన్ అయ్యింది.
- కోరుకొండలో గత నెల 26వ తేదీన కరోనా కేసు నమోదు కావడంతో పోలీస్ స్టేషన్ వెనుక భాగాన కంటోన్మెంట్ జోన్ గా గుర్తించి ఆ ప్రాంతాన్ని ఎవరు సందర్శించకుండా చర్యలు తీసుకున్నారు.
- కరోనా సోకిన వ్యక్తికి వ్యాధి తగ్గి నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఈ ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా వెల్లడించినట్లు మండల వైద్యాధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రవిచంద్ర తెలియజేశారు.
- దీంతో ఆ ప్రాంతానికి అడ్డుగా వేసిన కంచెను తొలగించి యధావిధిగా స్థానికులు తిరిగేందుకు వీలు కల్పించారు.
- 10 July 2020 11:20 AM GMT
శాకాంబరీగా దారలమ్మ దర్శనం
తుని: ఆదివాసీల ఆరాధ్య దేవతగా తుని పట్టణ శివారు గేడ్లబీడు ప్రాంతంలో విరాజిల్లుతున్న శ్రీ ధరాల్లమ్మ తల్లి అమ్మవారు ఆషాడమాస శుక్రవారం సందర్భంగా శాఖాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
- ఆలయ ధర్మకర్త రంగోలి సత్తిబాబు రాజేశ్వరి దంపతులు అమ్మవారిని పలు రకాల కూరగాయలతో అందంగా అలంకరించారు.
- ఆపై అర్చకులు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి హారతులు అందజేశారు.
- భక్తులు సామాజిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు.
- 10 July 2020 11:16 AM GMT
ఆటో డ్రైవర్లు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి
కడప: నగరంలో ఉన్న ఆటో యూనియన్లకు ట్రాఫిక్ సీఐ శ్రీధర్ నాయుడు కోవిడ్19 పరంగా తగు జాగ్రత్తలను సూచిస్తూ సమావేశం ఏర్పాటు చేశారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో తిరుగు త్రీ వీల్ ఆటో నందు ఇద్దరు, పెద్ద ఆటో నందు నలుగురు మించి ఉండరాదని, అలాగే ప్రతిఒక్కరు మాస్క్ దరించాలని తెలిపారు.
- పాటించని వారిమీద జిల్లా ఎస్పీ ఉత్తర్యుల మేరకు భారీ జరిమానాలు మరియు ఆటో సీజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
- 10 July 2020 11:14 AM GMT
టీటీడీ ఈ దర్శన్ కౌంటర్లను తిరిగి పునరుద్ధరించాలి
కడప: నగరంలోని ప్రెస్ క్లబ్ నందు గోవింద మాల గురు స్వామి శివరామి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
- 2004లో రాజశేఖర్ రెడ్డి టీటీడీ ఈ దర్శన్ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని,నేడు జగన్ మోహన్ రెడ్డి ఈ దర్శన్ కౌంటర్ లను రద్దు చేయడం చాలా దారుణమని పేర్కొన్నారు.
- ఎన్నికల ప్రచారంలో తండ్రి పెట్టిన మంచి పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారుని, మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తిగా ఈ దర్శన్ కౌంటర్లను కొనసాగిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు.
- జిల్లాలో 4 ఈ దర్శన్ కౌంటర్ల ఉన్నాయని,ఈ నాలుగు కౌంటర్లను పునరుద్ధరించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూదాలని తెలిపారు.
- అంతేకాకుండా ఈ దర్శన్ కౌంటర్ లో పని చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, కుల, మత, బేధాభిప్రాయాలు లేని మీ పాలనలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదని ఆశిస్తున్నామని తెలిపారు.
- 10 July 2020 11:12 AM GMT
కరోనా తో ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ మృతి
కడప : నగరంలో విధులు నిర్వహిస్తున్న ఎఅర్ పొలీస్ హెడ్ కానిస్టేబుల్ కారోనా తో మృతి చెందారు.
- మూడు రొజుల క్రితం అనారోగ్యానికి గురవ్వడంతొ తిరుపతి పద్మావతి అసుపత్రికి తరలించారు.
- పరిస్దితి విషమించి ఈరోజు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
- జిల్లా పోలీస్ శాఖ కో-అపరేటివ్ సొసైటిలొ విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
- ఈ సంఘటన పై జిల్లా పోలీసు అదికారుల సంఘం సంతాపం తెలిపారు.
- 10 July 2020 11:08 AM GMT
అందరి సహకారంతోనే కరోనా వైరస్ నియంత్రణ: ఎమ్మెల్యే ఆర్కే రోజా
నగరి: అందరి సహకారంతోనే కరోనా వైరస్ నియంత్రణ చేయగలమని ఏపీఐఐసి చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు.
- పార్టీ కార్యాలయంలో రిలయన్స్ స్వచ్ఛంద సంస్థ తిరుపతి వారు నిర్వహించిన ఉచిత జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రస్తుతం పరిస్థితుల్లో ఎనర్జీ డ్రింక్ అందించడానికి ముందుకు వచ్చిన రిలయన్స్ స్వచ్ఛంద సంస్థకు ప్రశంసలు అందజేశారు.
- 10 వేల జూస్ ప్యాకెట్లను వారు అందజేశారని వాటిని ఫ్రంట్లైన్ కార్మికులు పారిశుద్ధ్య సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది, పోలీసులకు అందిస్తామన్నారు.
- 10 July 2020 10:44 AM GMT
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని కోవిడ్ ఐసీయు వార్డును పరిశీలించిన జిల్లా కలెక్టర్
అనంతపురం: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లోని కోవిడ్ ఐసియు వార్డును జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు.
- అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్యతో కలిసి కోవిడ్ ఐ సి యు వార్డులో కరోనా బాధితులకు వైద్య చికిత్సలు అందించడానికి ఏర్పాటుచేసిన లెవెల్ 1,2,3 వార్డులలోని బెడ్ లను పరిశీలించారు.
- ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ వ్యాధి తీవ్రతను బట్టి లెవెల్ 1,2,3 వార్డులను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ కు తెలిపారు.
- లెవెల్ 1 నందు ఐ సి యు సౌకర్యంతో తొమ్మిది బెడ్ ను ఏర్పాటు చేశామన్నారు.
- ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, ఇతర వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire