Live Updates:ఈరోజు (ఆగస్టు-04) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్టు-04) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 ఆగస్టు, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం, 04 ఆగస్టు, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పాడ్యమి (రాత్రి 8-52 వరకు) తదుపరి విదియ, శ్రవణ నక్షత్రం (ఉ. 8-15 వరకు) తర్వాత ధనిష్ఠ నక్షత్రం.. అమృత ఘడియలు ( రాత్రి 10-29 నుంచి 12-09 వరకు), వర్జ్యం (మ. 12-26 నుంచి 2-06 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-15 నుంచి 9-06 వరకు తిరిగి రాత్రి 10-58 నుంచి 11-43 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 4 Aug 2020 12:19 PM GMT

    వరంగల్ అర్బన్:

    కరోనా మహమ్మరికి బలైన GWMC 29వ డివిజన్ కార్పోరేటర్ కావేటి కవిత భర్త..

    గత కొద్దిరోజులుగా హైదరాబాద్ లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కన్నుమూసిన కావేటి రాజు ( 39 )

    కోవిడ్ పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన రాజు. కొద్దిసేపటి క్రితం మృతి.

    రాజు జాతీయ స్థాయి జూడో క్రీడాకారుడు.

  • మహబూబాబాద్ తండాలో ఉద్రిక్తత..  యువ‌కుడి మృతి
    4 Aug 2020 6:20 AM GMT

    మహబూబాబాద్ తండాలో ఉద్రిక్తత.. యువ‌కుడి మృతి

    మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండలం రౌతుగూడెం తండాలో ఉద్రిక్తత

    - పొలంగట్టు వివాదంలో ఆంగోతు బాలుపై ప్రత్యర్థులు బాబూలాల్, హత్తిరామ్ దాడి, తీవ్ర గాయాలు

    - ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో బాలు మృతి

    - ప్రత్యర్థి హత్తిరామ్ ఇంటిని, ట్రాక్టర్ ను తగలబెట్టిన మృతుడి బంధువులు

  • హాస్పిటల్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
    4 Aug 2020 6:16 AM GMT

    హాస్పిటల్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

    వరంగల్ అర్బన్: కాకతీయ మెడికల్ కాలేజీలో పియంయస్ యస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇన్చార్జి కలెక్టర్ హరిత మరియు జిల్లా ఉన్నత అధికారులు

  • యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌
    4 Aug 2020 6:13 AM GMT

    యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

    మెదక్ జిల్లాచేగుంట మండలం చిన్న శివనూర్ లో నీటి గుంటలో పడి డబిల్ పూర్ ప్రాంతానికి చెందిన నాగరాజ్ (38) ఆత్మహత్య

  • 4 Aug 2020 6:12 AM GMT

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :  చర్ల మండలం తాలిపేరు ప్రోజెక్టు 2 గేట్లు ఎత్తి 2623 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేసిన అధికారులు

  • సున్నం రాజయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం
    4 Aug 2020 6:08 AM GMT

    సున్నం రాజయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం

    ఖమ్మం: సున్నం రాజయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం

    - సిపిఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు,

    - భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మరణించడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.

    - వారి మరణం తీరని లోటని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు . వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాని తెలిపిన మంత్రి

  • సున్నం రాజయ్య మృతి ప‌ట్ల పోచారం సంతాపం
    4 Aug 2020 6:04 AM GMT

    సున్నం రాజయ్య మృతి ప‌ట్ల పోచారం సంతాపం

    భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి ప‌ట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.

    నిజాయితీ, నిబద్ధత కలిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడు సున్నం రాజయ్య అని తెలిపారు.

    సున్నం రాజయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు.

  • వంగపండు  మృతిపై మంత్రి ఎర్ర‌బెల్లి సంతాపం
    4 Aug 2020 5:57 AM GMT

    వంగపండు మృతిపై మంత్రి ఎర్ర‌బెల్లి సంతాపం

    వరంగల్: ప్రముఖ వాగ్గేయకారుడు, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద రావు గారి మృతికి తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేసిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

  • 4 Aug 2020 2:05 AM GMT

    శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి

    నిజామాబాద్

    ఇన్ ఫ్లో 7578 క్యూసెక్యులు.

    ఔట్ ఫ్లో 7578 క్యూసెక్యులు

    ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు

    ప్రస్తుత నీటి మట్టం 1074 అడుగులు

    నీటి సామర్థ్యం 90 టీఎంసీలు

    ప్రస్తుతం 38,778 టీఎంసీలు

  • 4 Aug 2020 1:56 AM GMT

    శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి

    నిజామాబాద్

    ఇన్ ఫ్లో 7578 క్యూసెక్యులు.

    ఔట్ ఫ్లో 7578 క్యూసెక్యులు

    ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు

    ప్రస్తుత నీటి మట్టం 1074 అడుగులు

    నీటి సామర్థ్యం 90 టీఎంసీలు

    ప్రస్తుతం 38,778 టీఎంసీలు

Print Article
Next Story
More Stories