Live Updates:ఈరోజు (జూలై-06) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు ఆదివారం, 06 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, కృష్ణపక్షం, పాడ్యమి (ఉ.09:21రకు), ఉత్తరాషాఢ నక్షత్రం (రా.11:12వరకు) సూర్యోదయం 5:47am,సూర్యాస్తమయం 6:54pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 July 2020 4:26 PM GMT
- తెలంగాణ రాష్ట్రంలో భారీగా మరోసారి కోవిడ్ కేసులు నమోదు
- ఇవ్వాళ కొత్తగా 1831 కొరొనా పాజిటివ్ కేసులు
- ఇవ్వాళ కొత్తగా 11 మరణాలు-306కి చేరిన మరణాల సంఖ్య
- మొత్తం కేసుల సంఖ్య 25733
- ప్రస్తుతం ఆక్టివ్ గా 10 646 ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడి
* GHMC-1419, రంగారెడ్డి-160, మేడ్చెల్-117,
- మెదక్-20, మంచిర్యాల-20, ఖమ్మం-21 కేసులు నమోదు*
- ఇవ్వాళ డిచార్జ్-2078 మొత్తం ఇప్పటి వరకు 14 781 మంది
- 6 July 2020 2:23 PM GMT
ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు.. వారంలో ఆ రెండు రోజులు విధులకు రావాల్సిందే..
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉపాధ్యాయులు మళ్లీ బడి బాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ప్రతి సోమ, మంగళవారాల్లో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి ప్రాథమిక పాఠశాల టీచర్లు వారంలో ఒక రోజు.. ప్రతి మంగళవారం హాజరు కావాలని పేర్కొంది. బ్రిడ్జి కోర్సులను రూపొందించేందుకు టీచర్లంతా స్కూళ్లకు వెళ్లాలని ఆదేశించింది. నాడు నేడు కార్యక్రమాన్ని అన్ని స్కూళ్లలో ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
మన బడి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం, స్కూల్ భవనాలన్నింటికీ కొత్తగా పెయింటింగ్స్ వేయిస్తోంది. ఆ రంగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ చినవీరభద్రుడితో పాటు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
- 6 July 2020 11:07 AM GMT
చెక్ డ్యామ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నోముల
అనుముల: మండలం పులిమామిడి గ్రామం వాగు వద్ద 5 కోట్లతో నిర్వహించ తలపెట్టిన చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం వృధాగా పోతున్న వాగులు వంకలు పై చెక్ డ్యాంల నిర్మాణం కోసం ప్రత్యేక దృష్టి సారించిందని, దానిలో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి పది చెక్ డ్యాములు మంజూరు చేసిన కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపినారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిలో వ్యవసాయం ప్రధానంగా ఉన్నది చెక్ డ్యామ్ ల వలన నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు భూగర్భ జలాలు పెంపొందించుకోవడంలో ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి, వైస్ చైర్మన్, ఇరిగి పెద్దలు, ఎంపీపీ సుమతి పురుషోత్తం, మాజీ ఆప్కాబ్, చైర్మన్ ఎడవెల్లి విజయేంద్ర రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
- 6 July 2020 11:02 AM GMT
బోనకల్ లో గడ్డిమందు పట్టివేత
బోనకల్: బోనకల్ మరియు రావినూతలలో పలు పురుగు మందు షాపుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
- షాపులో అక్రమంగా అమ్ముతున్న నిషేధిత గ్లైఫోసేట్ పురుగు మందులను సుమారు .రూ.5,54,035 / - విలువైన 128 కాటన్లను పట్టుకున్నారు.
- ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ రఘుతో పాటుగా బోనకల్ ఎస్.ఐ కొండలరావు పాల్గొన్నారు.
- 6 July 2020 11:00 AM GMT
అక్రమ ఇసుక వేలం పాటలో రెవిన్యూశాఖకు రూ.14,200 ఆదాయం
బిచ్కుంద: మండలంలోని పుల్కల్ గ్రామ మంజీర నది నుండి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్ లను పట్టుకొని పోలీస్ స్టేషన్లో ఉంచిన విషయం అందరికి తెల్సిందే.
- ఈ పట్టుబడ్డ ఇసుకను సోమవారం రెవిన్యూ అధికారులు పోలీస్ స్టేషన్ ఆవరణలో వేలం పాట నిర్వహించగా రెవిన్యూకు 14వేల 2వంద రూపాయలు ఆదాయం చేకూరినట్లు తహాసీల్దార్ కార్యాలయ సీనియర్ సహాయకులు రచప్ప తెలిపారు.
- వేలంపాటలో పలువురు పాల్గొనగా ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు 3600రూపాయలు చొప్పున మరో రెండు ట్రాక్టర్ లకు ఒక్కోక్కటికి 3,500 రూపాయల చొప్పున వేలం పాట పాడడంతో మొత్తం రెవిన్యూ శాఖకు 14,200రూపాయలు ఆదాయం చేకూరిందని అన్నారు.
- 6 July 2020 10:55 AM GMT
అనకాపల్లి పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించిన డీజీపీ
అనకాపల్లి: రూ.2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన పట్టణ పోలీస్ స్టేషన్ భవన సముదాయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు.
- గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ భవనం ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భవనాన్ని డీజీపీ పరిశీలించారు.
- అనంతరం పోలీసు అతిథి గృహంలో సిబ్బందితో సమావేశమయ్యారు.
- 6 July 2020 10:50 AM GMT
పంట కాలవ లోకి దూసుకెళ్లిన కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలు
రోలుగుంట: సమీపంలో పంట కాలువలో కారు దూసుకెళ్లింది. సోమవారం తెల్లవారుజామున నర్సీపట్నం నుంచి చోడవరం వెళ్తున్న కారు రోలుగుంట కొత్త చెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్పంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు.
- 6 July 2020 10:36 AM GMT
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా!
అమరావతి: ఎల్లుండి చేపట్టాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసిన ప్రభుత్వం
- ఆగస్టు 15న ఇళ్ల పట్టాలను పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం
- 6 July 2020 10:28 AM GMT
92వార్డ్ పద్మనాభ పురం హౌసింగ్ కాలనీ వద్ద టిడిపి నాయకులు నిరసన
గోపాలపట్నం :తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదేశాల ప్రకారం టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
- టీడీపీ ప్రభుత్వ హయాం లో అర్హులైనా పేదలందరికి ఇళ్లులు కేటాయించాడం జరిగింది. పేదలకు చెందాల్సిన ఇల్లులను వైసీపీ ప్రభుత్వం పనులను అసంపూర్తిగా వుంచింది.
- ఉన్న గృహ నిర్మాణ పనులను వెంటనే మొదలు పెట్టి పూర్తి చేయాలని మరియుబి ఎల్ సి స్కీము ద్వారా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్దిదారులందరికి వెంటనే బకాయిలు చెల్లించాలి.
- 92వార్డ్ పద్మనాభ పురం హౌసింగ్ కాలనీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
- ఈ నిరసన కార్యక్రమం నందు టీడీపీ 90వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బొమ్మిడి రమణ, 91వ వార్డు ప్రెసిడెంట్ నారిపిన్ని సత్తిరాజు 90వ వార్డు ప్రెసిడెంట్ నమ్మి శ్రీను89వ వార్డు ప్రెసిడెంట్ బొడ్డేటి విజయ్, నందవరపు సోములు, యలమంచిలి ప్రసాద్, నరవ పైడిరాజు, మొదలగున్న వారు పాల్గొన్నారు.
- 6 July 2020 8:01 AM GMT
పరవాడ గ్యాస్ లీక్ ఘటనపై నేడు గ్రీన్ ట్రైబ్యునల్‌లో విచారణ
- విశాఖలో గత నెల 30న సాయినార్ లైఫ్ సైన్సెస్‌లో గ్యాస్ లీక్
- ఇద్దరు ఉద్యోగులు మృతి, నలుగురికి గాయాలు
- సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించిన ఎన్‌జీటీ
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire