ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం, 31 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం త్రయోదశి (ఉ. 8-35 వరకు) తదుపరి చతుర్దశి. శ్రవణ నక్షత్రం (మ. 3-53 వరకు) తదుపరి ధనిష్ఠ, అమృత ఘడియలు (ఉ. 6-57 వరకు) వర్జ్యం (రా. 8-02 నుంచి 9-42 వరకు) దుర్ముహూర్తం (మ. 12-25 నుంచి 1-15 వరకు తిరిగి మ.2-54 నుంచి 3-44 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-13
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 31 Aug 2020 2:15 PM GMT
corona Updates In siddipet: చేర్యాల లో కరోనా కలకలం
సిద్దిపేట: చేర్యాల పట్టణ కేంద్రంలో కరోన పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరగడం తో. రేపటి నుండి వర్తక వాణిజ్య సంస్థలు
మరియు మద్యం దుకాణాలు ఇతర వ్యాపారస్తులు మ:2 గం వరకు బంద్ చేయాలని మున్సిపల్ పాలక వర్గం తీర్మానించారు
- 31 Aug 2020 2:00 PM GMT
Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల కెసిఆర్ దిగ్భ్రాంతి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమన్నారు.
తెలంగాణ అంశంతో ప్రణబ్ కు ఎంతో అనుబంధం ఉందని సిఎం అన్నారు.
యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర డిమాండ్ లో న్యాయం ఉందని భావించే వారని, తాను కలిసిన ప్రతీ సారి ఎన్నో విలువైన సూచనలు చేసే వారని సిఎం గుర్తు చేసుకున్నారు.
ఒక నాయకుడికి ఉద్యమాన్ని ప్రారంభించి, విజయతీరాలకు చేర్చే అవకాశం దక్కడం అరుదుగా సంభవిస్తుందని, ఆ ఘనత తనకు (కేసీఆర్ కు) దక్కిందని అని తనను ప్రత్యేకంగా అభినందించారని కేసీఆర్ చెప్పారు.
ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ద కొయలేషన్ ఇయర్స్’ పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని, కేసీఆర్ కు తెలంగాణ అంశమే తప్ప పోర్టు ఫోలియో అక్కరలేదని పేర్కన్నారని గుర్తు చేశారు.
దీన్ని బట్టి తన జీవితకాలంలో తెలంగాణ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదిగా గుర్తించినట్లు అర్థమవుతున్నదని కేసీఆర్ అన్నారు.
యాదాద్రి దేవాలయన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారన్నారు.
ప్రణబ్ మరణం తీరని లోటని సిఎం బాధను వ్యక్తం చేశారు.
వ్యక్తిగతంగా తన తరుఫున, తెలంగాణ ప్రజల తరుఫున ప్రణబ్ కు నివాళి అర్పించారు.
ప్రణబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- 31 Aug 2020 1:54 PM GMT
దెబ్బతిన్న పంట చేలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్
మహబూబాబాద్ జిల్లా: కేసముద్రం మండలం లో వర్షం తో దెబ్బతిన్న పంట చేలను పరిశీలించి, రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి...
- 31 Aug 2020 1:50 PM GMT
Corona Treatment: కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని పొగాకు జయరాం డిమాండ్
కరోన ని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జయరాం ఎన్టీఆర్ భవన్ లో 48 గంటల దీక్ష....
నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేసిన టీటీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ, జాతీయ అధికార ప్రతినిధి కొత్త కొట దయాకర్ రెడ్డి గారు, క్రమశిక్షణ కమిటీ సభ్యులు శ్రీ.బక్కని నర్సింహులు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ.సామా భూపాల్ రెడ్డి ముఖ్య నాయకులు,..
పార్టీ కార్యకర్తలు వారి మద్దతును జైరామ్ చందర్ గారికి తమ మద్దతు తెలియజేసి, వారి నిరాహారదిక్షకు సంఘీ భావం తెలియజేశారు.
- 31 Aug 2020 1:43 PM GMT
Laxmi Barrage: లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు
పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
ప్రస్తుత సామర్థ్యం 96.30 మీటర్లు
పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ
ప్రస్తుత సామర్థ్యం 6.691 టీఎంసీ
ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 7,02,900 క్యూసెక్కులు
- 31 Aug 2020 1:40 PM GMT
MLA Harish Rao: పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తాం: మంత్రి హరీష్ రావు
ఆర్ధిక మంత్రి హరీష్ రావు @ ఎంహెచ్ఆర్డీ...
రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామన్న మంత్రి హరీష్ రావు
జీఎస్టీ నిధులపై తెలంగాణకు కేంద్రం చేస్తోన్న అన్యాయంపై న్యాయస్థానాల్లో సైతం పోరాటం చేస్తాం
కరోనా పేరుతో రాష్ట్రాలకు రావాల్సిన లక్ష 35వేల కోట్లను కేంద్రం ఎగ్గొట్టాలని చూస్తోంది
జీఎస్టీ నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించాల్సిన బాధ్యత కేంద్రానిదే.
కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోంది
ఆదాయం పెంచుకోవటంలో కేంద్రానికికున్న అవకాశాలు రాష్ట్రాలకు ఉండవు
విపత్కర పరిస్థితుల్లో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి
కేంద్రానికి మాత్రమే కాదు.. రాష్ట్రాలకు సైతం కరోనా ప్రభావముంది
సెస్ రూపంలో తెలంగాణ చెల్లించింది ఎక్కువ.. తీసుకుంది తక్కువ
జీఎస్టీలో చేరటం తెలంగాణకు శాపంగా మారింది
పార్లమెంట్ లో తాను చేసిన చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తోంది
దేశ ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీలో చేరింది
జీఎస్టీలో చేరటం వలన తెలంగాణ ప్రభుత్వం 25వేల కోట్లు నష్టపోయింది
రాష్ట్రాలకు నష్టపరిహారాన్ని కేంద్రమే చెల్లించాలని అటార్ని జనరల్ సైతం చెప్పారు
లీగల్ గా, మోరల్ గా కేంద్రం రాష్ట్రలకు జీఎస్టీ నష్టపరిహారం చెల్లించాల్సిందే
ఇప్పటి వరకు జిఎస్టీ ప్రారంభం అయినప్పటి నుండి 18వేల30 కోట్లు మేము కేంద్రానికి ఇస్తే కేంద్రం నుండి రాష్ట్రానికి కేవలం 3వేల కోట్లు మాత్రమే వచ్చాయి...
జిఎస్టీ పై ప్రారంభం లోనే అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. దేశ ప్రయోజనాల కోసం మాత్రమే చేరాం...
ఎఫ్ఆర్బిఎం లో రాష్ట్రానికి 3 శాతం ఇస్తే కేంద్రం 5 శాతం తీసుకుంటుంది...
తెలంగాణ తో పాటు పశ్చిమబెంగాల్, ఢిల్లీ,కేరళ పంజాబ్,రాజస్థాన్ ఈ ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొన్నాయి...
కేంద్ర ప్రభుత్వమే లోన్ తీసుకొని పూర్తి స్థాయిలో జిఎస్టీ ద్వారా రాష్ట్రాలకు రావాల్సిన సెస్ చెల్లించాలి...
- 31 Aug 2020 1:35 PM GMT
TNGO News: ఏడేళ్లుగా ఉద్యోగుల పీఆర్సీ పెండిగ్ లోనే: టీఎన్జీవో అధ్యక్షుడు
మామిళ్ల.రాజేందర్ నూతన టీఎన్జీవో అధ్యక్షుడు: 11వ TNGO అధ్యక్షుడుగా నాకు అవకాశం ఇచ్చారు.
నన్ను ఎన్నుకున్న 33 జిల్లాల అధ్యక్షులకు ఉద్యోగులందరికి ధన్యవాదాలు.
ఇకముందు ప్రభుత్వం తో అరమరికలు లేకుండా పోరాటం చేస్తాము.
ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీలు వెంటనే ఇవ్వండి.
ఉద్యోగుల మూడు డీఏలు పెండిగ్లో ఉన్నాయి వాటిని విడుదల చేయాలి.
ఆంధ్రలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలి.
సీపీఎస్ ఉద్యోగుల పోరాటానికి బాసటగా నిలుస్తాము.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాలు అన్నిచేస్తున్నారు ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నా.
మా మొరను కేసీఆర్ ఆలకించాలని వేడుకుంటున్న
కేసీఆర్ బోలా శంకరుడు..ఏది కోరినా ఇస్తాడు.. మాకు రావాల్సిన రాయితీలన్ని ఇవ్వండి.
7ఏండ్లుగా ఉద్యోగుల పీఆర్సీ పెండిగ్లో ఉంది.
ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయండి.
కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచి ఒక్క అర్ద గంట సమయం కేటాయించి మా గోడు వినండి.
ఉద్యోగులు కష్టపడి చేస్తుంటేనే రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది.
త్వరలోనే ఉద్యోగసంఘాల సమావేశం పెట్టికుని సమస్యలపై చర్చిస్తాము.
- 31 Aug 2020 11:58 AM GMT
ఉగ్రవాదులు నన్ను టార్గెట్ చేశారు: రాజసింగ్
గోషామల్ ఎమ్మెల్యే రాజసింగ్: గతంలో మా పై ఉగ్రవాదులు టార్గెట్ చేశారు అందులో లోకల్ ఆర్గనైజేషన్ ఐఎస్ఐ వారు కూడా ఉన్నారు..
ఇప్పుడు మళ్లీ నేను టార్గెట్ లో ఉన్నాను అంటూ కమిషనర్ నాకు లేఖ రాశారు..
ఎవరి నుండి నాకు ప్రాణహాని ఉందో తెలపాలని హోం మంత్రి మహమూద్ అలీ ని కోరాను..
బుల్లెట్ పై తిరిగి వద్దంటూ కమిషనర్ నన్ను కోరారు..
నాకు ఎవరి నుండి ప్రాణహాని ఉందో తెలిస్తే నేను అలర్ట్ గా ఉండేందుకు అవకాశం ఉంటుంది..
హోం మంత్రి మహమూద్ అలీ సానుకూలంగా స్పందించారు సంతోషం..
పాతబస్తీలో మొహరం పెద్ద ఎత్తున జరిగింది..
వేలాదిమంది ర్యాలీలో పాల్గొన్నారు వారికి పర్మిషన్ ఎవరిచ్చారు చెప్పాలి..
గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోంటే పోలీసులు మాపైనా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు..
- 31 Aug 2020 11:53 AM GMT
Jagga reddy:కేసీఆర్ జనం మర్చిపోయేన్నీ హామీలు ఇస్తున్నారు: జగ్గారెడ్డి
జగ్గారెడ్డి ..సంగారెడ్డి ఎమ్మెల్యే.
సంగారెడ్డి లో 40 వేల మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం ని కోరాను
సంగారెడ్డి లో మెడికల్ కాలేజీ త్వరలోనే మంజూరు చేస్తా అని సీఎం అసెంబ్లీలో చెప్పినా అమలు కాలేదు
జనం మర్చిపోయేన్నీ హామీలు ఇస్తున్నారు కేసీఆర్
సెప్టెంబర్2 న కలిసేందుకు అపోయింట్మెంట్ కోరిన జగ్గారెడ్డి .
ప్రజల సమస్యలపై సీఎం ను కలుస్తా
సీఎం అపోయింట్మెంట్ ఇస్తే కలిసి సమస్య పరిష్కారం కోరత.
సెప్టెంబర్2 న అపోయింట్మెంట్ రాకుంటే... నేను, నా కూతురు ప్రగతి భవన్ ముందు కూర్చుంటాం .
ఎన్నికల్లో నా తరుపున కూతురు ఎన్నికల ప్రచారం చేసింది కాబట్టి...ఇద్దరం ప్రగతి భవన్ కి వెళతాం.
రుణమాఫీ రెండేండ్లు ఐతున్నా..ఇవ్వలేదు
దళితులకు మూడెకరాల భూమి ఏమైంది.?
నా కూతురు జయరెడ్డి ఎన్నికల్లో పోటీపై ఇప్పుడు నిర్ణయం తీసుకోలేదు.
టీఆరెస్ ఎమ్మెల్యే లకు సీఎం ఏడాదికో సారి అపోయింట్మెంట్ ఇస్తారు.
సమస్యల కోసం కాకుండా...పుట్టినరోజు నాడు మాత్రం సీఎం అపోయింట్మెంట్ దొరుకుతుంది .
బర్త్ డే ఆశీర్వాదం కోసమే వెళ్తున్నారు తప్పితే... ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాత్రం వెళ్లడం లేదు.
- 31 Aug 2020 10:15 AM GMT
కామారెడ్డి :
రామారెడ్డి మండలంలోని మోషంపూర్ గ్రామంలో యూరియా కొరత.
యూరియా కోసం ఉదయం 6 గంటల నుంచి బారులు తీరిన రైతులు.
క్యూ లైన్ లో చెప్పులు ఉంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire