ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం, 31 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం త్రయోదశి (ఉ. 8-35 వరకు) తదుపరి చతుర్దశి. శ్రవణ నక్షత్రం (మ. 3-53 వరకు) తదుపరి ధనిష్ఠ, అమృత ఘడియలు (ఉ. 6-57 వరకు) వర్జ్యం (రా. 8-02 నుంచి 9-42 వరకు) దుర్ముహూర్తం (మ. 12-25 నుంచి 1-15 వరకు తిరిగి మ.2-54 నుంచి 3-44 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-13
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 31 Aug 2020 4:21 AM GMT
Mulugu District updates: వాజేడు మండలం బొగత జలపాతంలో ఒకరు గల్లంతు..
ములుగు జిల్లా..
-వాజేడు మండలం బొగత జలపాతంలో ఒకరు గల్లంతు..
-హన్మకొండ కి చెందిన కుడిసాల గోపి చంద్(24) సం
-బొగత జలపాతం సందర్శనకు అధికారులు నిలిపివేయడంతో మరొక మార్గంలో వెళ్లి ప్రమాదం
- 31 Aug 2020 3:12 AM GMT
TS High court updates: ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, నూతన నిర్మాణం పై నేడు హైకోర్టు విచారణ...
టీఎస్ హైకోర్టు...
-ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, నూతన నిర్మాణం పై నేడు హైకోర్టు విచారణ...
-ఉస్మానియా ఆసుపత్రి పై ఇప్పటి వరకు ధాఖలైన పిటిషన్ల పై పూర్తి వివరాలతో నేడు కౌంటర్ ధాఖలు చేయనున్న ప్రభుత్వం..
-కూల్చివేత నిలిపి వేయాలని పలు పిటీషన్లు ధాఖలు...
-కూల్చివేత చేపట్టి నూతన నిర్మాణం చేపట్టాలని పలు పిటిషన్లు..
-అన్ని పిటిషన్ల ను కలిపి విచారించనున్న హైకోర్టు....
- 31 Aug 2020 3:10 AM GMT
Mulugu District updates: ఏటూరునాగారం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద పెరుగుతున్న గోదావరి..
ములుగు జిల్లా:
-ఏటూరునాగారం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద పెరుగుతున్న గోదావరి..
-ప్రస్తుత నీటిమట్టం 6.230 మీటర్లు.
-ఎగువునా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరడంతో నిండు కుండలగా గోదావరి పరవళ్లు తొక్కుతోంది
- 31 Aug 2020 3:04 AM GMT
Warangal Urban updates: శివనగర్ లోని కొల్లూరు మధుసూదన్ ఇంట్లో కోటి 7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..
వరంగల్ అర్భన్..
-వరంగల్ శివనగర్ లోని కొల్లూరు మధుసూదన్ ఇంట్లో కోటి 7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..
-నగదుకు సంభందించి ఆధారాలు సరిగా చూపకపోవడంతో నగదును సీజ్ చేసిన పోలీసులు.
- 31 Aug 2020 3:00 AM GMT
Warangal Rural updates: దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం..
వరంగల్ రూరల్ జిల్లా ....
-దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం..
-భార్యా భర్తల దుర్మరణం.
-ములుగు జిల్లా యాపలగడ్డకు చెందిన తాడెం శ్రీనివాస్(40), తాడెం సమత(35) లు .
-ఒగ్లాపూర్ మీదుగా వరంగల్ కి ద్విచక్రవాహనంపై వెళ్తుంటే ఒగ్లాపూర్-తక్కళ్లపహాడ్ గ్రామాలు మధ్య ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీ .
-తాడెం శ్రీనివాస్(40) అక్కడిక్కకడే మృతి చెందగా భార్య సమత(35) ఆస్పత్రి కి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
- 31 Aug 2020 2:57 AM GMT
Warangal-Mulugu updates: మావోలకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్ల కలకలం....
ములుగు జిల్లా..
-మావోలకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్ల కలకలం....
-వెంకటాపురం మండలం
-చొక్కాల, వీర్రభద్రవరం, అంకన్నగూడెం, రామచంద్రాపురం, ప్రధాన జాతీయ రహదారిపై మావోయిస్టులకు వ్యతిరేఖంగా వెలువడిన పోస్టర్లు...
-ఆరా తీస్తున్న పోలీసులు
-తెలంగాణ నుంచి ప్రజలు మావోయిస్టు లను తరిమికొట్టాలని అభివృద్ధికి ఆటంకమని, అమాయక ఆదివాసి గిరిజనులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ సామాజిక వర్గాలు వెనుకబాటుతనానికి మావోయిస్టులే కారణమని విమర్శించారు
- 31 Aug 2020 2:52 AM GMT
Telangana updates: ఈ రోజు జరగబోయే ఈసెట్ ప్రవేశ పరీక్ష కు ఏర్పాట్లు పూర్తి..
-తెలంగాణ లో ఈ రోజు జరగబోయే ఈసెట్ ప్రవేశ పరీక్ష కు ఏర్పాట్లు పూర్తి
-ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండు విడతలుగా జరగనున్న పరిక్ష
-కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసిన జేఎన్టీయూ హైదరాబాద్
-28015 మంది అభ్యర్థులు హాజరు కానున్న టి యస్ ఈసెట్
- 31 Aug 2020 1:59 AM GMT
Adilabad district updates: గాదిగూడ మండలంలో కౌటాల గ్రామ సమీపంలో పులి సంచారం..
ఆదిలాబాద్ జిల్లా..
-గాదిగూడ మండలంలో కౌటాల గ్రామ సమీపంలో పులి సంచారం..
-కుమ్రా ఇస్రో అనే రైతు పశువులను మేత కోసం తీసుకెళ్తుండగా ఎద్దుల పై దాడి....
-ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి...
-వెంటనే గ్రామస్తులు సమాచారం అందించడంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ
-అటవీశాఖ అధికారులకు సమాచారం అందించిన పోలీసులు
-అందోళన చెందుతున్న గ్రామస్థులు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire