Live Updates:ఈరోజు (జూలై-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూలై-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు గురువారం, 09 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, కృష్ణపక్షం, చవితి (ఉ.10:10 వరకు), శతభిష నక్షత్రం (తె.03:09 వరకు) సూర్యోదయం 5:48am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు



Show Full Article

Live Updates

  • తూర్పుగోదావరిలో నాటు సారా స్వాధీనం
    9 July 2020 3:48 PM GMT

    తూర్పుగోదావరిలో నాటు సారా స్వాధీనం

    -  తూర్పుగోదావరి జిల్లా ఏటపాక మండలం లక్ష్మీపురం వద్ద140 లీటర్ల నాటు సారా స్వాధీనం.

    - చింతూరు మండలం పేగ నుండి ఏటపాక మండలం తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్న ఏటపాక పోలీసులు.

    - ఐదుగురు వ్యక్తులు అరెస్ట్.

    - మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం..

  • ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ హోంగార్డుపై దాడి
    9 July 2020 3:47 PM GMT

    ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ హోంగార్డుపై దాడి

     - ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ హోంగార్డు కిరణ్ పై దాడికి యత్నించిన యువకులు ...

    - ట్రాఫిక్ విధుల్లో భాగంగా రాంగ్ రూట్ లో వచ్చిన యువకులను ఫోటో తీసిన హోం గార్డ్ కిరణ్...

    - హోంగార్డు పై దాడి చేసే సమయంలో యవకులు ప్రశ్నించేందుకు ట్రాఫిక్ ఎస్ఐ శేఖర్ అసభ్యకర పదజాలంతో ద్వేషించిన యువకులు...

    - ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యం థియేటర్ వద్ద విధులకు ఆటంకం కలిగించి దాడికి యత్నించిన ముగ్గురు...

    - ఆ యువకులపై ఫిర్యాదు చేసిన ట్రాఫిక్ ఎస్ఐ, కేసు నమోదు ..

  • అనంతపురంలో  కలెక్టర్  సీరియస్.
    9 July 2020 3:45 PM GMT

    అనంతపురంలో కలెక్టర్ సీరియస్.

    - అనంతపురం: ఉరవకొండలో పడిపోయిన మహిళ ఘటన పై కలెక్టర్ గంధం చంద్రుడు సీరియస్.

    - తక్షణమే వైద్య సేవలు అందేలా ఆదేశాలు.

    - జాయింట్ కలెక్టెట్ సిరి ఆధ్వర్యంలో బాదితురాలికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు.

    - అనంతపురం సర్వజన ఆసుపత్రి లో చికిత్స.

    - కనేకల్ మండలం హనుమపురానికి మహిళ జూన్ 27న కోవిడ్ లక్షణాలతో చేరిన ఆమె

    - జూలై 8న డిశ్చార్జ్ అయ్యింది: జాయింట్ కలెక్టర్ సిరి.

    - డిశ్చార్జ్ సమయంలో అంబులెన్స్ లో తరలిస్తామని చెప్పగా ఆమె నిరాకరించింది: సిరి, జాయింట్ కలెక్టర్. బంధువు ఇంటికి ఆటోలో వెళ్తున్నట్లు చెప్పింది: సిరి జాయింట్ కలెక్టర్.

    - బాధితురాలు టి.బి పేషెంట్ కావడంతో ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు: సిరి జాయింట్ కలెక్టర్.

  • ఎవరిది పైచాచిక ఆనందమో తేల్చుకుందాం: ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
    9 July 2020 3:44 PM GMT

    ఎవరిది పైచాచిక ఆనందమో తేల్చుకుందాం: ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

    @ మాజీ ఎమ్యెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

    - మంత్రులకు ఛాలెంజ్.. ఎవరిది పైచాచిక ఆనందమో తేల్చుకుందాం..

    - కరోనో విషయంలో కాంగ్రెస్ అబద్దాలు అడుతుందని, పైచాచిక ఆనందం పొందుతుందని కేటీఆర్, ఈటెల అనడం సరికాదు.

    - బాధ్యత గల మంత్రులు బాధ్యతలు విస్మరించి అబద్దాలు ఆడుతూ ప్రజలను అవమాన పరుస్తున్నారు.

    - కరోన తో జనం పిట్టల్లా రాలుతుంటే మొక్కలు నాటుతూ, సచివాలయం కూలగొడుతున్నారు. ఎవరిది పైచాచికం..

    - నిన్న 1920 కరోనో కేసులు వచ్చినట్టు, 11 మంది చనిపోయినట్టు ప్రకటించారు కదా.. వారి పేర్లు ప్రకటించండి, నేను ఇద్దరు మంత్రులకు ఓపెన్ ఛాలెంజ్ ఎక్కువ ఉన్నట్టు నిరూపిస్తా..

    - కరోనో బాధితులు, మృతుల వివరాలు పేర్లతో సహా బయటపెట్టండి.. ఎవరివి అబద్ధాలో తేల్చుకుందాం.

    - మీవి అబద్దాలని తేల్చకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటా..

    - మీరు సిద్ధమా.

    - మీరు కరోనితో జనం చనిపోతుంటే నివారించడంలో విఫలం అయ్యి పైచాచిక ఆనందం పొందుతు, అబద్దాలు ప్రచారం చేస్తున్నారు..

    - కరోనో బాధితులు, మృతుల వివరాలు పచ్చి అబద్ధం.. అన్ని దొంగ లెక్కలు..

    - ఈ రోజు అయిన కరోనో లెక్కలు, మృతుల వివరాలు పేర్లతో సహా ప్రకటించండి. నేను మీరు చెప్పిన లెక్కలు అబద్దాలు అని సాక్షాలతో సహా నిరూపిస్తా..

    - బాధ్యత గల ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటుంది 

  • సెక్రటేరియట్‌లోని మసీదులు, ఆలయాన్ని కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ
    9 July 2020 3:42 PM GMT

    సెక్రటేరియట్‌లోని మసీదులు, ఆలయాన్ని కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ

    - టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని ఉల్లంఘించడం మరియు బహిరంగంగా ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు

    - గతంలో మేము ఈ సమస్యను లేవనెత్తినప్పుడు, కొంతమంది మంత్రులు రెండు మసీదులు మరియు ఒక ఆలయం ప్రస్తుత నిర్మాణాలను కూల్చకుండా సచివాలయం నిర్మించుకుంటాం అని హామీ ఇచ్చారు.

    - చారిత్రాత్మక ప్రాంగణంలో ఉన్న రెండు చారిత్రాత్మక మసీదులు మరియు ఆలయాన్ని రక్షించమని కోరుతూ 2019 జూన్ 27 న ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశాను.

    - మేము ఆధునిక సెక్రటేరియట్ కలిగి ఉండటానికి వ్యతిరేకం కాదునిసిఎం కెసిఆర్‌కు చాలాసార్లు స్పష్టంగా చెప్పాము,

    - ప్రస్తుత కరోనా సమయంలో నిర్మాణ చేయటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము.

    - మసీదులను కూల్చివేయలేదని కొందరు టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు సరికాదు.

    - సెక్రటేరియట్ ప్రాంగణంలో మసీదులు మరియు దేవాలయాల ప్రస్తుత స్థితిని చూపించే వీడియో ఫుటేజీని జిహెచ్ఎంసి కమిషనర్ విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు

    - సిఎం కెసిఆర్ వారి ప్రార్థనా స్థలాలను కూల్చివేసి అన్ని వర్గాల మత మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు.

    - టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరాధన స్థలాల నిబంధనలను కూడా ఉల్లంఘించింది.

    - సిఎం కెసిఆర్‌కు చట్టం లేదా రాజ్యాంగం పట్ల గౌరవం లేదు మరియు కెసిఆర్ చాలా సందర్భాల్లో కేంద్ర చట్టాలను బహిరంగంగా ఉల్లంఘించాడు.

    - సుప్రీంకోర్టు మరో స్టేను ఎక్కడ ఇస్తుందో అని మాత్రమే అతను సచివాలయాన్ని కూల్చివేసాడు

    - కెసిఆర్ యొక్క మూఢ నమ్మకాలు తప్ప, మరే ఇతర మతం లేదా ప్రార్థనా స్థలాలకు టిఆర్ఎస్ పాలనలో తగిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదు

  • అందరూ స్ఫూర్తి పొందేలా  అంబేద్కర్ విగ్రహం  ఏర్పాటు: ఆదిమూలపు సురేష్ మంత్రి
    9 July 2020 3:38 PM GMT

    అందరూ స్ఫూర్తి పొందేలా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు: ఆదిమూలపు సురేష్ మంత్రి

    అమరావతి:విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు..

    - సీఎం జగన్ నిర్ణయంతో దళిత జాతి శిరస్సు వంచి నమస్కరిస్తుంది.

    - దళితుల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువెళ్లారు..

    - అంబేద్కర్ విగ్రహన్ని చూసి అందరూ స్ఫూర్తి పొందేలా ఏర్పాటు చేస్తున్నారు..

    - అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో టీడీపీ నానాయాగి చేస్తుంది..

    - ఊరు చివర అంబేద్కర్ విగ్రహం ఉండాలని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు..

    - చంద్రబాబు దళితులను అనేక సార్లు అవమానించారు..

    - ఎస్సిలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు మాట్లాడారు....

    - మీకెదుకురా రాజకీయాలు అంటూ దళితులను చింతమనేని హేళన చేశారు..

    - 125 అడుగులతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఆయనకు ఘనంగా నివాళ్ళు అర్పించిన ట్లు అవుతుంది..

    - విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం చంద్రబాబు ఇష్టం ఉందా లేదా సమాధానం చెప్పాలి..

    - కాల్ మనీ సెక్స్ రాకెట్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అంబేద్కర్ విగ్రహం అంటూ ప్రకటన చేశారు...

    - నాలుగేళ్లుగా ఎందుకు అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు..

    - రాజధానిని గ్రాఫిక్స్ లో చూపినట్లే అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు గ్రాఫిక్స్ లో చూపించారు..

    - అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో పెడితే దళితులకు గౌరవం ఇచ్చినట్లు అవుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు..

    - ఊరికి చివరన ఎవరికి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చంద్రబాబు చూశారు..

    - రెండు వేల కోట్ల విలువ చేసే స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు..

    - రానున్న రోజుల్లో స్వరాజ్య మైదానం పర్యాటక స్థలంగా మారుతుంది..

    - రానున్న రోజుల్లో విజయవాడ నగరం ప్రపంచ పటంలోకి ఎక్కుతుంది..

    - చంద్రబాబుకు విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు..

    - ఏడాది కాలంలో దళితులకు జరిగిన సంక్షేమంపై టీడీపీతో బహిరంగ చర్చకు సిద్ధం..

    - దళితులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే అడ్డుకుంది వాస్తవం కాదా..

    - కోర్టులో కేసులు వేసి రాజధానిలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు..

    - తెలుగుదేశం పార్టీ అంటే లిటిగేషన్ పార్టీ...

    - బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తూ అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తి సీఎం జగన్..

    - అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలి..

  • 9 July 2020 3:36 PM GMT

    @  పశ్చిమగోదావరి

    - తెలంగాణ నుండి ఆంధ్రా కు మద్యం అక్రమంగా తరలిస్తున్న ఆంధ్రా పోలీసులు అరెస్ట్. .

    - చింతలపూడి మండలం లింగంగూడెం బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద

    - తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడిన అక్రమ మద్యం.

    - కృష్ణా జిల్లా బంటుమిల్లి ఎక్సయిజ్ సి.ఐ. పులి హనుశ్రీ, ప.గో.జిల్లా వి.ఆర్. ఎస్.ఐ. ఎం.విజయ కుమార్,

    - ఏలూరు కు చెందిన నున్న కమల్ సంతోష్ లను అరెస్ట్ చేసిన పోలీసులు...

    - నిందితుల వద్ద నుండి ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, 557 మద్యం సీసాలు స్వాధీనం.

    - పట్టుబడిన మద్యం విలువ ఆంధ్రాలో సుమారు ఐదు లక్షల రూపాయలు..

    - మద్యం అక్రమ రవాణాకు సహకరిస్తూ పారిపోయిన

    - ఎస్కార్ట్ వాహనం,డ్రైవర్ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.

  • 9 July 2020 3:13 PM GMT

    >> అమరావతి

    - మహిళలపై జరుగుతున్న దాడులపై డిజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసిన వాసిరెడ్డి పద్మ..

     - మహిళా కమిషన్.చైర్.పర్సన్.పద్మ

    - రాష్ట్రలో మహిళలపై జరుగుతున్న కేసులపై డిజీపీ తో చర్చించాం..

    - గుంటూరులో నగ్న వీడియోలు కేసు మరవకముందే మరో కేసు నమోదు అయ్యింది..

    - పోలీసుల పాత్రపై దృష్టి చెప్పాలని డిజీపీని కోరాం..

    - డీజీపీ సానుకూలంగా స్పందించారు..

    - ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం..

    - దిశా యాప్ ను మహిళలు అందరూ ఉపయోగించుకోవాలి..

    - మహిళ ఉద్యోగులను పై దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం..

    - సైబర్ నేరాలకు పాల్పడే వారిపై మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి..

  • 9 July 2020 2:13 PM GMT

    >>> మచిలీపట్నం

    - రేపటి నుండి నగరంలో ఉదయం 6-11గంటల వరకే వ్యాపారాలు

    - టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆర్డీఓ ఖాజావలీ

    - కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాం

    - కంటైన్మెంట్ జోన్ ల్లో ప్రజలు ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండి స్వీయ రక్షణ చర్యలు పాటించాలి

    - పోలీస్ సిబ్బందితో మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశాం

    - ఈ టీమ్ లు కంటైన్మెంట్ జోన్లలో నిత్యం పర్యవేక్షణ సాగిస్తారు

    - మాస్క్ ధారణపై మున్సిపల్, పోలీస్ సిబ్బందితో నగరంలో

    - ఉదయం 6-11గంటల మధ్య స్పెషల్ డ్రైవ్

    - మాస్క్ ధరించని వారికి జరిమానా విధించటంతో పాటు కేసులు నమోదు చేస్తాం

    - హోటల్స్ కూడా ఉదయం 6-11గంటల వరకే అనుమతి

    - ఆ తర్వాత టేక్ ఎ వేకు అనుమతి

  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై జగ్గారెడ్డి ఫైర్
    9 July 2020 1:52 PM GMT

    మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై జగ్గారెడ్డి ఫైర్

    - తలసాని టీడీపీ లో ఉన్నపుడు కేసీఆర్,హరీష్ రావు ని ఉరికించి కొడతా అన్నావు...

    - టీడీపీ లో చంద్రబాబు చెంచాగిరి చేశావు..

    - ఇప్పుడు టీఆరెస్ లో ఉండి చంద్రబాబు నే హైద్రాబాద్ కి వస్తే ఉరికించి కొడతా అన్నావు..

    - కేసీఆర్ చెంచాగిరి చేసింది చాలు..

    - ప్రతిపక్షాలు,కాంగ్రెస్ పార్టీ పై నోరు పరేసుకుంటే ఇక చూస్తూ ఉరుకొము.

    - ఇంతకుముందు కూడా చెప్పిన పైల్వాన్ గిరి బంద్ చేయమని..

    - నికంటే మేము ఎక్కువ మాట్లాడగలము, తిట్టగలము.

    - నీకు హైద్రాబాద్ లొనే పైల్వాన్లు ఉన్నరేమో మాకు రాష్త్రంతా ఉన్నారు..

    - నీవు ప్రజలకోసం కాకుండా కేసీఆర్ కుటుంబం ,నీ కుటుంబం కోసం పని చేస్తున్నావు..

    - ప్రజలకోసం చేయాలనుకుంటే గాంధీ హాస్పిటల్ కి కేసీఆర్ తో మాట్లాడి 3 వేల కోట్లు ఇప్పించి నీ మొగతనం నిరూపించుకో..

    - కారోనా ని ఆరోగ్య శ్రీ లో చేర్పించి నీ మొగతనం నిరూపించుకో..

    - కారోన వైద్యం కోసం ఆరోగ్య శ్రీ లో 10 వేల కోట్లు కాటాయించి నువ్వెంటో నిరూపించుకో..

    - నీ కుటుంబంలో ఎవరికైనా కారోన వస్తే ప్రాణాలు పోతే నీకు అప్పుడు ప్రజల బాధ తెలుస్తుంది..

    - ఇప్పటికైనా కేసీఆర్ ఈ రెండు రోజుల్లో కారోన ని ఆరోగ్య శ్రీ లో చేరుస్తున్నట్లు జీవో రావాలి

    - లేదంటే శనివారం కారోన రూల్స్ పాటిస్తూ ఒక రోజు దీక్ష చేస్తా..

    - దీక్ష చేసిన స్పందించకపోతే హైద్రాబాద్ కేంద్రంగా రోజు ఒక కార్యక్రమం చేస్తా...

    - కేసీఆర్ కొత్త సచివాలయం కేవలం తన నిషాని కోసం కట్టిస్తున్నాడు ..

    - ప్రజల డబ్బు 500 కోట్లు వృధా చేస్తున్నారు...

    - ఇప్పటికైనా ప్రజలకోసం ఆలోచించి ఆరోగ్య శ్రీ లో కారోనో ని చేరుస్తున్నట్లు ఆరోగ్య శ్రీ కి 10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు జీవో ఇవ్వండి..

Print Article
Next Story
More Stories