Live Updates:ఈరోజు (జూలై-08) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు బుధవారం, 08 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, కృష్ణపక్షం, తదియ (ఉ.09:18 వరకు), ధనిష్ట నక్షత్రం (తె.01:15వరకు) సూర్యోదయం 5:47am,సూర్యాస్తమయం 6:54pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 8 July 2020 4:39 PM GMT
తీపికబురు..! ఆరోగ్యశ్రీలోకి కరోనా చికిత్సలు
అమరావతి: కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్.జవహార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చుల వివరాలను కూడా ప్రకటించారు. కాగా ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా సోకిన వారితో పాటు కాంటాక్ట్ అయిన వారికి కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
- 8 July 2020 4:36 PM GMT
న్యూ ఢిల్లీ
- ఏపీకి కేంద్రం నుంచి రూ.491.41 కోట్లు విడుదల..
- ఆర్ధిక లోటు ఎదుర్కొంటున్న 14 రాష్ట్రాలకు 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు జులై నెలకు గాను కేంద్రం చేసే సహాయం కింద నిధులు విడుదల
- 8 July 2020 4:28 PM GMT
తెలంగాణ రాష్ట్రంలో భారీగా మరోసారి కోవిడ్ కేసులు నమోదు
- ఇవ్వాళ కొత్తగా 1924 కొరొనా పాజిటివ్ కేసులు
- ఇవ్వాళ కొత్తగా 11 మరణాలు-324కి చేరిన మరణాల సంఖ్య
- మొత్తం కేసుల సంఖ్య 29836
- ప్రస్తుతం ఆక్టివ్ గా 11933 ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడి
* GHMC-1590, రంగారెడ్డి-99, మేడ్చెల్-43, karimnagar-14, sangareddy-20, mahaboobnagar-15, nalgonda-31, nizamabad-19, warangal-rul-26, sirisilla-13
- ఇవ్వాళ డిచార్జ్-992 మొత్తం ఇప్పటి వరకు 17279 మంది
- 8 July 2020 2:54 PM GMT
- సీఎంఓలో మార్పులు చేర్పులు.
- సీఎం కార్యాలయంలోని అధికారులకు తాజాగా శాఖల కేటాయింపులు.
- సీఎం కార్యాలయం బాధ్యతలు నుంచి అజేయ్ కల్లాం, పీవీ రమేష్, జే. మురళి తప్పించిన సీఎం జగన్.
- ఆ ముగ్గురి బాధ్యతలను ప్రవీణ్ ప్రకాష్, సాల్మాన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు బదలాయింపు.
- ప్రవీణ్ ప్రకాష్ పరిధిలో..
జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయ శాఖ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, సీఎం డ్యాష్ బోర్డ్.
- సాల్మన్ ఆరోఖ్య రాజ్ పరిధిలో..
రవాణ, ఆర్ అండ్ బి, ఆర్టీసీ, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పీఆర్, సంక్షేమం, విద్యా, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ, గనులు, కార్మిక శాఖ.
- ధనుంజయ్ రెడ్డి పరిధిలో..
జలవనరులు, అటవీ, మున్సిపల్, వ్యవసాయం, వైద్యారోగ్యం, ఇంధనం, టూరిజం, మార్కెటింగ్, ఆర్ధిక శాఖ
- అజయ్ కలాం సి యం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలు మాత్రమే చూస్తారని తెలిసింది.
- 8 July 2020 2:33 PM GMT
@ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ
- కాశ్మీర్ ఉగ్రదాడి లో వీరమరణం పొందిన మన తెలంగాణ బిడ్డ శ్రీనివాస్ ఆర్మీ జవాను కు జోహార్లు అర్పించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- పెద్దపల్లి జిల్లాలో నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
👉 శ్రీనివాస్ జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందాడు
👉 జవాన్ శ్రీనివాస్ మరణం విషదాకారం
👉 దేశంకోసం ప్రాణాలను ఇచ్చిన జవాను కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
👉 రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంభంలో శ్రీనివాస్ జన్మించారు
👉 వెంటనే ప్రభుత్వం స్పందించి శ్రీనివాస్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి
👉 భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
👉 తమిళనాడు లో జవాన్ మరణిస్తే ప్రభుత్వం వెంటనే 20 లక్షల రూపాయలు ప్రకటించింది
👉 తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలి జవాన్ కుటుంబాన్ని ఆదుకోవాలి....
- 8 July 2020 2:32 PM GMT
@ అమరావతి
- వైయస్సార్ జయంతి రోజున రైతు దినోత్సవం
- రైతులకు లబ్ధి చేకూర్చే పలు కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
- తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వివిధ జిల్లాలలోని రైతులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన ముఖ్యమంత్రి.
- సున్నా వడ్డీ ప్రయోజనం ఇక నుంచి నేరుగా రైతులకే
- ఏటా సీజన్ ముగిసే నాటికి వారి ఖాతాల్లోనే నగదు జమ
- గత ప్రభుత్వం బకాయి పెట్టిన వడ్డీని చెల్లించిన ప్రభుత్వం
- రూ.1150 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ
- 57 లక్షల రైతులకు ప్రయోజనం కల్పించిన ప్రభుత్వం
- క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కిన సీఎం వైయస్ జగన్
- రైతు దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం
- రైతు భరోసా కేంద్రాలలో అధునాతన వ్యవసాయ యంత్రాలు
- రూ.1572 కోట్లతో యంత్రాలు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.
- 8 July 2020 2:31 PM GMT
@ బ్రేకింగ్...
- బైక్ పై ప్రగతి భవన్ exit గేట్ వైపు దూసుకొచ్చిన ఇద్దరు యువకులు.
- ప్రగతి భవన్ exit గేట్ వద్ద నిరసన తెలిపి వెళ్లిపోయిన యువకులు...
- మెరుపు వేగం తో రావడం తో పోలీస్ దొరకని యువకులు...
- ప్రగతి భవన్ వద్ద నిరసన కారుడు ప్లే కార్డు తో హాల్ చల్.
- ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ అంటూ ఆయన మా ముఖ్యమంత్రి ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం నా హక్కు అని ఇంగ్లీష్ లో ఉన్న ప్లే కార్డు ప్రదర్శించిన నిరసనకారుడు.
- 8 July 2020 11:23 AM GMT
కుప్పంలో కర్నాటక మద్యం హల్ చల్
కుప్పం: మండలంలోని డికేపల్లి పంచాయతీలో కర్నాటక మద్యం స్వైర విహారం చేస్తోందని సమాచారం అందించిన స్థానికులు.
- చీకటి పడగానే అమ్మకాలు ప్రారంభం అవుతాయని చెప్పిన స్థానికులు. దీనిపై పోలీసులు తగు చర్యలు చేపట్టాలని స్థానికులు పేర్కొన్నారు.
- అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయని ఆరోపించారు.
- 8 July 2020 11:12 AM GMT
ఘనంగా దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు
ముమ్మిడివరం: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్ళరేవు, ముమ్మిడివరం, కేసనకుర్రు, కాట్రేనికోన గ్రామాల్లో డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలను వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
- కేసనకుర్రులో దివంగత వైఎస్సార్ శిలా విగ్రహాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వై.సి.పి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- ఎమ్మెల్యే సతీష్ కుమార్ రైతు దినోత్సవంను పురస్కరించుకొని భారీ కేక్ ను కట్ చేశారు.
- ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పిన్నంరాజు వెంకట్ పతి రాజు, కాశి శ్రీహరి, బుడితి నాగన్న, చికం రాంబాబు, బాబిజి రాజు, పెద్ద బాబు, సలాది సే షారావు తదితరులు పాల్గొన్నారు.
- 8 July 2020 10:19 AM GMT
పొలం బాటలో ఎమ్మెల్యే జక్కంపూడి
కోరుకొండ: మండలం గాడాల - నిడిగట్ల గ్రామాల మధ్య రాజానగరం శాసనసభ్యులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా రైతు దినోత్సవ వేడుకను నిర్వహించి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఆయన రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావుల విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని తానే స్వయంగా సేద్యం చేస్తున్న వరి పొలంలో వ్యవసాయ కూలీలతో ఆయన వరి నారును పీకి కట్టలు కట్టి వరి నాట్లు వేసి రైతులకు మార్గదర్శిగా నిలిచారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నేలమట్టం చేసిందని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయం దండగ అందని, వ్యవసాయ రంగాన్ని ప్రస్తుత జగనన్న ప్రభుత్వం వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు.
- జగనన్న పాదయాత్రలో భాగంగా వేల కిలోమీటర్లు నడిచి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని వారికి కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చడానికి కంకణం కట్టుకున్నారని తెలిపారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire